మందమర్రి గణేష్ ఉత్సవాల్లో 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు…

బొజ్జ గణపయ్యకు108 ప్రసాదాలతో పూజలు.

మందమర్రి నేటిధాత్రి

గత 5 సంవత్సరాలుగా శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రుల ఉత్సవాలను జరుపుతున్నారు.

మందమర్రి శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడికి అత్యంత ఇష్టమైన మోదకం, లడ్డు ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, పూరి, కోవా, పానకము,అరిసి పొంగల్,కుజి,బూందీ,
చారు, నైవేద్యము పండ్లు పలహారాలు 108 ప్రసాదాలతో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అందరూ కలిసి మన సాంస్కృతికి అనుగుణంగా చీరలు కట్టుకొని గణనాథుని పూజలో పాల్గొన్నారు.

తదనంతరం మహా గణనాథునికి హారతి పాటలతో హారతిపట్టి పూలతో అభిషేకం చేసి ఆ మూషిక వాహనానికి భక్తితో అలరించిన భక్తులు

ఈ కార్యక్రమం లో ముఖ్యులుగా ముందు ఉండి నడిపించిన వారు… చిటికనేని వెంకట్రావ్ సుశీల, పంబాల శ్రీనివాస్, పట్టి భాను చందర్, పట్టి సతీష్ బాబు, మారం వినీత్, కుంభం రాజు, నూనె రాజేశం, కట్ట తాత రావు, కట్ట సూరిబాబు, అనబోయిన కుమార్, కొమ్మ రాజబాబు, ముప్పు రాజు భక్తులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బిఆర్ఎస్ పార్టీ ధర్నా, రస్తారోకో..

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా మరియు రస్తా రోకో కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి,కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది.
సిబిఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలి.లేదంటేమున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని.బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి , కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ , వివిధ గ్రామాల తాజా మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ వార్డ్ సభ్యులు ముఖ్య నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

దశదినకర్మలకు ఆర్థిక సహాయం అందజేత.

దశదినకర్మలకు ఆర్థిక సహాయం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం
ఆదివాసి జేఏసి ఆధ్వర్యంలో వెంకటాపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం పోలేబోయిన సుశీల దశదిన కర్మలకుగాను ఆదివాసి జేఏసీ, మరియు దాతల సహాయార్థం 125kg ల బియ్యం, 15kg నూనె ఇవ్వటం జరిగింది. అలాగే తన వంతు సహాయంగా మన మండల రెవిన్యూ భూభారతి ఆపరేటర్ చందా కౌసల్య 6,500 రూపాయలు నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం లో జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకట నారాయణ గారు, మాజీ సర్పంచులు పాయం నర్సింహారావు గారు, పోలేబోయిన పాపక్క ,ఆదివాసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, పోలేబోయినా సర్వేశ్వరావు, తుడుందెబ్బ మండల అధ్యక్షులు పోలేబోయినా ప్రేమ్ కుమార్, కలం సంపత్, ఉకే నరేష్, పోలేబోయిన స్వామి ప్రసాద్, రాజశేఖర్, గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం కుట్రపై బి ఆర్ ఎస్ ధర్నా….

తెలంగాణకు వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు.

#ఘోష్ కమిషన్ నివేదిక కాంగ్రెస్ పార్టీ స్క్రిప్టు.

#కాంగ్రెస్ పార్టీ తాటాక చప్పులకు భయపడేది లేదు.

#మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మండల లోని నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి365 పై మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి నది జలాలను ఆంధ్రకు తరలించే కుట్రలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నది జలాలను ఆంద్రాకు తన రాజకీయ గురువుకు గురుదక్షిణగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించే తీరు ప్రజలందరికీ అర్థమవుతుందని ఎద్దేవ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకనే సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసి వేయడమేనని అర్థమవుతుంది. నిన్నటి వరకు సిబిఐ పై అనేక ఆరోపణలు చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా మాట ఎందుకు మార్చాడో ప్రజలకు వివరించాలన్నారు. దీని వెనకాల ఉన్న శక్తులు వారి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేసే బాధ్యత రేవంత్ రెడ్డి కి లేదా ఇది కచ్చితంగా కాంగ్రెస్ బిజెపి ఆడుతున్న నాటకం ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడిన బి ఆర్ఎస్ పార్టీ భయపడేది లేదని రాష్ట్ర సాధనలో అనేకసార్లు ప్రజా ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసులను భరించి జైల్లో మగ్గి రాష్ట్రాన్ని సాధించే దిశగా ఉద్యమించిన ఏకైక పార్టీ బి ఆర్ఎస్ పార్టీ . రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, నాయకులు గందే శ్రీనివాస్ గుప్తా, నాన బోయిన రాజారాం యాదవ్, మామిండ్ల చిన్న మోహన్ రెడ్డి, పాండవుల రాంబాబు, ఖ్యాతంశ్రీనివాస్, ఊరటి అమరేందర్ రెడ్డి, గుమ్మడి వేణు, మేడిపల్లి రాజు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రామరాజ్యం తలపించేలా వైఎస్ఆర్ పాలన..

