బాలసదనం భవన నిర్మాణం పనులు పూర్తి చేయాలి….

బాలసదనం భవన నిర్మాణం పనులు పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

బాలసదనం భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో చేపట్టిన బాలసదనం భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 1 కోటి 34 లక్షల రూపాయల మిషన్ వాత్సల్య అంచనా నిధులతో బాలసదనం భవన నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, పనులు త్వరగా పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం….

బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి,నేటి ధాత్రి:

జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్,బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,మున్సిపల్ కమిషనర్ సంపత్,చైర్ పర్సన్ దావ స్వాతి, వైస్ చైర్ పర్సన్ సత్యనారాయణ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు.మున్సిపల్ పరిధిలో వివిధ విభాగాలలో పని చేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందించాలని,ఈ మేరకు మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను, ఇతర పన్నులను 100 శాతం వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించేందుకు డి ఎం ఎఫ్ టి నిధుల నుండి ఆటోలు అందించడం జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సి.ఎస్.ఆర్. నిధుల నుండి 2 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అంతర్గత రహదారులు,మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని,విద్యుత్ బిల్లులు తగ్గించే ఆలోచనలో భాగంగా సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో నిరంతరం త్రాగునీటిని సరఫరా చేసేందుకు పనులు కొనసాగుతున్నాయని, ముల్కల్ల నుండి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని,శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని వార్డులలో సిబ్బంది కొరత ఉన్నట్లయితే సమకూర్చుకునేందుకు పాలకవర్గం సమన్వయంతో చర్యలు తీసుకోవచ్చని,ప్లాస్టిక్ వ్యర్ధాలను నిబంధనల ప్రకారం విక్రయించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో షాపులు తీసుకున్న వారి వద్ద నుండి అద్దె క్రమం తప్పకుండా వసూలు చేయాలని, ఖర్చులు తగ్గించి ఆదాయం పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.2026-27 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ 32 కోట్ల 42 లక్షల రూపాయల అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారని, ఇందులో 4 కోట్ల 77 లక్షల రూపాయలు సాధారణ ఆదాయం ( గ్రాంట్లు కాకుండా), 26 కోట్ల 28 లక్షల రూపాయల గ్రాంట్లు, 81 లక్షల రూపాయల డిపాజిట్లు, అడ్వాన్సులు, 55 లక్షల రూపాయల నిలువ ఉంటుందని తెలిపారు.
అన్ని రంగాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపు – ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో 1 సంవత్సర కాలంలో మురికివాడలను పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా అందరి సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ అభివృద్ధి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని,మున్సిపల్ పరిధిలోని పారిశుద్ధ్యం,ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ,ప్రజా సమస్యల పరిష్కారంపై పాలకవర్గ సభ్యులు జవాబుతారీతనంతో వ్యవహరించాలని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అన్ని రంగాలను అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని,ఆయా కేటాయింపుల ప్రకారంగా నిధులను వినియోగించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని అర్హత గల ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డుల కౌన్సిలర్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భీమారం పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన డీసీపీ భాస్కర్

భీమారం పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన డీసీపీ భాస్కర్

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్,సీఐ నవీన్ తో కలిసి భీమారం పోలీస్‌ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్బంగా డీసీపీ స్టేషన్‌ పరిసరాలను పరిశీలిచడంతో పాటు,స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు,స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు,గ్రామాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి సిబ్బంది కి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని,పోలీస్ స్టేషన్ రికార్డ్ లను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై డిసీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలను ఎస్సై రాజేందర్ ని అడిగి తెలుసుకొన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని,మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.

పరామర్శ – గాయపడిన గీత కార్మికుడు ఎర్ర తిరుపతిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్…

పరామర్శ – గాయపడిన గీత కార్మికుడు ఎర్ర తిరుపతిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

మొగుళ్లపల్లి మండల టిఆర్పిఅధ్యక్షుడు బోనగిరి రాజేష్

మొగుళ్ళపల్లి నేటి దాత్రి జయశంకర్

భూపాలపల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం, పర్లపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు ఎర్ర తిరుపతి (40) తాటి చెట్టు దిగుతున్న సమయంలో మోకుజారి కిందపడడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు.

