చానిగెపల్లిలో ₹20 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

చానిగెపల్లిలో ₹20 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ని న్యాల్కల్ మండలం, చనిగెపల్లి గ్రామంలో సుమారు ₹20 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ సుధాకర్ నాయకత్వంలో ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో రోడ్లు, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పనులు కొనసాగుతాయని సర్పంచ్ తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత గ్రామంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు సౌకర్యం కలుగుతుందని, ఇది గ్రామాభివృద్ధికి కీలక ముందడుగు అని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఎంపీపీ సురేష్ కుమార్ షెట్కార్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

వారంరోజుల పాటు వన్ వే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ నెమ్మదిగా వెళ్లాలి…

వారంరోజుల పాటు వన్ వే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ నెమ్మదిగా వెళ్లాలి

దామెర ఎస్సై కొంక అశోక్ సూచన

పరకాల,నేటిధాత్రి

 

పరకాల నియోజకవర్గం దామెర మండల పరిధిలోని ఊరుగొండ నుండి ఎన్ఎస్ఆర్ హోటల్ వరకు జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మతు పనులు నేటి నుండి ప్రారంభమయ్యాయి.ఈ పనులు వారం రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.రోడ్డు పనుల దృష్ట్యా ఈ మార్గంలో వన్-వే విధానం అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఈ క్రమంలో వాహనదారులు ఓవర్‌టేకింగ్ చేయకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.దామెర ఎస్సై కొంక అశోక్ మాట్లాడుతూ,రోడ్డు పనుల సమయంలో ప్రమాదాలు జరగకుండా వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.ప్రత్యేకంగా ఊరుగొండ మార్గంలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండి,సూచించిన మార్గదర్శకాలను పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుందని పోలీసులు తెలిపారు.ప్రజల భద్రత దృష్ట్యా చేపట్టిన ఈ చర్యలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

జాతీయ రహదారి విస్తరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి…

జాతీయ రహదారి విస్తరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

జాతీయ రహదారి 63 విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని మందమర్రి మండలం తిమ్మాపూర్ ప్రాంతంలో ఆర్మూర్ నుండి చంద్రాపూర్ జాతీయ రహదారి 63 పనులను మండల తహసిల్దార్ సతీష్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం మందమర్రి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు తీరును మండల తహసిల్దార్ సతీష్,మున్సిపల్ కమిషనర్ రాజలింగులతో కలిసి పరిశీలించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని,అంతర్గత రహదారులు,మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు.ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలని,మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను నిబంధనలకు లోబడి చేపట్టేలా అవగాహన కల్పించాలని,నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను,ఇతర పన్నులను 100 శాతం వసూలు చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డును సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.నివాసాల నుండి సేకరించిన చెత్తలో ఉపయోగకరమైన వాటిని వేరుచేసి సెగ్రిగేషన్ షెడ్ కు తరలించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version