న్యాల్ కల్ మండల ఎంపీడీఓ గూడెం శ్రీనివాస్ బదిలీ..!

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T113244.832.wav?_=1

 

న్యాల్ కల్ మండల ఎంపీడీఓ గూడెం శ్రీనివాస్ బదిలీ..!

◆:- ఇన్చార్జి ఎంపీడీఓగా ఎంపీఓ సౌజన్య..!!

◆:- జిల్లా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్ కల్ మండల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మొగుడంపల్లి మండల పర్యవేక్షకులుగా బదిలీ అయ్యారు. ఇదివరకు న్యాల్ కల్ మండల ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న సౌజన్యను ఇంచార్జ్ ఎంపీడీఓగా నియమితులయ్యారు. త్వరలోనే నిర్మల్ మండలానికి చెందిన ఓ రెగ్యులర్ (మహిళ) ఎంపీడీఓగా విధుల్లో చేరనున్నారు.

ఉపాధి హామీ కూలీలు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T112437.027.wav?_=2

 

ఉపాధి హామీ కూలీలు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో 100 రోజుల ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కేవైసీ అప్డేషన్ చేయించు కోవాలని మండల ఏపీవో రాజ్ కుమార్ సూచించారు.మండల పరిషత్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ, కేవైసీ అప్డేట్ చేయని కూలీలు ఇకపై ఉపాధి హామీ పథకం కింద పనులు పొందడం లేదా పనులకు హాజరు కావడం సాధ్యం కాదని తెలిపారు. అలాగే అట్టి కూలీలకు వ్యక్తిగత పనులకు సాంక్షన్ ఇవ్వడం కూడా కుదరదని స్పష్టం చేశారు. ప్రతి జాబ్ కార్డు దారుడు తమ ఝరాసంగం గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు ను సంప్రదించి వెంటనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు, వివాహం అయి అత్తగారింటికి వెళ్లిన మహిళల పేర్లు వంటి వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్కి తెలియజేసి జాబ్ కార్డుల నుండి తొలగించుకోవాలని సూచించారు. గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు అందుబాటులో ఉండి కేవైసీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.

తిష్ట వేశారు…కోట్లు తింటున్నారు!?

 

*”మంత్రి,కమిషనర్ గారు” అవినీతి ఉద్యోగులపై “ఓ కన్నెయ్యండి”.

మంత్రి పొంగులేటి రిజిస్ట్రేషన్‌ శాఖలో ప్రక్షళన చేసి అధికారులను ట్రాన్స్‌పార్లు చేశారు

`ఏళ్ల తరబడి అదే కుర్చీలో కూర్చుంటున్నారు.

`ఒకప్పుడు సివిల్‌ సప్లయ్‌ శాఖ అంటే మాకొద్దనే వారు!

`ఇప్పుడు ఎమ్మార్వోలు, రెవిన్యూ అధికారులు ఎగబడుతున్నారు!

డిప్యూటేషన్ల మీద సివిల్‌ సప్లయ్‌ కోరుకుంటున్నారు.

`తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిన పంటల దిగుబడితో అధికారులు పంట పండిరచుకుంటున్నారు.

`జీతానికి అదనంగా వందల రెట్లు సంపాదించుకుంటున్నారు!

`వందల కోట్లకు అధికారులు చేరుకుంటున్నారు.

సివిల్‌ సప్లై శాఖలో ‘‘డిసిఎస్‌ఓ’’,’’డిఎం’’ల సంపాదనకు లెక్కేలేదు.

`ఐదారేళ్లగ సంపాదనకు అంతే లేదు.

`మిల్లర్లను పీల్చి పిప్పి చేస్తున్నారు.

`బాయిల్డ్‌ మిల్లర్లకు కల్పతరువులౌతున్నారు!

అక్రమంగా వడ్లు కేటాయించి లక్షలు లంచాలుగా తీసుకుంటున్నారు.

‘‘డిసిఎస్‌ఓ’’, ‘‘డిఎం’’లకు ఏ అవసరం వచ్చినా మిల్లర్లు సమకూర్చాల్సిందే!

ప్రతి సంవత్సరం టూర్‌ ప్యాకేజీలు చెల్లించాల్సిందే!

`ఎప్పుడు అడిగితే అప్పుడు అడిగినంత ముట్ట జెప్పాల్సిందే?

`లేకుంటే మిల్లర్‌ చుక్కలు చూడాల్సిందే?

రాజకీయ నాయకులకు కోట్లలో చందాలిచ్చేంత ‘‘డిసిఎస్‌ఓ’’, ‘‘డిఎం’’, ‘‘డిటి’’లు ఎదిగారు!

`నాయకుల ఆశీస్సులతో కుర్చీలలో పాతుకుపోయారు.

రిజిస్ట్రేషన్‌ శాఖలాగా ట్రాన్స్‌ఫర్లు చేస్తే తప్ప వ్యవస్థ మారదు.

గతంలో రిజిస్ట్రేషన్‌ శాఖలోనూ దశాబ్దాల తరబడి ట్రాన్స్‌ఫర్లు లేవు.