తక్షణమే అతన్ని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన తిరుపతిని పరామర్శించిన టిఆర్పి మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్, పర్లపల్లి గ్రామ యువజన అధ్యక్షుడు కాశెట్టి రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి చెందిన తిరుపతిని ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని, పూర్తి వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. అలాగే, గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్ఆర్పి-3 గనిలో ఉత్పత్తి సమీక్ష..

ఎస్ఆర్పి-3 గనిలో ఉత్పత్తి సమీక్ష
రాబోయే ఆర్థిక సంవత్సరానికి వ్యూహాలపై జిఎం మునిగంటి సూచనలు
శ్రీరాంపూర్: నేటి ధాత్రి

ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఎస్ఆర్పి-3 గనిలో ఇప్పటివరకు సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకతపై శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. గురువారం ఆయన గనిని సందర్శించిన అనంతరం రాబోయే ఆర్థిక సంవత్సరానికి అనుసరించాల్సిన వ్యూహాలపై గని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా త్రీ సీమ్ లోని ఎస్ఆర్పి-3 ప్యానెల్ పని ప్రదేశాలను పరిశీలించారు. ప్రస్తుత ఉత్పత్తి తీరు, వర్కింగ్ కండిషన్స్ ను స్వయంగా తనిఖీ చేశారు. మరో ఐదు రోజులలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొత్త పని ప్రదేశాల అభివృద్ధి పనులు, అవసరమైన అనుమతుల ప్రక్రియపై అధికారులతో చర్చించి ఎలాంటి జాప్యం లేకుండా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని ఆదేశించారు. అనంతరం గని మేనేజర్ కార్యాలయంలో గ్రూప్ ఏజెంట్, మేనేజర్, సర్వేయర్లతో కలిసి ప్రస్తుత వర్కింగ్ ప్లాన్ చార్టులను పరిశీలించారు. ఈ ఏడాది సాధించిన ఉత్పత్తి, ఓఎంఎస్ వివరాలను తెలుసుకొని, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అవసరమైన పనిముట్లు, మెటీరియల్స్ ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. మెరుగైన ఓఎంఎస్ తో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ రవికుమార్, గని మేనేజర్ సిహెచ్ వెంకటేశ్వర్ రావు, సర్వేయర్ సుధాకర్ పాల్గొన్నారు.

జాతీయ రహదారి విస్తరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి…

జాతీయ రహదారి విస్తరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

జాతీయ రహదారి 63 విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని మందమర్రి మండలం తిమ్మాపూర్ ప్రాంతంలో ఆర్మూర్ నుండి చంద్రాపూర్ జాతీయ రహదారి 63 పనులను మండల తహసిల్దార్ సతీష్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం మందమర్రి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు తీరును మండల తహసిల్దార్ సతీష్,మున్సిపల్ కమిషనర్ రాజలింగులతో కలిసి పరిశీలించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని,అంతర్గత రహదారులు,మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు.ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలని,మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను నిబంధనలకు లోబడి చేపట్టేలా అవగాహన కల్పించాలని,నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను,ఇతర పన్నులను 100 శాతం వసూలు చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డును సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.నివాసాల నుండి సేకరించిన చెత్తలో ఉపయోగకరమైన వాటిని వేరుచేసి సెగ్రిగేషన్ షెడ్ కు తరలించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

. అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక. కమిటీ చైర్మన్ గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య.

. అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక. కమిటీ చైర్మన్ గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య.

