ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్.

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్

◆ విధుల్లో నిర్లక్ష్యం.. కరెంట్ పోయినప్పుడు టార్చ్ లైట్లతో వైద్యం

జహీరాబాద్ నేటి ధాత్రి,:

 

 

 

జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో భద్రత లోపాలు, ఆధునిక వసతుల వినియోగంలో నిర్లక్ష్యం ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ను అదికారికంగా సస్పెండ్ చేశారు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో జన రేటర్ ఉన్న వాడకపోవడంతో పేషెంట్లకు టార్చ్ లైట్ల ద్వారా వైద్యం అందిం చిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పత్రికల్లో కథనాలు వెలువడిన వెంటనే సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశే ఖర్ స్వయంగా ఆస్పత్రిని తనిఖీ చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో డాక్టర్ శ్రీదర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గతంలోను డాక్టర్ శ్రీధర్పై పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. కొంతమంది ఉద్యో గులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గుసగుసలాడుతున్నారు. ప్రజల ప్రాణాలు దోహదంగా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకోవడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నాయి. ఈ ఘటనపై మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆరోగ్య శాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు.

కోటగుళ్లలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు

గోశాల నిర్వహణకు రూ. 56వేల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద రూ 56 వేలను అందజేశారు. ఈ సందర్భంగా గోశాల గోమాతలకు నవీన్ కుమార్ సుమతి దంపతులు పండ్లను
అందజేశారు. అనంతరం డాక్టర్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల నిర్వహణకు వేతనాన్ని అందజేసిన నవీన్ కుమార్ సుమతి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

గోపి కుటుంబాన్ని పరామర్శించిన.!

గోపి కుటుంబాన్ని పరామర్శించిన సూపరిండెంట్ గౌతమ్ చౌహన్,డాక్టర్.బాలకృష్ణ

ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వఆసుపత్రి సిబ్బంది

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్న వైనాల గోపి కుమారుడు వైనాల లక్కీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది.గోపి కుటుంబాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్,ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణ పరామర్శించి ఓదార్చడం జరిగింది.అనంతరం భాదిత కుటుంబానికి 20,000ల ఆర్థిక సాహయాన్ని అందజేశారు.అనంతరం సూపరిండెంట్,ఆర్ఎంఓ లు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వైనాల గోపి కుమారుడు వైనాల లక్కీ చనిపోవడం చాలా బాధాకరమని గోపి కుటుంబానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version