`సబ్‌ రిజిస్ట్రార్‌లు విచ్చలవిడి సంపాదనకు ఎగబడ్డారు.

`సరిగ్గా సివిల్‌ సప్లయ్‌ శాఖలో ఇదే జరుగుతోంది.

`ట్రాన్స్‌ఫర్లు లేక అధికారులు ఆడిరది ఆట, పాడిరది పాట చేసుకుంటున్నారు.

కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ముందు ట్రాన్స్‌ఫర్లు మొదలు పెడితే సివిల్‌ సప్లయ్‌ శాఖ సగం గాడిలో పడినట్లే!

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:  

 ప్రభుత్వ కొలువు పాడి గేదే లాంటిది. ముప్పైపాటు ఒట్టిపోదు అనుకునేవారు. అంటే ఒక్కసారి ఉద్యోగంలో చేరితే జీవితం హాయిగా సాగుతుందనుకునే వారు. కాని ఇప్పుడు ప్రభుత్వ కొలువు అంటే విలాసం. జీతం లకారంలో వుంటుంది. లంచాలు లకారాలు దాటుతున్నాయి. ముఖ్యంగా కొన్ని శాఖల్లో కోట్ల రూపాయలు కూడా వచ్చిపడుతున్నాయి. ప్రభుత్వ కొలువు అంటే సేవ అనే భావం వుండేది. ఉద్యోగంలో చేరకముందు ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పుకునేవారు. అది ఐఏఎస్‌ నుంచి కింది స్దాయి ఉద్యోగుల దాకా ప్రజా సేవ అనే పదమే వినిపించేది. మరి ఇప్పుడు ఉద్యోగం అంటే కల్ప వృక్షం. సేవ సంగతి దేవుడెరుగు? ఎప్పుడు ఎంత సంపాదించాలి? ఎలా సంపాదించాలి? ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకోవాలి. అక్రమ మార్గాలు అన్వేషించి లంచాలు ఎలా తినాలి. ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేయాలి. అనేదే చాలా మంది ఉద్యోగులు అనుసరిస్తున్న విధానం. ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు లంచం తీసుకుంటూ వుండేవారు. బియ్యంలో రాళ్లలాలా వుండేవారు. కాని ఇప్పుడు రాళ్లలో బియ్యంలా ఒకరో ఇద్దరో లంచాలు తీసుకోని వారున్నారు. ఇదీ ఇప్పటి ఉద్యోగుల పరిస్దితి. గతంలో ఒకటో రెండో శాఖల్లో అవినీతి జరుగుతుందని అనుకునే వారు. కాని ఇప్పుడు అన్ని శాఖల్లోనూ అవినీతి దూరింది. ముఖ్యంగా కొన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అలాంటి శాఖలో సివిల్‌ సప్లై శాఖ ఒకటి. ఈ శాఖలో ఉద్యోగం చేయాలంటే ఉద్యోగులు తలనొప్పి అనుకునేవారు. విపరీతమైన పని వుంటుంది. కాణి కూడా లంచం దొరకదనుకునే వారు. కాని ఇప్పుడు సివిల్‌ సప్లై శాఖలో కొలువు అంటే ఎగిరి గంతేస్తున్నారు. సివిల్‌ సప్లైలో ఉద్యోగం కావాలనుకుంటున్నారు. ఒకప్పుడు రెవిన్యూ వ్యవస్ధ నుంచి సివిల్‌ సప్లై శాఖకు డిప్యూటేషన్‌ మీద వెళ్లేందుకు ఎగబడుతున్నారు. రెవిన్యూ శాఖలో కింది స్ధాయి నుంచి తహసిల్ధార్‌ వరకు సివిల్‌ సప్లై శాఖకు వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. కావాలని కోరుతున్నారు. ఖర్చుకు కూడా వెనుకాడకుండా ఫైరవీలు చేయించుకుంటున్నారు. ఇదిలా వుంటే ఏడెనమిదేళ్ల క్రితం నుంచి డిప్యూటేషన్‌మీద వెళ్లిన అధికారులు కొందరు అక్కడే తిష్ట వేసుకుపోయారు. గతంలో మన తెలంగాణలో పంటల దిగుబడి తక్కువ. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మూలంగా తెలంగాణ విస్తారమైన వ్యవసాయం సాగుతోంది. రికార్డు స్దాయిలో పంటలు పండుతున్నాయి. అందులో ముఖ్యంగా వరి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ మారిపోయింది. దాంతో రెవిన్యూ వ్యవస్ధకంటే ఎక్కువ ఆదాయం సమకూర్చే శాఖగా సివిల్‌ సప్లై మారిపోయింది. ఇక అక్కడి నుంచి అదికారుల పంట పండిరది. తెలంగాణలో గతంలో వందల సంఖ్యలో వున్న రైస్‌ మిల్లులు వేల సంఖ్యకు చేరుకున్నాయి. రైస్‌ మిల్లులకు వడ్లను సమకూర్చే అదికారం వారి చేతుల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా డిసిఎస్‌వో( డిస్టిక్ట్‌ సివిల్‌ సప్లై ఆఫీసర్‌) డిటి. (డిస్టిక్‌ తహసిల్ధార్‌) , డిఎం. (డిస్టిక్ట్‌ మేనేజర్‌) స్దాయి ఉద్యోగులకు పండగే పండుగగా మారింది. వారికి వద్దన్నా లంచాలు వచ్చిపడే కామదేనువుగా సివిల్‌ సప్లై శాఖ మారింది. మిల్లులకు వడ్లు ఇవ్వడానికి, ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చిన మిల్లర్ల నుంచి బియ్యం సేకరించడానికి రెండు రకాల ఆదాయాలుగా అధికారులకు మారిపోయింది. సహజంగా ఒక ఉద్యోగికి ఒకే రకమైన లంచం వస్తుంది. కాని ఇక్కడ రెండు రకాల లంచాలు వచ్చే ఏకైక శాఖ సివిల్‌ సప్లైశాఖ అని ఉద్యోగులు చెప్పుకుంటారు. డిసిఎస్‌లో, డిటిలు మిల్లులకు వడ్లు కేటాయిస్తుంటారు. డిఎం. మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే బాద్యతలు నిర్వర్తిస్తుంటారు. దాంతో కింది నుంచి పై స్దాయి దాకా ఆదాయమే ఆదాయం అన్నట్లు మారిపోయింది. దాంతో అదే శాఖలో అదే కుర్చీలో ఏళ్ల తరబడి పై స్దాయి ఉద్యోగులు తిష్ట వేశారు. ఒక రకంగా పాతుకుపోయారు. వారికి అందే లంచాల కింద జీతం బియ్యంలో మెరిగలా మారిపోయింది. జీతానికి వంద రెట్లు లంచాలు అందుతున్నాయి. మిల్లర్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న వార్తలు అనేకం వున్నాయి. సివిల్‌ సప్లైశాఖలో డిఎస్‌ఓలు, డిఎం సంపాదనలకు లెక్కే లేదని అంటున్నారు. ఎక్కడా లంచం తీసుకున్నట్లు కూడా కనిపించదు. ఐదారేళ్లుగా ఇలా పాతుకుపోయిన అనేక మంది అదికారులు మిల్లర్లను పీల్చి పిప్పి చేస్తున్నారని సమాచారం. అక్రమంగా మిల్లర్లకు వడ్లు కేటాయించి, లక్షలకు లక్షలు లంచాలు తీసుకుంటున్నారు. దాంతో డిఎస్‌ఓలు, డిఎంలకు ఏ అవసరం వచ్చినా మిల్లర్లు ఎంత అడిగితే అంత సమకూర్చాల్సిందే. అధికారులు టూర్‌ వెళ్లే ప్యాకేజీలు చెల్లించాల్సిందే. ఎప్పుడు అడితే అప్పుడు, ఎంతఅడిగితే అంత ముట్ట చెప్పాలిందే? లేకుంటే మిల్లర్లకు చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సివిల్‌ సప్లైశాఖలో అధికారుల సంపాదన ఎంత దూరం వెళ్లిందంటే రాజకీయ నాయకులకు, పార్టీలకు ఫండిరగ్‌ చేసేంత సంపాదిస్తున్నారు. కుర్చీలను కాపాడుకుంటున్నారు. అదే కుర్చీలో కూర్చోవాలంటే అధికారపార్టీ పెద్దలకు కోట్ల రూపాయలు పార్టీ ఖర్చులకు సమకూర్చుతున్నారంటే ఏ స్ధాయిలో అదికారులు సంపాదిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అధికారులకు అవసరం వచ్చినా, నాయకుల అవసరాలను తీర్చాల్సిన పరిస్దితి ఎదురైనా సరే మిల్లర్ల నుంచి దండిగా వసూలుచేయడం అలవాటు చేసుకున్నారు. రెండు రకాలుగా మిల్లర్ల నుంచి సంపాదిస్తున్నారు. దీనంతటికీ ఆ అధికారులు మాతృ శాఖలకు వెళ్లకపోవడం, అదే కుర్చీలలో ఏళ్ల తరబడి పాతుకుపోవడం వల్ల సంపాదిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌శాఖలో కూడా ఇలాంటి వ్యవహరమే సాగేది. ఉమ్మడిరాష్ట్రం నుంచి రేవంత్‌ సర్కారు వచ్చే వరకు సుమారు పదమూళ్లు పాటు రిజిస్ట్రేషన్‌ శాఖలో ట్రాన్స్‌ఫర్లు జరగలేదు. ప్రమోషన్లు వచ్చినా సబ్‌ రిజిస్ట్రార్లు వద్దనుకున్నారు. పదమూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తూవచ్చారు. ఆ ప్రాంతంమీద పూర్తిపట్టు సాధించారు. లంచాలకు బరితెగించారు. రేవంత్‌సర్కారు వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్లందిరికీ ట్రాన్స్‌ఫర్లు చేయించారు. జోన్‌లు దాటించారు. సరిగ్గా ఇప్పుడు సివిల్‌ సప్లైలోనూ అదే పనిచేయాలి. అలా చేస్తే తప్ప అదికారుల విచ్చలవిడి అవినీతి తగ్గదు. ప్రభుత్వాదాయానికి గండిపడదు. సివిల్‌ సప్లై నూతన కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అన్నింటికన్నా ముందు ఉద్యోగులను జోన్‌లు దాటిస్తే శాఖను సగం గాడిలో పెట్టినట్లే అంటున్నారు. గత కమీషనర్‌ ఈ నిర్ణయం తీసుకునేలోపు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ఏ ఏ జిల్లాలలో ఏ అదికారి పాతుకుపోయారు. వారి సంపాదనలు ఎలా వున్నాయి? వారి వివరాలతో కూడిన సమగ్ర సమచారాలు మీ నేటిదాత్రిలో త్వరలో వరుస కథనాలు…

ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T182020.003.wav?_=3

 

ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

*పిజిఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మకు
సీఎం ఘన నివాళులు*

పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని బుధవారం పరామర్శించారు. దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ ఇటీవల మరణించగా కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పిజిఆర్ గార్డెన్ లో బుధవారం మాతృయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,

ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, ప్రజా ప్రతినిధులు ఇతర ప్రముఖులు హాజరు కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తదితరులు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి..

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా హనుమకొండ సుబేదారి లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగారు. దొంతి మాధవ రెడ్డి ని పరమార్శించేందుకు హెలికాప్టర్ ద్వారా ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్.

నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.ఆర్ట్స్ కళాశాల మైదానం నుండి రోడ్డు మార్గం లో పీజీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి దొంతి కాంతమ్మ మాతృయజ్ఞం కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు దొంతి కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ట్స్ కళాశాల మైదానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే లు చేరుకున్నారు.

తిరిగి హైదరాబాద్ కు హెలికాప్టర్ లో బయలుదేరిన సీఎం

వరంగల్ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి బయలుదేరారు. హెలిపాడ్ వద్ద మంత్రులు అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్. నాగరాజు,యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, ఎన్పీడీసీఎల్ వరుణ్ రెడ్డి, తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు

 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల మరణించిన నేపద్యంలో బుధవారం హన్మకొండ లోని పిజీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన మాతృ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొననుటకు గాను హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు.

కార్మిక హక్కులను రక్షించుకోవడానికి కనీస వేతనాలు

కార్మిక హక్కులను రక్షించుకోవడానికి కనీస వేతనాలు సాధించుకోవడానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

ములుగు జిల్లాలో ఈరోజు ఏఐటీయూసీ ములుగు మండల మహాసభ గుంజ శ్రీనివాస్,,, పెద్ద కాసు వినోద్ గారి అధ్యక్ష వర్గంగా, ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన మహాసభలో పాల్గొన్న, ఏఐటియుసి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి, జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం,కార్పోరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉండడానికి గాను, నాలుగు కోడ్స్ గా కుదించడం జరిగింది అన్నారు,అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ప్రజలు,కార్మికులు,ఉద్యోగులు,ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది అన్నారు, కనుక పై చట్టాలను రక్షించుకోవడానికి, కనీస వేతనాలు సాధించుకోవడం కోసం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు,, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని తీర్పు ఇచ్చినప్పటికీ, పాలకులు మాత్రం అమలు చేయడం లేదు అన్నారు, కనుక సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం పైన కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది, కేంద్ర రాష్ట్ర,ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే బదులు వాటిని ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నారు, అలాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలను విరమించుకొని ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించాలని ప్రభుత్వం ద్వారా అనే నేరుగా వేతనాలు చెల్లించాలని స్కీం వర్కర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలని కనీస వేతనాలు 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇవన్నీ సాధించుకోవడం కొరకు అన్ని వర్గాల ప్రజలు కార్మికులు ఉద్యోగులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది జేఐటియుసి మండల అధ్యక్షులుగా పెద్దకాసు వినోద్ ప్రధాన కార్యదర్శిగా గుంజ శ్రీనివాస్ గారలతోపాటు 22 మందిని ఎదుర్కోవడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బండి నరసయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షురాలు సామల రమ, సిపిఐ సీనియర్ నాయకులు ఇంజన్ కొమురయ్య, ముత్యం కొమురయ్య, వీరన్న,శ్రవణ్,, కొత్తపెళ్లి శ్రీనివాస్,అజిత, సంధ్య, లలిత, సంధ్య, సమత, గుండ్రెడ్డి శ్రీనివాస్, గుండె దీపిక,మల్రాజుల సమ్మయ్య,కమలక్క రమేష్,కుంకర స్వామి,కౌసల్య, శ్రీను, శిరీష, ప్రవీణ్,శ్రీకాంత్,జంపాల శ్రీనివాస్, ఎండి రంజాన్, నవ లోక,రజిత,లావుడే రాములు, కనక లక్ష్మి ఆసరి లక్ష్మి రాజకుమారి స్వరూప

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మాజీ ఉపరాష్ట్రపతి, భారత దేశ సైన్స్ పితామహుడు స్వర్గీయ అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రామకృష్ణాపూర్ పట్టణ తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ఎంపికైన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాజీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గత 25 సంవత్సరాల నుండి విద్యారంగంలో చేసిన నిస్వార్ధ సేవలకు గాను అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్ తెలిపారు. అబ్దుల్ అజీజ్ కు కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో పట్టణంలోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు…