మొగుళ్ళపల్లి నేటి దాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోనిగుడిపహాడ్ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మాధవి ఆధ్వర్యంలో సర్పంచ్ కుమ్మరి సాంబయ్య ఉప సర్పంచ్ బుర్ర సమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొనిఆరోగ్యలక్ష్మి కమిటీ మెంబర్స్ ని ఎన్నుకొని మీటింగు నిర్వహించడం జరిగింది. చైర్మన్గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య ఆరోగ్య లక్ష్మి మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యముఅంగన్వాడీ కేంద్రంలో జరిగే సేవలు గూర్చి మరియు ఆహార పదార్థాల పంపిణీ, అనుబంధ పోషకాహారం, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, 1000 రోజుల ప్రాముఖ్యత గురించి ఆరోగ్య సేవలు మరియు గర్భిణీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిశోర బాలికలకు చిక్కి ప్యాకెట్స్ , ఇమినైజేషన్ ,పూర్వ ప్రాథమిక విద్య ,విషయాల గూర్చి చర్చించుకోవడం జరిగింది. సర్పంచ్ , ఉప సర్పంచ్ గ్రామస్తులు,పెద్దలందరూ అంగన్వాడీ స్థలం కోసం చర్చించుకోవడం జరిగింది.ఈ కమిటీకి కన్వీనర్ గా అంగన్వాడి టీచర్ ఉంటారు.మొత్తం 11 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గర్భిణీలు ,బాలింతలు ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లల తల్లులు, మూడు నుండి ఆరు సంవత్సరముల పిల్లల తల్లులు ,కిశోర బాలికలు,, అంగన్వాడి టీచర్ పద్మ, వివో సభ్యులు ఆశా వర్కర్ , సునీత,ఆయా,తల్లులు పాల్గొన్నారు

మూడో విడత శిక్షణ పూర్తి….

మూడో విడత శిక్షణ పూర్తి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులకు. వార్డు సభ్యులకు. ఈరోజు మూడో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా. ప్రజా పాలన.పరిపాలన లో భాగంగా. 99.వ. యాక్షన్ ప్లాన్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు గ్రామంలో పరిపాలన విధానాలను ఎటువంటి ఒత్తిడి లోను కాకుండా ఒడిదుడుకుల గురి కాకుండా శిక్షణ కార్యక్రమంలో అన్ని విషయాలపై క్షుణ్ణంగా పరిశీలనలో అవగాహన కార్యక్రమంతో పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇందులో మూడో విడత ప్రజా ప్రతినిధులు పాల్గొని ఈరోజు మూడో విడత చివరి 5.వ .రోజు వార్డు మెంబర్స్.లో శిక్షణ కార్యక్రమంలో విజయవంతంగా శిక్షణ తీసుకొని శిక్షణ ముగింపు విజయవంతంగా చేయడం జరిగిందని ఈ సందర్భంగా శిక్షణ ముగించుకున్న తంగళ్ళపల్లి మండల గ్రామాల అవార్డు సభ్యులకు సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగిందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఎంపీడీవో లక్ష్మీనారాయణ ప్రజా పాలన ప్రగతి కార్యక్రమం ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్. ఎం. పి. ఓ. సూపరిండేoట్.రమేష్. అశోక్. వెన్నెల కార్యాలయంసిబ్బంది

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలు…

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలు

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికల పోటీలో కిరణ్ కుమార్ మోహన్ కుమార్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా బాల నాగయ్య వెంకటరమణ పోటీలో ఉన్నారని ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం ఓట్లు 177 దాదాపు 85 శాతం పోలింగ్ జేరిందని చెప్పారు బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఏం రాహుల్ రాజు పర్యవేక్షకులుగా వ్యవహరించారని చెప్పారు బార్ అసోసియేషన్ కమిటీని ఎన్నికల అభ్యర్థుల కౌంటింగ్ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు వనపర్తి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించినందుకు న్యాయవాదులకు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు…

వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు

బీ ఆర్ ఎస్ నేతల అరెస్టు కు నిరసనగా
అరెస్టు ఆయన వారిని మాజీ మంత్రి పరామర్శ
వనపర్తి నేటిదాత్రి

