తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అగ్ని కణం శ్రీకాంత చారి..

తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అగ్ని కణం శ్రీకాంత చారి

శ్రీకాంతచారి వర్ధంతికి ఘనమైన నివాళులు

కేసముద్రం/ నేటి ధాత్రి*

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ఆత్మ బలిదానంతో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన తొలి అమరవీరుడు శ్రీకాంత్ చారి అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చాగంటి కిషన్ అన్నారు. బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాగంటి కిషన్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అవకాశాలను ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయని ఉద్యమం లేచిన నేపథ్యంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపడానికి తన ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరుడు శ్రీకాంత్ చారి అని కొనియాడారు. తన శరీరం మంటలతో దహనం అవుతున్న లెక్కచేయకుండా జై తెలంగాణ అంటూ నినదించిన వీరుడని అన్నారు. శ్రీకాంత్ చారి అమరత్వాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిన హామీలలో భాగమైన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం,ఇళ్లను ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది తక్షణమే ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి పెన్షన్ సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దశ్రు నాయక్,మంద భాస్కర్, శివారపు శ్రీధర్ సోమారపు వెంకటయ్య,కళ్ళెం శ్రీనివాస్, వాంకుడోత్ సూర్య, నర్సిరెడ్డి, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బచ్చవో ముమెంట్ అవిర్బావ ప్రరంభం

తెలంగాణ బచ్చవో ముమెంట్ అవిర్బావ ప్రరంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

అగస్టు 20వ తేది నాడు హైదరాబాద్ బాషిరాబాగ్ లో తెలంగాణ బచావో మూవ్మెంట్ వ్యవస్థాపకులు పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమకారులు మాజీ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిలుపుమేరకు తెలంగాణ బచావో మూమెంట్ ఆవిర్భావ దినోత్సవంకి వెళ్ళిన జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పి. రాములు నేత తెలంగాణ ఉద్యమకారులు మొహమ్మద్ ఇమ్రాన్ గారు తెలంగాణ ఉద్యమకారులు జె. రవికిరణ్ మాజీ సర్పంచ్ మరియు మాదినం శివప్రసాద్ సీనియర్ నాయకులు గార్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వెళ్లి తెలంగాణ బచావో మూమెంట్ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొని తమ వంతు మద్దతును తెలిపారు ఈ ఉద్యమ స్ఫూర్తిని జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రతి మారుమూల గ్రామమైన పల్లెలోకి తీసుకువెళ్తామని తెలంగాణ దోపిడిదారులను కల్తీ నకిలీ వ్యాపారస్తులను తరిమి కొడతామని జహీరాబాద్ నియోజకవర్గం కార్మికులను పరిరక్షించి వారి సంక్షేమం కోసం పాటుపడతామని తెలిపినారు.

22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్

22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో మంగళవారం కేఫ్ ఎతనిక్ లో వివిధ కుల సంఘల నాయకులందరూ ఈ నెల 22వ తేదీన జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. జహీరాబాద్ పట్టణంలో బాహర్ వాలే హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదాలతో బంద్ కి పిలుపు ని ఇవ్వడం జరిగింది.తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం అని తెలంగాణ రాష్ట్ర ఉద్యమా కాలంలో ఎంతో మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది అని జహీరాబాద్ పట్టణంలో వివిధ కుల సంఘాల నాయకులు అన్నారు.ఈ కారిక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాములునేత,పెద్ద గోల్ల నారాయణ, తిన్మార్ నర్సిములు,మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్, దిగ్వాల్ రామేష్,మంగాలి ప్రభు,దత్తు,ఉమేష్,సి.హేచ్ శ్రీనివాస్, ప్యార్ల దశరథ్, తదితరులు పాల్గొన్నాడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version