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల రెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –
“డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఓ ప్రేరణ. సాధారణ కుటుంబంలో పుట్టి, కఠిన శ్రమతో దేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. విద్యార్థులు ఆయనలా పెద్ద కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలి. కలాం చెప్పిన ‘ కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’ అనే వాక్యాన్ని జీవితమంతా మంత్రంలా మార్చుకోవాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

యాదవ హక్కుల సాధనే అంతిమ లక్ష్యం…

యాదవ హక్కుల సాధనే అంతిమ లక్ష్యం
యాదవ సంఘం (a) జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్

రాయికల్, అక్టోబర్ 15, నేటి ధాత్రి:

రాజ్యాంగ పరంగా యాదవులకు దక్కాల్సిన హక్కులు సాదించుకోవడమే అంతిమ లక్ష్యం అని అందులో భాగంగానే గ్రామ గ్రామాన యాదవ సంఘ సమావేశాలు నిర్వహించి యాదవులను చేతన్య పరుస్తున్నామని యాదవ సంఘం (a) జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు
గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..
:- రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యుల సమావేశాన్ని యాదవ సంఘ భవనలో నిర్వహించారు..
ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, ముఖ్య సలహాదారులు తొట్ల చిన్నయ్య యాదవ్,అలిశెట్టి బుచ్చి రాములు యాదవ్,తొట్ల మహిపాల్ యాదవ్,గజనవేణి మహేష్ యాదవ్, మండల నాయకులు ఉష గంగ మల్లయ్య యాదవ్,గంగుల శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం,న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు..
అనంతరం మైతాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం “86 మంది,” సభ్యత్వం తీసుకోగ వారికి జిల్లా ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులందించిన జిల్లా అధ్యక్షుడు
గనవేని మల్లేష్ యాదవ్ ..
ఈ కార్యక్రమంలో..
మైతాపూర్ గ్రామ యాదవ సంఘ పెద్దమనుషులు, వంగ మల్లయ్య, దుగ్గిళ్ల ఎల్లయ్య, నాగుల గంగయ్య, నాగుల రాజేందర్, నక్క రాజారెడ్డి, గంగుల గంగారాం వంగ ప్రశాంత్ పంచతి గంగన్న గంగుల రాజన్న నక్క అభి కడుముంత రాజన్న బుస గంగారాం నాగుల రెడ్డి పంచతి గంగన్న,సంతోష్ గంగుల మల్లయ్య పంచతి మహేష్, నాగుల గంగారాం, మహిళలు తదితరులు పాల్గొన్నారు..

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గ్రీన్ వుడ్ విద్యార్థులు…

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గ్రీన్ వుడ్ విద్యార్థులు

కృషి,పట్టుదలతోనే, అవకాశాలు అందుతాయి

కరస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి

రాయికల్ అక్టోబర్ 15 , నేటి దాత్రి:

మండల కేంద్రంలోని గ్రీన్ వుడ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినిలు పోతరాజు అద్విత 8వ తరగతి మరియు పంచతి మధుప్రియ లను గ్రీనువుడ్ పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా స్థాయి కరీంనగర్ అండర్ 14 కబడ్డీ గర్ల్స్ విభాగం పెద్దపల్లిలో పోటీలు జరిగాయి అందులో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది దీనిలో అత్యధిక ప్రతిభ కనబరిచిన అద్విత, మధుప్రియలు సంగారెడ్డి పటాన్చెరువులో జరిగే క్రీడలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాకర శ్రీనివాస్ రెడ్డి హెడ్మాస్టర్ రాజేష్ ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయవకాశాలు అందుకోవాలని కోరారు.

చర్ల సిహెచ్ సి లో మొదలైన సిజేరియన్ ఆపరేషన్లు

చర్ల సిహెచ్ సి లో మొదలైన సిజేరియన్ ఆపరేషన్లు

జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రత్యేక కృషి

నేటిదాత్రి చర్ల

 

 

భద్రాద్రి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య సదుపాయాలు బలోపేతం అవుతున్నాయి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రత్యేక కృషి డీసీహెచ్ఎస్ రవిబాబు చొరవ కలగలిపి జిల్లాలోని వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రులలో ఆశించిన స్థాయిలో సేవలు అందుతున్నాయి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘట్టం

ఆవిష్కృతమైంది గత కొన్నాళ్ళుగా ప్రాథమిక వైద్యానికే పరిమితమైనా వైద్య సదుపాయాలు నేడు స్పెషాలిటీ వైద్య సేవలను సైతం అందుబాటులోకి వచ్చింది ఎం ఎల్ ఏ చొరవతో ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అదనపు ప్రోత్సాహాలు ప్రకటించి గర్భిణి స్త్రీల ఆరోగ్య రీత్యా ఒక ప్రసూతి వైద్యురాలు ఒక పిల్లల వైద్య నిపుణుడు ఒక మత్తు వైద్యుడు ని నియమించారు ఈ నియామకంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు ప్రత్యేక చొరవ చూపి వైద్యులను పది రోజుల క్రితం నియమించారు