అక్షర స్కూల్ లో మైనారిటీ బాలిక పై అత్యాచారం జేరిగిన సంఘటనపై వివరాలు సేకరించా దానికి బీ ఆర్ ఎస్ నాయకులు వెళ్లారని జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షుడు పలస రమేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీదర్ విలేకరులతో చెప్పారు మీడియా సెల్ ఇంచార్జీ నాయకులు నందిమల్ల.అశోక్, చీర్ల.చందర్,మెకానిక్.శ్రీను మరో 6మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారి కి అన్యాయం జేరిగిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ నిందితున్ని అక్షర పాఠశాల యాజమాన్యాన్ని కాపాడుతున్నారని ఎం.ఎల్.ఏ బీ ఆర్ ఎస్ నాయకులను అరెస్ట్ చెయి oచారని చెప్పారుప్రభుత్వపరంగా బాధిత బాలికకు వారి ,కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షములో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంచేపడతామని బీ ఆర్ ఎస్ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాజశేఖర్ గౌడ్, పెద్దిరాజు, కాగితాల లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్ మున్సిపల్ కౌన్సిలర్సు మురళి సాగర్ శ్రీకర్ గౌడ్ చింటూ సమద్ స్టార్ రహీం, హేమంత్ ముదిరాజ్, జోహార్ హుస్సేన్, సూర్యవంశం గిరి, యుగంధర్ రెడ్డి, చిట్యాల రాము,సి.పి.ఎం నాయకులు పరమేశ్వరా చారి , సి.పి. ఐ నాయకులు గోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి అరెస్ట్ అయిన బీ ఆర్ ఎస్ నేతల ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఏ జి పి న్యాయ వాది శశి భూషన్ పరామర్శించారు

ఎస్సీ నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం…

ఎస్సీ నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం

ఏప్రిల్ 2 తారీకు వరకు గడువు పొడిగింపు

జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, హైదరాబాద్ ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాలో అర్హత కలిగిన ఎస్సీ నిరుద్యోగ యువత కోసం అమలు చేస్తున్న ఎస్సీ యాక్షన్ ప్లాన్ (2025-26) పథకాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ఏప్రిల్ 2 వరకు గడువు పొడిగించినట్లు భూపాలపల్లి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా ఒక ప్రక టనలో తెలిపారు. బ్యాంకు లింకేజీ ఉన్న పథకాలు రెండు ద్విచక్ర వాహనాలు, ఈవీ మూడు చక్రాల వాహనాలు, వ్యవసాయంలో అగ్రి డ్రోన్ సర్వీసులు, అగ్రి మిషనరీ కామన్ హైరింగ్ సెంటర్, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, పశు సంవర్ధక పథ కాల్లో పాడి పశువులు పొందడానికి దరఖాస్తు చేసు కోవాలన్నారు. ఉద్యానవన పథకాలు మల్బరీ సాగు, కిసాన్ నర్సరీ, కూరగాయలు, ఆయిల్పామ్ సాగు చేసుకోవచ్చన్నారు. బ్యాంకు లింకేజీలేని పథకాలు బోర్వెల్స్, సబ్మెర్సిబుల్ పంపుసెట్లు, సబ్మెర్సిబుల్ పంపుసెట్లు పైపులైన్, సర్వీసు కలెక్షన్ ఛార్జీలు, ఓఆర్పి లైన్(రూ.1.50 లక్షల వరకు) పొందవచ్చ న్నారు. అర్హులైన వారు గడువులోపు ఎస్సీ కార్పొరే షన్ అధికారిక పోర్టల్ OBMMS online portal ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాలు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా – 22 మందికి ఉద్యోగాలు..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా – 22 మందికి ఉద్యోగాలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించే ఉద్దేశంతో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. బైరి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, ప్లేస్మెంట్ సెల్ అధికారి ఎం.ఎం.కె. రహీముద్దీన్ ఆధ్వర్యంలో టీ. సందీప్ మరియు కరుణాకర్ బృందం ప్లేస్మెంట్ డ్రైవ్‌ను సమర్థవంతంగా నిర్వహించారు.ఈ జాబ్ మేళాలో సుమారు 56 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, ఇంటర్వ్యూలు, నైపుణ్య పరీక్షలు మరియు ఎంపిక ప్రక్రియల అనంతరం 22 మంది విద్యార్థులు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. బైరి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్లేస్మెంట్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జీ కే హ్యూమన్ రిసోర్స్ సంస్థ ప్రతినిధి టి. సందీప్ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని అకాడ్ పవర్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్సికాన్ వంటి ప్రముఖ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ ఎం.ఎం.కె. రహీముద్దీన్ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని, భవిష్యత్తులో మరిన్ని ఉపాధి శిక్షణా కార్యక్రమాలు, కెరీర్ గైడెన్స్ సెషన్లు, జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎస్. కమలాకర్, డాక్టర్ ఎం. సోమయ్య, డాక్టర్ ఎం. రాంబాబు తోపాటు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ సెక్రెటరీగా వేముల కిరణ్ గౌడ్..

తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ సెక్రెటరీగా వేముల కిరణ్ గౌడ్
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

 

 

తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ జాయింట్ యాక్షన్ కమిటీ డివిజన్ జాయింట్ సెక్రెటరీగా మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన వేముల కిరణ్ గౌడ్ నియమితులయ్యారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన యూనియన్ సమ్మెలో భాగంగా ఆయనను నియమించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వేముల కిరణ్ గౌడ్ మాట్లాడారు. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతలను అప్పగించిన యూనియన్ నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి…

అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి

అంగన్వాడీ కేంద్రాల్లో ఒకపూట బడి జీవో విడుదల చేయాలి

మంత్రి సీతక్కను కలిసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు

హైదరాబాద్,నేటిధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో వేసవికాలం దృశ్య ఒకపూట నిర్వహణ కోసం జీవో విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ ప్రజా భవన్‌లో మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బియార్టీయు) రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించి సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక పూట నిర్వహణ కోసం జీవో జారీ చేయాలని కోరారు. అలాగే మే నెలలో టిహెచ్ఆర్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చి మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని అన్నారు. 2024-25 సంవత్సరంలో రిటైర్మెంట్ అయిన టీచర్స్ మరియు హెల్పర్స్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్స్‌కు 18 వేల వేతనం అమలు చేయాలని కోరారు.మంత్రి సీతక్కను కలిసిన అనంతరం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జేడీ అడ్మిన్ అకేశ్వర్ రావు, జేడీ మోతిని కలిసి సమస్యలపై చర్చించారు. మంత్రి మరియు అధికారులను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. రమా తార, కోశాధికారి ఎం. వేదవతి, రాష్ట్ర నాయకులు ఎల్లమ్మ, రజిత, శిరీష పాల్గొన్నారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీస్ జారీ…

ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీస్ జారీ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఎమ్మారై యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తు సరఫరా పనుల్లో జాప్యంపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ఎమ్మారై పరికరం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఎమ్మారై యంత్రం ఏర్పాటు కోసం అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడంపై షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. ఎమ్మారై యంత్రం ఏర్పాటు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆర్డిఓను పర్యవేక్షణ సంబంధిత అధికారిగా నియమించామని తెలిపారు.
విద్యుత్ సరఫరా ఏర్పాటుకు అవసరమైన పరికరాలను ఇప్పటికీ సమకూర్చకపోవడంపై కలెక్టర్ ప్రశ్నిస్తూ, ఈ విధంగా కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతాయని అసహనం వ్యక్తం చేశారు. యంత్రం ఏర్పాటు అవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఉప పర్యవేక్షకులు డా వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా రాజేష్, టిజిఎంఎస్ ఐడిసి ఏఈ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఐ బి అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ వి ఎస్ సంఘ నాయకులు…

