అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి…

అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి

అంగన్వాడీ కేంద్రాల్లో ఒకపూట బడి జీవో విడుదల చేయాలి

మంత్రి సీతక్కను కలిసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు

హైదరాబాద్,నేటిధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో వేసవికాలం దృశ్య ఒకపూట నిర్వహణ కోసం జీవో విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ ప్రజా భవన్‌లో మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బియార్టీయు) రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించి సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక పూట నిర్వహణ కోసం జీవో జారీ చేయాలని కోరారు. అలాగే మే నెలలో టిహెచ్ఆర్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చి మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని అన్నారు. 2024-25 సంవత్సరంలో రిటైర్మెంట్ అయిన టీచర్స్ మరియు హెల్పర్స్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్స్‌కు 18 వేల వేతనం అమలు చేయాలని కోరారు.మంత్రి సీతక్కను కలిసిన అనంతరం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జేడీ అడ్మిన్ అకేశ్వర్ రావు, జేడీ మోతిని కలిసి సమస్యలపై చర్చించారు. మంత్రి మరియు అధికారులను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. రమా తార, కోశాధికారి ఎం. వేదవతి, రాష్ట్ర నాయకులు ఎల్లమ్మ, రజిత, శిరీష పాల్గొన్నారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీస్ జారీ…

ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీస్ జారీ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఎమ్మారై యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తు సరఫరా పనుల్లో జాప్యంపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ఎమ్మారై పరికరం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఎమ్మారై యంత్రం ఏర్పాటు కోసం అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడంపై షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. ఎమ్మారై యంత్రం ఏర్పాటు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆర్డిఓను పర్యవేక్షణ సంబంధిత అధికారిగా నియమించామని తెలిపారు.
విద్యుత్ సరఫరా ఏర్పాటుకు అవసరమైన పరికరాలను ఇప్పటికీ సమకూర్చకపోవడంపై కలెక్టర్ ప్రశ్నిస్తూ, ఈ విధంగా కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతాయని అసహనం వ్యక్తం చేశారు. యంత్రం ఏర్పాటు అవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఉప పర్యవేక్షకులు డా వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా రాజేష్, టిజిఎంఎస్ ఐడిసి ఏఈ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఫోకస్..

విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఫోకస్..

 

గత ప్రభుత్వ హయాంలో వర్ధన్నపేట అభివృద్ధికి నోచుకోలేదు..

ప్రజలు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా ఆధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలు, సిబ్బంది నియామకాలు అన్నింటినీ ప్రాధాన్యతతో అమలు చేస్తాం…

గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి…

వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఈ ఆస్పత్రి ఎంతో మేలు చేస్తుంది..

వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ 100 పడకల ఆస్పత్రికి నేడు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు కలెక్టర్ సత్య శారద దేవి

వర్ధన్నపేట( నేటిధాత్రి)
పర్వతగిరి, ఐనవోలు మండలాల ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉప్పరపల్లి క్రాస్‌ రోడ్ వద్ద 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నేడు సుమారు రూ. 28 కోట్ల నిధులతో నిర్మించబడనున్న ఈ ఆసుపత్రికి భూమిపూజను గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, టీజీ క్యాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ
గత ప్రభుత్వ హయాంలో వర్ధన్నపేట అభివృద్ధికి నోచుకోలేదని, గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, వంద పడకల ఆసుపత్రి ఈ ప్రాంత ప్రజల కళ అని, అన్ని మండలాల ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఉప్పరపల్లి వద్ద వంద పడకల ఆసుపత్రి పనులను చేపడుతున్నామని, వీలైనంత త్వరగా ఆసుపత్రి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలోని డయాలసిస్ పేషెంట్లు వైద్యం కోసం ఎంజీఎం వెళ్లాల్సి వస్తుందని, వర్ధన్నపేట నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ మంజూరు అయిందని, డయాలసిస్ సెంటర్ మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహలకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. త్వరలోనే మున్సిఫ్ కోర్టు ప్రారంభమవుతుందని, కోర్టు ఏర్పాటు అయితే ఈ ప్రాంత ప్రజలకు హనుమకొండకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో విద్య, వైద్యం, క్రీడారంగ బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని, త్వరలోనే నియోజకవర్గానికి స్టేడియం మంజూరు అవుతుందన్నారు. ఇటీవలే వరంగల్ జిల్లా కలెక్టర్ జల సంరక్షణలో అవార్డును అందుకున్నారని, కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మహిళా కలెక్టర్ అయిన అనునిత్యం ప్రజల్లో ఉంటూ మెరుగ్గా పనిచేస్తున్నారని, వరంగల్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా కలెక్టర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు….

“వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ప్రజలు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా ఆధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలు, సిబ్బంది నియామకాలు అన్నింటినీ ప్రాధాన్యతతో అమలు చేస్తాం.
ఈ ఆసుపత్రి ద్వారా అత్యవసర సేవలు, ప్రసూతి సేవలు, శస్త్రచికిత్సలు, పిల్లల వైద్య సేవలు వంటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంబులెన్స్ సేవలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు త్వరితగతిన చికిత్స అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తాము.
వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఈ ఆస్పత్రి ఎంతో మేలు చేస్తుంది. ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తాం” అని అన్నారు.ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ.
వర్ధన్నపేట నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుతో ఎంజీఎం ఆస్పత్రిపై భారం తగ్గుతుందని, 1-2 సంవత్సరాలు ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ప్రస్తుతం 300, 400 ఓపి పేషెంట్లు వస్తున్నారని, భవిష్యత్తులో ఒపీ పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, మెడికల్ హబ్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు…
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి, వరంగల్ జిల్లా DM&HO సాంబ శివరావు, DCH రామ్మూర్తి, సూపర్డెంట్ నరసింహ స్వామి, ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version