ఈ క్రమం లో నేడు చర్ల సి హెచ్ సి లో మొదటి సీజేరియన్ ఆపరేషన్ జరిగింది చర్ల మండలం కొత్తూరు గ్రామంకి చెందిన తన్నీరు రాజేశ్వరి మొదటి కాన్పు కోసం రాగా సుఖప్రసవం కోసం ప్రయత్నం చేసి కాన్పు చేయలేని పరిస్థితిలో తల్లి బిడ్డ క్షేమం కోసం ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి పండంటి రెండు కేజీల మగ బిడ్డకి ఊపిరిపోశారు గతంలో ప్రసూతి సేవల కోసం అరవై కిలోమీటర్ల దూరంలో భద్రాచలం వెళ్లే పరిస్థితులు ఉండేవి కానీ ఏజెన్సీ లో ని చర్ల లో సైతం ప్రసూతి సేవలను అందుబాటులో తెచ్చిన ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావు కలెక్టర్ జితేష్ పాటిల్ డిసిహెచ్ఎస్ రవిబాబు లకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయివర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు ఆసుపత్రిలో అందుతున్న స్పెషాలిటీ సేవల పట్ల చర్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ ఆపరేషన్ లో ప్రసూతి వైద్యురాలు శ్రావణి పిల్లల వైద్యులు రవి కుమార్ మత్తు వైద్యుడు శివరామకృష్ణ నర్సింగ్ ఆఫీసర్ ఝాన్సీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

హీరో సుమన్ కరాటే మాస్టర్ నవీన్ ను బ్లాక్ బెల్ట్ కోసం అభినందించారు…

అంతర్జాతీయ జపాన్ బ్లాక్ బెల్ట్ డిప్లోమా సాధించిన కరాటే మాస్టర్ నవీన్ ను ప్రశంసించిన హీరో సుమన్
మెట్ పల్లి అక్టోబర్ 15 నేటి ధాత్రి

 

జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో నాగబాబు స్టూడియో అజిజ్ నగర్ హైదరాబాద్ లో తేది.14.10.2025 మంగళవారం రోజున నిర్వహించిన అంతర్జాతీయ, జాతీయ బ్లాక్ బెల్ట్ ప్రశంసా పత్రాల ప్రధానోస్తవ కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటుడు సుమన్ చేతుల మీదుగా బండాలింగాపుర్ గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ నవీన్ కు శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్, రాపోలు సుదర్శన్ మాస్టర్ సమక్షంలో అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ డిప్లోమా ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ఈ రోజుల్లో విద్యార్థులు శారీరిక మానసిక వ్యక్తిత్వ వికాసానికి విద్యార్థుల ఎదుగుదలకు ఇలాంటి కరాటే ఆత్మరక్షణ విద్యలు ఎంతగానో దోహదపడతాయని అందరూ ఈ విధ్యను కటోరా సాధనతో నేర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ జపాన్ కరాటే అసోసియేషన్ ఛైర్మన్ సినీ నటుడు సుమన్, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్, కరాటే మాస్టర్లు ఆంజనేయులు, బాగ్యరాజ్, పవన్ కళ్యాణ్, నవీన్, విశ్వ తేజ, కరాటే విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పరామర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తనతో పాటు జహీరాబాద్ నియోజకవర్గ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి
మల్లిఖార్జున ఖర్గేకు ఇటీవల పేస్ మేకర్ అమర్చిన వైద్యులు.ఖర్గేతో సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు,

పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాలు…

పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాలు
* నెలరోజుల పాటు ఉచిత టీకాలు
* పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి
* వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రాజబాబు

మహాదేవపూర్ అక్టోబర్ 15 (నేటి ధాత్రి)

 

జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాల కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రాజబాబు ఒక ప్రకటనలో బుధవారం రోజున తెలిపారు. మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికొంటువ్యాధి టీకా కార్యక్రమం అక్టోబర్ 15 నుండి నవంబర్ 14 రోజుల వరకు అనగా నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇది జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అమలవుతుందని దీనిని మండలంలోని పాడి రైతులు అందరూ సద్వినియోగ పరచుకోవాలని కోరారు. మండలం మొత్తం మీద మూడు టీంలు ఏర్పాటు చేసి వ్యాధి నివారణ టీకాలు గ్రామాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గాలికుంటు వ్యాధి చాలా వేగంగా వ్యాపించే వైరస్ వ్యాధి అని ఈ వ్యాధి సోకిన పశువులకు పాల ఉత్పత్తి, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిస్తుందని అంతేకాక రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుందని తెలుపుతూ మండలంలోని ప్రతి పాడే రైతు ఆరు నెలలకు టీకా వేయించడం ద్వారా తిని నివారించవచ్చని అన్నారు. ప్రతి పాడి రైతు తన పశువులకు టీకా వేయించి పషా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇది ఎఫ్ఎండి టీకా ఉచితం సురక్షితం మరియు శాశ్వత నివారణ మార్గం అని డాక్టర్ రాజబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా జిల్లా లైబ్రరీ చైర్మన్ కోట రాజబాబు, సింగల్ విండో చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి, పశు వైద్య కేంద్ర సిబ్బంది, పాడి రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..
– ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలంలోని రైతులు రోడ్లపై వరి ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాహనదారులు వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని తెలిపినారు.ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబోసిన కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి ధాన్యము రాశి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ప్రయాణికుల రాకపోకల కోసం ప్రభుత్వాలు వేసిన రోడ్లపై ధాన్యం ఆరబోసి ఇబ్బంది చేయడం తగదని రైతులు ఇతర ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకొని సహకరించాలని ప్రమాదాలు జరగకుండా బాధ్యతయుతంగా నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతుల ముఖ్యంగా డబల్ రోడ్లపై ఒకవైపు ధాన్యం ఆరబెట్టుట కోసం పోస్తున్నారని దానితో ప్రమాదాలు జరిగి కేసుల పాలు కావడం జరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ ఉన్నతాధికారులు సైతం వీటిపై ప్రత్యేక దృష్టి సాధించారని రైతులు అవగాహన పెంచుకొని ధాన్యం రోడ్లపై ఆరబెట్ట రాదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామకము…

కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామకము

వనపర్తి నేటిదాత్రి .

 

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా డి సి సి అధ్యక్షుల
ప్రక్రియ పూర్తిచేసే దిశగా సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమం కొత్తకోట ,, మదనపురం మండలాల సమన్వయ కమిటీ సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిం చారు ఈసమావేశనికి ఏఐసీసీ అబ్జర్వర్లు పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ టీపీసీసీ , వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారుఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా, అన్ని అంశాలను పరిగణలకు తీసుకుని ఏఐసీసీడీసీసీ అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు
బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడంలో బి ఆర్ ఎస్ బిజెపి పార్టీలని విమర్శించారు
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నదని అన్నారు

చర్ల మండలంలో ఆర్ఎంపీలు అనధికారిక హాస్పిటల్స్ నిర్వహణ

క్వాలిఫైడ్ డాక్టర్లను మరిపించేలా చర్ల మండలం ఆర్ఎంపిలు

ఒకప్పుడు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లే నేడు హాస్పిటల్సగా నిర్వహణ

వైద్యాధికారుల అనుమతులతోనే నడుస్తున్నాయా

నేటిదాత్రి చర్ల

Vaibhavalaxmi Shopping Mall

చర్ల మండలం చతిస్గడ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతం కావడంతో అమాయకులైన ఆదివాసిలు నమ్మి ఆర్ఎంపీల వద్దకు వైద్యం కొరకు వెళ్లడంతో వారు ప్రధమ చికిత్స చేయవలసిన సదరు ఆర్ఎంపీలు స్టెరాయిడ్స హైడోస్ యాంటీబయటిక్లు ఇస్తున్నారు రక్త పరీక్షలు చేయిస్తూ మలేరియా డెంగ్యూ జ్వరాలకు కూడా వచ్చి రాని వైద్యం చేస్తున్నారు వ్యాధి ఎక్కువ అయిన తరువాత భద్రాచలం పంపిస్తూ కూడా లబ్ధి పొందుతున్నారు అక్కడకు వెళ్లి చివరి దశలో రోగులు ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు ఆర్ఎంపి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఇప్పుడు హాస్పిటల్ గా చలామణి అవుతున్నాయి ఎలా సాధ్యమని వివరాలు కోరితే మాకు ల్యాబ్లకు లైసెన్స్ ఉన్నాయని చెప్పడం గమనార్హం
ప్రక్కనే మెడికల్ షాపు డయాగ్నస్టిక్ సెంటర్లు ఎలా వచ్చాయి ఒకప్పుడు క్లినిక్ అని బోర్డు పెట్టడానికి భయపడే ఆర్ఎంపీలు ఇప్పుడు కొందరు హాస్పిటల్ గా ప్రభుత్వ అనుమతులతో బయో మెడికల్ మరియు డయాగ్నిక్ సెంటర్లకొరకు అడ్డదారిలో అనుమతి తీసుకుని భద్రాచలం లో ఉండే డాక్టర్లు పేర్లతో బోర్డులు తగిలించుకొని వైద్యశాలలు నడుపుతున్నారు డిఎంఎల్ టి క్వాలిఫికేషన్ ఉన్నవారికి కూడా ల్యాబ్ పర్మిషన్ లేదు ఎందుకంటే వారు ఆర్ఎంపీలకు మరియు సెల్ఫ్ గా టెస్టులు చేస్తూ వైద్యం చేస్తున్నారని వారిని నియంత్రణ చేయాలన్న ఉద్దేశంతో మినిమం ఎంబీబీఎస్ అర్హత ఉన్న వారి వద్దే ల్యాబ్ ఉండాలన్న రూల్స్ అమల్లో ఉన్నాయి కానీ ఆర్ఎంపీల డయాగ్నస్టిక్స్ సెంటర్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారు అర్థం కాని పరిస్థితి వారి ల్యాబ్లో కనీస అర్హత కలిగిన టెక్నీషియన్స్ కూడా లేకుండానే కొందరైతే ఆర్ఎంపీలే రక్త పరీక్షలు చేస్తున్నారు మండలంలోని చిన్న గ్రామాలు తెగడ సత్యనారాయణపురం ఆర్ కొత్తగూడెం లో కూడా ఆర్ఎంపీలు ల్యాబ్లు నిర్వహిస్తున్నారు ఒక ల్యాబ్లో రిపోర్టు మరో ల్యాబ్ రిపోర్టుకి సంబంధం లేకుండా ఇస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా వీరి మధ్య పోటీ పెరగడంతో మా వద్ద రక్త పరీక్షలకు తక్కువ ధరలు అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు ఇకనైనా అధికారులు స్పందించి నకిలీ వైద్యులను గుర్తించి వారి మీద చర్యలుతీసుకోవాల్సిందిగా చర్ల మండల ప్రజలు కోరుకుంటున్నారు