ఎస్ఐ బి అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ వి ఎస్ సంఘ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం చెల్పూర్ శ్రీ వినాయక శ్రీనివాస వెల్ఫేర్ సొసైటీ చెల్పూర్ బస్టాండ్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిత రమేష్ అధ్యక్షులు పి.కిరణ్ ఆధ్వర్యంలో నూతనంగా గణపురం కు వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ బి.అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మూదురుకొల్ల రమేష్ దుంప నర్సయ్య ఎడ్ల శ్రీనివాస్ ముప్పిడోజు శ్రీనివాస్ చక్రపు వెంకటేశ్వర్లు
వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శంకర్
కోశాధికారి పాత రవీందర్
సహాయ కార్య దర్శులు హైగ్రీవ చారి పట్టెం బద్రయ్య
ప్రచార కార్యదర్శి కునారపు రఘు పాల్గొన్నారు.. అనంతరం ఇటీవల తిరుపతి లో జాతీయ అవార్డు తీసుకున్నందుకు గాను దుంప నర్సయ్య ను ఎస్సై సమక్షంలో శ్రీ వినాయక శ్రీనివాస వెల్ఫేర్ సొసైటీ చెల్పూర్ తరపున సన్మానం చేయడం జరిగింది

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి…

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్

పరకాల,నేటిధాత్రి

 

30న తెలంగాణ అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గత8సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులపై పోరాటం చేస్తున్నామని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టినటువంటి హామీలు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు,కమిటీ వేస్తానని చెప్పి సంవత్సరాలు కావస్తున్న కూడా కమిటీ వేయడం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీని ముట్టడికి సిద్ధమాయ్యమన్నారు.తెలంగాణలోని ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా కచ్చితంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.

విద్యుత్ ఉద్యోగుల ధర్నా…

విద్యుత్ ఉద్యోగుల ధర్నా

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి మోత్కూరి కోటి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి డివిజన్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వరంగల్ ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ యాళ్ల సురేందర్ రెడ్డి ధర్నా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఈ ధర్నాలో ఆర్టిజన్, అన్‌మాన్, స్పాట్ బిల్లర్స్, ఎస్‌పీఎంలు ఇతర పీస్‌రేట్ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కార్మికుల ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి పట్టి విక్రమార్క కార్మికుల సమస్యను పరిష్కరించాలి అని వారు అన్నారు
ఆర్టిజన్ కార్మికులను వారి విద్యార్హతలను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలి
ఏపీఎస్ఈబి నిబంధనలు పూర్తిగా అమలు చేయాలి
ఒకే సంస్థలో సంవత్సరాలుగా పని చేస్తున్న అన్‌మాన్ కార్మికులను ఆర్థిక ఆర్టిజన్‌గా గుర్తించాలి
కార్మికులకు శాశ్వత పరిష్కారం కల్పించాలి
కార్మికులు సంస్థ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరం అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ధర్నా అనంతరం డివిజన్ ఇంజనీర్ కి కార్మికుల సమస్యలను వివరించి మెమోరండం ఇవ్వడం జరిగింది.
అనంతరం ఉమ్మడి డివిజన్ కమిటీ భూపాలపల్లి ఆధ్వర్యంలో టీవీఏఈ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో:
చైర్మన్‌గా – నాగుల తిరుపతి రెడ్డి
కన్వీనర్స్‌గా – మోత్కూరి కోటి, తిప్పారపు రాజు
కో-కన్వీనర్స్‌గా – సమ్మయ్య, జన రవీందర్
కో-చైర్మన్‌గా – బత్తుల రాజేందర్
వైస్ చైర్మన్‌లుగా – జి. సుదర్శన్, ఎల్. రాజయ్య
జాయింట్ సెక్రటరీగా – వేముల కిరణ్
కోశాధికారిగా – హరిచంద్ర
నూతన జేఏసీ కమిటీ ఏర్పాటుతో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి, కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 7న “చలో వరంగల్” కార్యక్రమం నిర్వహించి, అవసరమైతే సమ్మెలోకి వెళ్లే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ధర్నా అనంతరం టీవీఏఈ జేఏసీ జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వంటేరు మల్లయ్య, ఎండి అక్షావాలి, భాస్కర్ చారి, విజేందర్, రామయ్య తదితరులు పాల్గొన్నారు

