కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి…

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ప్రాంతంలోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఏరియా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ, పరిశ్రమల్లో కార్మికులు మరణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమస్యలపై తక్షణమే స్పందించి, కార్మికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు.

గౌడ వృత్తి దిన దిన గండం ఆగని చావులు…

గౌడ వృత్తి దిన దిన గండం ఆగని చావులు
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

 

 

గౌడ కులస్తుల జీవనం రోజు రోజుకు మరి అధ్వనంగా మారుతుంది.ప్రభుత్వం గీతా కార్మికులకు ఇస్తామన్న కాటమయ్య కిట్లు అందక పోవడం వల్ల తరచూ గీత కార్మికులు ప్రమాదల బారిన పడుతున్నమన్నారు.శనివారం ఉదయం బెల్లంపల్లి మండలం లోని మాలా గురుజాల లో పోతుగంటి శంకర్ గౌడ్ అనే గీతా కార్మికుడు ఉదయం చెట్టు ఎక్కి కళ్ళు కిందకి దింపే క్రమంలో కాలుజారి బురదలో పడి మృతి చెందినట్లు తోటి గీతా కార్మికులు తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన గీత కార్మికులకు వెంటనే కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలని,చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి 10లక్షల రూపాయల ఎక్స్ క్రేషియా ఇవ్వాలని మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసరపు మొండిగౌడ్ డిమాండ్ చేస్తున్నారు.ఈకార్యక్రమంలోమోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారపు మొండి గౌడ్,రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి పెరు మండ్ల భాస్కర్ గౌడ్,జిల్లా కార్యదర్శి గాజుల రమేష్ గౌడ్,యువ నాయకులు తాళ్లపల్లి సృజన్ గౌడ్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version