ఎస్టిపిపి ఫారెస్ట్ కాంటాక్ట్ కార్మికులపై ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి వేధింపులు..

ఎస్టిపిపి ఫారెస్ట్ కాంటాక్ట్ కార్మికులపై ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి వేధింపులు

ఫారెస్ట్ అధికారిణిని వెంటనేబదిలి చేయాలని ధర్నా చేపట్టిన హెచ్ఎంఎస్ యూనియన్

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం ఎస్టిపిపి లో పని చేస్తున్న ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా వేధింపులకు గురవుతున్నారంటూ హెచ్‌ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు.ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి కార్మికులపై అసభ్య పదజాలంతో దూషణలు చేయడం,పనిలో అనవసర ఒత్తిడులు తీసుకురావడం,వర్షాలు పడితే పని బంద్ చేసి జీతాలు ఇవ్వకపోవడం,పనికి వచ్చినా మాస్టారు ఇవ్వకపోవడం వంటి చర్యలతో కార్మికులు తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు వాపోయారు.ప్రతి రోజు 200-300 మీటర్లు పని చేయాలంటూ భారం మోపుతూ,పని చేయలేని కార్మికులకు వార్నింగ్ లెటర్లు జారీ చేస్తు వేధించడంతో విసిగిపోయిన బాధిత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు.ఈ విషయానికి స్పందించిన సింగరేణి యాజమాన్యం తరఫున జిఎం నర్సింహారావు,డీజిఎం పర్సనల్ కిరణ్ బాబు,ఇతర అధికారులు ధర్నా ప్రదేశానికి వచ్చి కార్మికుల సమస్యలను పరిశీలించి,వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.ధర్నా అనంతరం జనరల్ మేనేజర్ నరసింహారావు కి మెమోరండం అందజేశారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ విక్రమ్ కుమార్,ఉపాధ్యక్షులు సాయికృష్ణ,చిప్పకుర్తి సంపత్, నవీన్,గోగు మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో మైనర్ బాలికలను వేధించడం పై కఠిన హెచ్చరిక

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళినా, తీసుకెళ్లినా, సహకరించినా జైల్ కే

◆:- ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ హెచ్చరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం , మాయ మాటలు చెప్పి వెంట పడటం తర్వాత తీసుకెళ్లడం చేస్తున్నారని, ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళినా, తీసుకెళ్లినా, తీసుకెళ్లేందకు ఎవరైనా అతనికి సహకరించినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ హెచ్చరించారు. మైనర్ బాలికలను వేధిస్తే పోక్సో చట్టం ప్రకారం 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. యువత భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం మహేష్ యాదవ్ నుండి

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

 

అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున 30000 ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జెనిగల మహేష్ యాదవ్ .. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో కొన్ని రోజుల క్రితం 5 మంది అనారోగ్యంతో మృతి చెందారు అదేవిధంగా బైకు ప్రమాదంలో ఓ వ్యక్తి కింద పడి గాయాలవడం తో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మహేష్ యాదవ్ చనిపోయిన బుడ్డమ్మ , రాజు, పున్నమ్మ ,నరసింహ లకు అదేవిధంగా బైకు యాక్సిడెంట్లో ప్రమాద వశాత్తు కిందపడ్డ యాదయ్య లకు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు .ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలను పరామర్శించి మొత్తం 6 కుటుంబాలకు 30000 ఆర్థిక సాయం చేస్తూ ఎవరు అధైర్య పడొద్దు ధైర్యంగా ఉండాలని ఎలాంటి ఇబ్బంది వచ్చిన నాకు తెలియజేయాలని మీ కుటుంబాలకు అండగావుంటా అని భరోసా ఇచ్చారు. నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, చంటి, బిక్షపతి, నవీన్, సాదిక్, రాజేష్, లక్ష్మణ్,మధు,మహేష్, రాకేష్, వినోద్ రమేష్,శ్రీకాంత్, శ్రీధర్, వంశీ,శేఖర్ గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పరామర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తనతో పాటు జహీరాబాద్ నియోజకవర్గ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మల్లిఖార్జున ఖర్గేకు ఇటీవల పేస్ మేకర్ అమర్చిన వైద్యులు.ఖర్గేతో సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు,

error: Content is protected !!
Exit mobile version