ఈనెల 30న కొత్తగూడెంలో ధర్నాను విజయవంతం చేయాలి…

ఈనెల 30న కొత్తగూడెంలో ధర్నాను విజయవంతం చేయాలి

ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు సీతారామయ్య కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సింగరేణిలో గతం కంటే రాజకీయ జోక్యం ఆర్థిక అరాచకత్వం మితిమీరి పోయిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి పరిరక్షణ సాధనకై ఈనెల 18న ప్రారంభమైన సింగరేణి బస్ జాత యాత్ర భూపాలపల్లి జిల్లా కు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి సీతారామయ్య కొరిమి రాజ్ కుమారులు మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ఈ ప్రభుత్వం అనేక స్ట్రక్చర్ మీటింగులో ఒప్పుకున్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. అనేక రోజులుగా ఎదురు చూస్తున్న మెడికల్ బోర్డు విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైందని అన్నారు. విజిలెన్స్ కేసుల పరిష్కారం, మెడికల్ ఫిట్ అయిన 300 మందికి పోస్టులు ఇవ్వాలని, అదేవిధంగా కార్మికుల సొంతింటి కల నెరవేర్చడం కోసం మాట ఇచ్చిన యాజమాన్యం అమలు చేయడంలో విఫలమైందని వివరించారు. పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని కోరడం జరిగిందని, డిస్మిస్ కార్మికుల కు మరొకసారి అవకాశం ఇవ్వాలని గుర్తింపు సంఘంగా అడగడం జరిగిందని, అది అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అదేవిధంగా సింగరేణిలో నూతన గనులు రాకుంటే సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని నూతన గనులు ఏర్పాటు చేయాలని, అనేక కార్మిక సమస్యలపై యాజమాన్యానికి విన్నవించిన వాటిని పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణి సేవ్ యాత్రను చేపట్టడం జరిగిందని తెలిపారు. 18 నుండి నిర్వహిస్తున్న ఈ యాత్ర 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున వంటవార్పు, ముట్టడి, మహా ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఈనెల 30 వరకు కార్మిక సమస్యలు పరిష్కారం కాకుంటే అన్ని జాతీయ సంఘాలు ఏకమై మరో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు నిర్వహించే నిరసన వంటవార్పు కార్యక్రమానికి భూపాలపల్లి నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సీతారామయ్య, రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ డిప్యూటీ సెక్రటరీలు వీరభద్రయ్య, వైవి రావు, ముష్కే సమ్మయ్య,మడ్డి ఎల్లయ్య , ఏ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, ఆసిఫ్ పాషా, జి శ్రీనివాస్, నూకల చంద్రమౌళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా గుండు సాయిలు గౌడ్…

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా గుండు సాయిలు గౌడ్
#యాదగిరిగుట్ట ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు గుండు సాయిలు గౌడ్ నీ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీగా నియామకం.

నేటిదాత్రి యాదగిరిగుట్ట:

ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఆటో యూనియన్ రాంపల్లి రజనీకాంత్ గర్లా ఆధ్వర్యంలో మా మిత్రుడు గుండు నరసింహ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా మా ఆటో యూనియన్ నుండి పై స్థాయికి వెళ్లడానికి కృషిచేసిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నం మా ఆటో కార్మికులపై మీరు చూపిస్తున్న ప్రేమని మేము ఎన్నడు మరువలేమన్న మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్న అని బిర్లా ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు గుండు సాయిల్ గౌడ్, రాంపల్లి రజనీకాంత్ గౌడ్, మోహన్ నాయక్, కంసాని శ్రీహరి, జమాల్, ఎల్లా గౌడ్, రజినీకాంత్, చాంద్ పాషా, సత్యం గౌడ్, మంగు నాయక్, జహంగీర్, గుండు మధు, సాయి, కందుకూరు మధు, వాటర్ మధు, నగేష్ తదితర ఆటో డ్రైవర్స్ పాల్గొనడం జరిగింది.

error: Content is protected !!
Exit mobile version