ఘనంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు
పరకాల నేటిధాత్రి
మాజీ ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బస్టాండ్ కూడలిలో బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ చేసి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించారు.అనంతరం స్థానిక ప్రభుత్వ దవాఖానలో రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ పరకాల అభివృద్ధి పదంలోకి వచ్చింది అంటే అది ధర్మారెడ్డి గతంలో పట్టణానికి తీసుకువచ్చిన 100 పడకల ఆసుపత్రి,ప్రభుత్వ కార్యాలయాలు,టెక్సటైల్ పార్క్ ఇవన్నీ నిదర్శమని మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీల తరుపున నియోజకవర్గ ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు,మహిళా నాయకురాళ్లు,యూత్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.