వెదజల్లే పద్దతిలో తక్కువపెట్టుబడితో అధిక దిగుబడి.

వెదజల్లే పద్దతిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుంది…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

వెదజల్లే పద్దతిలో విత్తనాలు నేరుగా పొలంలో చల్లడం ద్వారా, నారు తీసి నాటడం అవసరం ఉండదని కూలీల ఖర్చు, విత్తనాల అవసరం తగ్గి తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధించవచ్చు అని గార్ల వ్యవసాయధికారి కావటి రామారావు అన్నారు.శుక్రవారం దుబ్బగూడెం గ్రామం లో రైతులకు నేరుగా విత్తనాలు వెధజల్లే పద్ధతి పై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,తక్కువ పెట్టుబడితో నాటు అవసరం లేకుండా నారు మడి ఖర్చు లేకుండా నేరుగా విత్తనాలు వేదజల్లుకోవాలని సూచించారు.ఈ విధానం లో కూలీల అవసరం ఉండదని ఎకరాకు 6 వేల నుండి 8 వేల వరకు పెట్టుబడి ఆదా అవుతుందని,రైతులకు ఎంతో శ్రేయస్కరం లాభదయాకమని అందరూ ఈ విధానాన్ని అవలంభించి లాభాలు గడించాలని సూచించారు.ఈ పద్దతిలో విత్తనాలు చల్లిన 2 రోజుల్లో ఒక ఎకరాకు పెండిమెతలిన్ ఒక లీటర్ పిచికారీ చేయాలనీ,విత్తనాలు చల్లిన 25 రోజుల తర్వాత నామినీ గోల్డ్ కానీ కౌన్సిల్ యాక్టీవ్ గాని వివాయ గాని పిచికారీ చేసి కలుపు నివారించుకోవాలని తెలిపారు.ఎరువులు ఆఖరి దుక్కిలో డిఏపి ని 20 రోజులు తర్వాత యూరియా తో పాటు పొటాస్ 20కేజీ లు వేసుకోవాలని అన్నారు.చిరుపొట్ట దశలో 30 కేజీ లు యూరియా తో పాటు 15 కేజీ ల పొటాష్ వాడాలని, అవసరం మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని సూచించారు.ఈ పద్ధతి లో నాటు పద్ధతి కంటే 10 రోజులు ముందుగా వరి కోతకు వస్తుందని అన్ని కంకులు ఒకే సారి ఈనిక దశకు వస్తాయని, చీడ పీడల నివారణ సాధ్యమవుతుందని సూచించారు.ఈ కార్యక్రమం లో ఏఈఓ మేఘన,రైతులు తదితరులు పాల్గొన్నారు.

రైతులు తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చు.!

ఫామ్ ఆయిల్ తోటలతో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు

రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామములో రైతు బోయినీ.వాసు 4ఎకరాలతో సాగు చేస్తున్న ఫామ్ ఆయిల్ తోటను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు భవిష్యత్తు ప్రయోజనాల కోసం తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ ఆయిల్ తోటలు పట్ల రైతులకు అవగాహన కల్పించి సాగు దిశగా ప్రోత్సహించామని నిరంజన్ రెడ్డి అన్నారు.ఫామ్ ఆయిల్ తోటల వల్ల రైతులు దీర్ఘకాల ఆదాయం లాబాలు పొందుతూ అదేవిధంగా అంతర్గత కొత్త రాకాల పంటల వేసుకొని జీవనోపాధి పొందవచ్చని అన్నారు.మార్కెట్లో ఫామ్ ఆయిల్ మంచి గిరాకీ ఉన్నదని భవిష్యత్తు మొత్తం ఫాం ఆయిల్ తోటలది మాజీ మంత్రి అన్నారు. పంట సాగు చేస్తున్న వాసుకు సూచనలు చేసి అభినందించారు. మాజీ మంత్రి
నిరంజన్ రెడ్డి వెంట మాజీ సర్పంచ్ శారద ఆశన్న నాయుడు, చిట్యాల.రాము,నరసింహ,బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు ఉన్నారని మీడియా ఇంచార్జి నందిమల్ల అశోక్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version