అయినవోలులో వెటర్నరీ సేవలు లేవా? వైద్యులు రారా…

అయినవోలులో వెటర్నరీ సేవలు లేవా? వైద్యులు రారా ?
– దర్శనమిస్తున్న ఖాళీ గోడలు మూసివేసిన తలుపులు,
– మౌనంగా బాధపడుతున్న పశువులు

నేటి ధాత్రి అయినవోలు:-

 

అయినవోలు మండల కేంద్రంలో ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి ఉన్నా, అందులో వైద్యులు, వైద్య సేవలు మాత్రం కనిపించడం లేదు. గత కొంతకాలంగా ఆసుపత్రి తలుపులు మూసివేసినట్టే కనిపిస్తున్నాయి. పశువులకు అనారోగ్యం కలిగితే రైతులు ఆశగా ఆసుపత్రి వద్దకు తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ వైద్యుడు లేకపోవడం, సిబ్బంది కనిపించకపోవడంతో నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంపద కీలక పాత్ర పోషిస్తుంది. పాలు, పశువుల పెంపకం, వ్యవసాయ పనుల్లో వాటి ఉపయోగం ఎంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో వెటర్నరీ సేవలు అందుబాటులో లేకపోవడం రైతులకు పెద్ద నష్టం. చిన్న వ్యాధి పెద్ద సమస్యగా మారి పశువుల ప్రాణాలకే ముప్పుగా మారుతోంది.
ప్రభుత్వం పశుసంవర్ధక రంగానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటిస్తూనే, నేలస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఆసుపత్రి ఉందిగానీ, వైద్యుడు లేడు. భవనం ఉందిగానీ, సేవలు లేవు. ఇది వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం.
ప్రతిరోజూ పశువులను తీసుకెళ్లి తిరిగి ఖాళీ చేతులతో వస్తున్న రైతుల బాధ ఎవరికి కనిపించదు? అత్యవసర సమయంలో కూడా వైద్యుడు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, వెటర్నరీ డాక్టర్‌ను నియమించడం, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయడం అత్యవసరం. లేదంటే ఈ నిర్లక్ష్యం పశుసంపదపై, రైతుల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఇప్పటికైనా అధికారులు మేల్కొని, మూసివేసిన తలుపులు తిరిగి తెరుచుకునేలా చర్యలు తీసుకుంటారా? లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అన్నది స్థానిక ప్రజల ప్రశ్న.

గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం…

గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం కమల్ పల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణకు బుధవారం ఉచిత పోషక టీ కల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ వ్యాధి వల్లరైతులకుఆర్థికభారమవు
తుందన్నారు. పోషక టీలతో పశువుల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.జెంట్ డైరెక్టర్ వసంతకుమారిమాట్లాడుతూ.. మూడు నెలల పైబడిన పశువులకు టీకాలు వేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంతరావు పాటేల్,ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ పాటిల్, గ్రామ మాజీ సర్పంచ్ సంగ్రామ్ పాటేల్, మాజీ ఎంపిటిసి మారుతీ రావు పాటేల్, ఏడి అధికారులు ఆదిత్య వర్మ, ప్రభాకర్,

ఈ డి డి ఎల్ పవన్, వైద్యాధికారులు సునీల్ దత్తు, హర్షవర్ధన్ రెడ్డి అంజికే, గోపాలమిత్ర సూపర్వైజర్ అర్జున్ అయ్యా, తుక్కారెడ్డి, గోపాల మిత్రులు శ్రీకాంత్ అలియాస్ జాన్, అశోక్ రమేష్, శివకుమార్, అశోక్ రావు పాటిల్, విజయ్ కుమార్ పటేల్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వరప్ప పటేల్, గ్రామస్తులు మల్లేష్,సంజీవులు, మోహన్,మహేందర్,నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version