సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులు వేగవంతం చేయాలి…

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులు వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో డిసిపి ఎ. భాస్కర్,జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ లతో కలిసి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎల్.పి.జి. సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు,పైప్‌లైన్ సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అనుమతుల ప్రక్రియను సరళీకరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులకు సంబంధించిన అనుమతులను 24 గంటలలో మంజూరు చేసే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని,ఆలస్యం అయితే డీమ్డ్ పర్మిషన్ గా పరిగణించడం జరుగుతుందని తెలిపారు.సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు సంబంధించిన రెంటల్/లీజ్ ఛార్జీలను తాత్కాలికంగా మాఫీ చేయడం జరిగిందని,పనుల వేగవంతానికి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు 24 గంటల పని సమయం,శబ్ద కాలుష్యం నిబంధనలను పాటించేలా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పి.ఎన్.జి.,ఎల్.పి.జి. మధ్య సమన్వయాన్ని పౌరసరఫరాల శాఖ సమర్థవంతంగా నిర్వహించాలని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేసి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు నిరంతర ఇంధన సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)‌ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మాత శిశు సంరక్షణకు కృషి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మాత శిశు సంరక్షణకు కృషి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయడం ద్వారా మాత శిశు సంరక్షణకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్లా రమ్య,ఆర్.ఎం.ఓ. శ్రీధర్ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు.శుద్ధమైన త్రాగునీరు, నాణ్యమైన పోషక ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని, వ్యాధులకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.గర్భిణీల వివరాలు నమోదు చేసి సమయానుసారంగా చేసుకోవలసిన వైద్య పరీక్షలు, తీసుకోవలసిన ఆహారం, పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంపొందించడం జరిగిందని తెలిపారు.ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలు,ప్రాథమిక ఆసుపత్రులు,సామాజిక ఆసుపత్రులు,ప్రభుత్వ ఆసుపత్రులు,పల్లె,పట్టణ దవాఖానాలు,ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలల ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రస్తుతం మాతా శిశు ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో వరద నీటి ఇబ్బంది ఉన్నందున త్వరలో పూర్తి కానున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు.లక్షెట్టిపేట సామాజిక ఆసుపత్రి, బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని,జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, చెన్నూర్ మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.గ్రామ,మండల,జిల్లా స్థాయిలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు.ఆశ, ఆరోగ్య కార్యకర్తల నుండి వైద్యుల వరకు గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని,వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం స్టాఫ్ నర్సులు,సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని,స్నేహపూర్వక వాతావరణం లో వైద్య చికిత్స అందించాలని తెలిపారు.అనంతరం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమం,అభివృద్ధి  దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు 129.25 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బాలసదనం భవన నిర్మాణం పనులు పూర్తి చేయాలి….

బాలసదనం భవన నిర్మాణం పనులు పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

బాలసదనం భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో చేపట్టిన బాలసదనం భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 1 కోటి 34 లక్షల రూపాయల మిషన్ వాత్సల్య అంచనా నిధులతో బాలసదనం భవన నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, పనులు త్వరగా పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం….

బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి,నేటి ధాత్రి:

జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్,బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,మున్సిపల్ కమిషనర్ సంపత్,చైర్ పర్సన్ దావ స్వాతి, వైస్ చైర్ పర్సన్ సత్యనారాయణ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు.మున్సిపల్ పరిధిలో వివిధ విభాగాలలో పని చేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందించాలని,ఈ మేరకు మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను, ఇతర పన్నులను 100 శాతం వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించేందుకు డి ఎం ఎఫ్ టి నిధుల నుండి ఆటోలు అందించడం జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సి.ఎస్.ఆర్. నిధుల నుండి 2 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అంతర్గత రహదారులు,మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని,విద్యుత్ బిల్లులు తగ్గించే ఆలోచనలో భాగంగా సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో నిరంతరం త్రాగునీటిని సరఫరా చేసేందుకు పనులు కొనసాగుతున్నాయని, ముల్కల్ల నుండి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని,శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని వార్డులలో సిబ్బంది కొరత ఉన్నట్లయితే సమకూర్చుకునేందుకు పాలకవర్గం సమన్వయంతో చర్యలు తీసుకోవచ్చని,ప్లాస్టిక్ వ్యర్ధాలను నిబంధనల ప్రకారం విక్రయించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో షాపులు తీసుకున్న వారి వద్ద నుండి అద్దె క్రమం తప్పకుండా వసూలు చేయాలని, ఖర్చులు తగ్గించి ఆదాయం పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.2026-27 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ 32 కోట్ల 42 లక్షల రూపాయల అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారని, ఇందులో 4 కోట్ల 77 లక్షల రూపాయలు సాధారణ ఆదాయం ( గ్రాంట్లు కాకుండా), 26 కోట్ల 28 లక్షల రూపాయల గ్రాంట్లు, 81 లక్షల రూపాయల డిపాజిట్లు, అడ్వాన్సులు, 55 లక్షల రూపాయల నిలువ ఉంటుందని తెలిపారు.
అన్ని రంగాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపు – ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో 1 సంవత్సర కాలంలో మురికివాడలను పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా అందరి సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ అభివృద్ధి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని,మున్సిపల్ పరిధిలోని పారిశుద్ధ్యం,ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ,ప్రజా సమస్యల పరిష్కారంపై పాలకవర్గ సభ్యులు జవాబుతారీతనంతో వ్యవహరించాలని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అన్ని రంగాలను అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని,ఆయా కేటాయింపుల ప్రకారంగా నిధులను వినియోగించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని అర్హత గల ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డుల కౌన్సిలర్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత…

మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత

మంత్రి వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

మహిళా సంక్షేమం,అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,మండల తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ గౌడ్ ,డి సి సి ప్రతినిధి రఘునాథ్ రెడ్డి లతో కలిసి గ్రామైఖ్య సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమం,అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.ఈ క్రమంలో 30 లక్షల రూపాయల వ్యయంతో 3 గ్రామైఖ్య సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు.చెన్నూరు నియోజకవర్గంలో 3 కోట్ల 50 లక్షల రూపాయలతో 35 భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్,పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు,పెరటి కోళ్ల పెంపకం, ఇతర అనేక వ్యాపారాలలో ప్రోత్సహిస్తూ మహిళలను ముందంజలో ఉంచే విధంగా కృషి చేస్తుందని తెలిపారు.మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించి,బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు.రుణం పొందిన స్వయం సహాయక సంఘాలు సకాలంలో చెల్లించి తిరిగి రుణం పొంది తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.మహిళలు తాము చేపట్టిన వ్యాపారాలను క్రమ పద్ధతిలో నిర్వహిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాయితీ గ్యాస్ సిలిండర్,గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్,ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.జైపూర్ మండలానికి 753 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 200 ఇండ్లు స్లాబ్ స్థాయిలో ఉన్నాయని,ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని  అర్హులైన లబ్ధిదారులకు వచ్చే విడతలో అందించడం జరుగుతుందని తెలిపారు.15 సంవత్సరాల వయసు కలిగిన బాలికలకు ప్రభుత్వం హెచ్ పి వి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుందని, భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.జైపూర్ మండలంలో చేపట్టిన 1 వెయ్యి 250 మెగా వాట్ల  పవర్ ప్లాంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని,ప్లాంట్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన పట్టాదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా దాదాపు 13 వేల కోట్ల రూపాయలతో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ప్రజలతో చెన్నూర్ నుండి హైదరాబాద్ వరకు బస్సు సర్వీసులను నిర్వహించడం జరుగుతుందని,అదనంగా మరొక బస్సు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని,ప్రజా సంక్షేమంలో భాగంగా గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రజా ప్రతినిధులు,అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పారిశుధ్యం,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్,ఆరోగ్యం, అరైవ్ అలైవ్,సంక్షేమం,పిల్లల భద్రత,వ్యవసాయం,విద్య, యువత,మహిళలు,పర్యావరణం తదితర అంశాలపై ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి జిల్లాలోని గ్రామపంచాయతీల సర్పంచ్ లు, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపల్ కార్పొరేటర్లు/కౌన్సిలర్లకు జిల్లా కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం మండలంలోని 39 మంది కళ్యాణలక్ష్మి /షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.నిరుపేద ఆడపడుచులకు వివాహానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని,మండలంలో ఇప్పటివరకు 375 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు కలెక్టర్ కుమార్ దీపక్

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వ్యాపార రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళలు ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా అదనపు ఆదాయం పొందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.గ్రామపంచాయతీలలో కార్యాలయ భవనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మహిళా సమాఖ్య భవనాల ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చర్యలు చేపట్టడం జరుగుతుందని,అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యులను  చేయడం జరిగిందని,తద్వారా ప్రభుత్వ పాఠశాలలను 3 శాతం విద్యార్థుల సంఖ్య పెంపొందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామైఖ్య సంఘాల మహిళలు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హిందూ స్మశాన వాటికకు భూమి పూజ..

హిందూ స్మశాన వాటికకు భూమి పూజ..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7,8,9,10 వ వార్డ్ ప్రజల సౌకర్యార్థం అమ్మ గార్డెన్ ఏరియాలోనీ ఆర్ ఆర్ నగర్ ప్రాంతంలో హిందూ స్మశాన వాటికకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. సుమారు 50 లక్షల పట్టణ ప్రగతి, 15వ ఫైనాన్స్ నిధులతో స్మశాన వాటిక కు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు.అమ్మ గార్డెన్ ఏరియాలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నానని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి రఘునాథరెడ్డి, ఎమ్మార్వో సతీష్ కుమార్,పుర కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, గోపతి భానేష్, నాయకులు,ప్రజలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version