రైతులకు ఇబ్బదులు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలి
వనపర్తి నేటిదాత్రి .
రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో కలిసి హైదరాబాదు నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అధికారులతో కలిసి పాల్గొన్నారు
మంత్రి మాట్లాడుతూ, జిల్లాల వారిగా కలెక్టర్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడినన్ని గన్ని సంచులు, తూకపు, తేమ యంత్రాలు, టార్పలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు, త్రాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. వరి ధాన్యం తరలించుటకు లారీలను సమకూర్చుకోవాలని కోరారు
రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆదేశించారు వడ్ల సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున వడ్ల రైతులకు నష్టం జేరుగకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు కలెక్టర్లు స్వయంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని వడ్ల కొనుగోలు ప్రక్రియ జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ వనపర్తి జిల్లా అక్టోబర్ చివరి వారం నుండి వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు
గతంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు కలిగిన కేంద్రాల్లో మళ్ళీ ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎక్కడా కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా తూకము కాంటాలు తేమ యంత్రాలు సరిగ్గా చూసుకోవాలని అన్నారు. టార్పలిన్ లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని . లారీలు, కూలీల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రావ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డిఎం జగన్, డి ఆర్ డి ఓ పి డి ఉమాదేవి, డి సి ఓ రాణి, డిటిఓ మానస, వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.