వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలు…

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికలు

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నికల పోటీలో కిరణ్ కుమార్ మోహన్ కుమార్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా బాల నాగయ్య వెంకటరమణ పోటీలో ఉన్నారని ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం ఓట్లు 177 దాదాపు 85 శాతం పోలింగ్ జేరిందని చెప్పారు బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఏం రాహుల్ రాజు పర్యవేక్షకులుగా వ్యవహరించారని చెప్పారు బార్ అసోసియేషన్ కమిటీని ఎన్నికల అభ్యర్థుల కౌంటింగ్ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు వనపర్తి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించినందుకు న్యాయవాదులకు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు…

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

నర్సంపేట మున్సిపాలిటీలో పోలింగ్ 85.21 శాతం

వర్ధన్నపేట మున్సిపాలిటీలో పోలింగ్ 86.23 శాతంగా నమోదు

వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డులకు సంబంధించిన 60 పోలింగ్ కేంద్రాలలో 85.21 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40,968 మంది ఓటర్లలో 34,908 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల పరిధిలో ఉన్న 20 పోలింగ్ కేంద్రాలలో 86.23 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 10,526 మంది ఓటర్లలో 9,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు.
రెండు మున్సిపాలిటీలలోని మొత్తం 80 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించినట్లు తెలిపారు. గుర్తించిన ఆరు సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు 17 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు చెప్పారు.పోలింగ్ ముగిసిన అనంతరం నర్సంపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు మరియు పోలింగ్ సామగ్రిని సంబంధిత వర్ధన్నపేట మునిసిపల్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌కు భద్రతా ఏర్పాట్ల నడుమ సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో సహకరించిన ఎన్నికల సిబ్బంది, పోలీసు శాఖ, అధికారులు, ముఖ్యంగా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములైన ఓటర్లకు జిల్లా ఎన్నికల అధికారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా అధిక శాతం పోలింగ్ నమోదు కావడం సంతోషకరమని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రశాంతంగా మున్సిపాలిటీ ఎన్నికలు..

ప్రశాంతంగా మున్సిపాలిటీ ఎన్నికలు

* ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మూడు మున్సిపాలిటీలోని రెండు చోట్ల మినహా ఇతర అన్నిచోట్ల పోలింగ్ సక్రమంగా జరిగింది. మొదట మందకోడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పొంచుకుంది. 7:00 నుంచి 9 గంటల వరకు రెండు గంటల వ్యవధిలో 15% లోపు పోలింగ్ ఆ తర్వాత 11, ఒంటిగంట వరకు పోలింగ్ శాతం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఒకటి గంటల వరకు మూడు మున్సిపాలిటీలో 50 శాతానికి మించి పోలింగ్ జరిగింది. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కు మూడు రోజుల కిందట అలియాబాద్ మున్సిపాలిటీ లాల్ గడి మలక్పేట్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ల మధ్య జరిగిన గొడవతో బందోబస్తును మరింత పెంచారు. సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన అద్రాస్ పల్లి, కొల్తూరు గ్రామాల్లో బందోబస్తును మరింత పెంచారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ లాల్ గడి మలక్పేట్ ను సందర్శించి, బందోబస్తును పర్యవేక్షించారు.

కాగా జిల్లా కలెక్టర్ మన చౌదరి, ఎన్నికల పరిశీల కురాలు విజయ కాంతి వెస్లీ తో కలిసి మూడు మున్సిపాలిటీల్లో ని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఓటింగ్ నిర్వాహణ, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ డిసిపి పురుషోత్తం, ఏసీపీ లు శ్రీనివాస్ రెడ్డి, బాలగంగి రెడ్డి, మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలను పరిశీలించారు. కేశవరం, కొల్తూరు, మూడు చింతలపల్లి, ఉద్దమర్రి గ్రామాలను సందర్శించి, భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇది ఇలా ఉంటే అలియాబాద్ మున్సిపాలిటీ ఐదో వార్డులో బిజెపి అభ్యర్థి నకిలీ వెండి నాణేలను ఓటర్లకు అందజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విషయాన్ని గుర్తించిన ఓటరు సదరు అభ్యర్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రావల్కోల్ లో ఓటు వేయడానికి వచ్చిన వారిపై డి ఐ కిరణ్ శాంతి భద్రతల విధుల్లో భాగంగా లాటీ ఛార్జ్ చేశారు. దీనీ పై సిపిఎం నేత నరేష్ తో పాటు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సరికి ఎల్లంపేట్ మునిసిపల్ 83.28 %, అలియాబాద్ మునిసిపల్ 79.62 % మూడుచింతలపల్లి మునిసిపల్ 89.06 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు: ఉదయం 9 వరకు 16.63% పోలింగ్…

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు: ఉదయం 9 వరకు 16.63% పోలింగ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 37 వార్డుల్లో బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 9 గంటల వరకు 16.63 శాతం పోలింగ్ నమోదైంది.
మొత్తం 78,819 మంది ఓటర్లలో 13,112 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూల్లో నిలబడి ఓటు వేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎలాంటి అంతరాయం లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో 29వ వార్డు లో ఓటు వేసిన బిఆర్ఎస్, సీనియర్ నాయకులు షేక్ ఫరిద్ తమ నాయకులు కార్యకర్తలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version