రామరాజ్యం తలపించేలా వైఎస్ఆర్ పాలన

టిపిసిసి జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్

చర్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు

నేటి ధాత్రి చర్ల

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా చర్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి భద్రాచలం టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గా ప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు వైయస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా టిపిసిసి జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి భారత దేశంలోనే గుర్తింపు పొందుతూ రామరాజ్యం తలపించేలా దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన ప్రజలకు అందించారని అన్నారు ప్రజలకు చేరువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న మహోన్నత వ్యక్తి అన్నారు కాంగ్రెస్ పార్టీ చర్ల మండల యువ నాయకులు విజయ్ నాయుడు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకం విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టిన చిరస్మరణీయుడు అని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండెపుడి భాస్కరరావు మాట్లాడుతూ రైతులకు సాగునీటి కాలువలను పంట పొలాలకు అందించి సాగునీటిని అందించిన మహోన్నత వ్యక్తి అన్నారు మాజీ ఎంపీటీసీ చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు మడకం పద్మ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మహోన్నత నాయకుడు వైఎస్సార్ అని అన్నారు చర్ల ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ సాల్మన్ రాజు మాట్లాడుతూ ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళను ఇచ్చి పేద ప్రజలకు గూడును కల్పించిన మహనీయ దేవుడు అని అన్నారు
ఈ కార్యక్రమంలో చర్ల కాంగ్రెస్ నాయకులు గుండెపుడి భాస్కరరావు ఎస్సి సెల్ మండల ప్రెసిడెంట్ సల్మాన్ రాజ్ సీనియర్ కాంగ్రెస్ యువ నాయకులు విజయ్ నాయుడు సత్తిబాబు మాజీ ఎంపీటీసీ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు మడకం పద్మ అంజి బబు మేడి రమేష్ మైపా జోగారావు చింతయ్య మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

మాజీ కౌన్సిలర్ పరిష్కరించిన రహదారి సమస్య…

స్వoత ఖర్చుతో మట్టి వేయిoచిన మాజీ కౌన్సిలర్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలోని 15 వ వార్డులో మారెమ్మ కుంట దగ్గర రోడ్డు పై ప్రజలు వాహనాలు వెళ్ల డానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా స్వo త ఖర్చుతో 15 వ వార్డ్ మాజీకౌన్సిలర్ మట్టి వేయి oచారు ఈ సమస్య పై వార్డు ప్రజలు బండారు కృష్ణ దృష్టి కి తీసుకువెళ్లారు . 15 వ వార్డు ప్రజలు పి శ్రీనివాసులు ముంత మన్యం మున్నూర్ సురేందర్ బండారు భరత్ కుమార్ సంతోష్ తదితరులు రోడ్డు పై మట్టి వేయి oచి నందుకు బండారు కృష్ణ నకు మున్సిపల్ కమిషనర్ కు ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

మహాదేవపూర్‌లో ఓటర్ల తుది జాబితా….

నోటీస్ బోర్డులో ఓటర్ల తుది జాబితా

మహాదేవపూర్ సెప్టెంబర్ 2 (నేటి దాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామపంచాయతీ లో ఓటర్ల తుది జాబితాను మంగళవారం రోజున ప్రజల సందర్శనార్థం నోటీసు బోర్డులో ఉంచారు. గ్రామపంచాయతీ లో ఓటర్ల తుది జాబితాను గ్రామపంచాయతీ సిబ్బందితో సేకరించి మండల పంచాయతీ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సందర్శనార్థం నోటీస్ బోర్డ్ లో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కల్పన, గ్రామ ప్రజలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

బంగారు పతకాలతో మెరిసిన మొగుళ్లపల్లి విద్యార్థులు.

బంగారు పథకాలతో మెరిసిన మొగుళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు
– ప్రధానోపాధ్యాయులు  విజయ పాల్ రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పోలీసు శిక్షణ కళాశాల మామునూరు ఆవరణలో 4 వ తెలంగాణ  ఎయిర్ ఫోర్స్   వారి ఆధ్వర్యంలో నిర్వహించిన” కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంపు”-7 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగులపల్లి నుండి 12 మంది  ఎన్.సి .సి క్యాడేట్స్  పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలలో  వాలీబాల్,  టాగ్ ఆఫ్ వార్, ఆటలలో  గోల్డ్  మెడల్ సాధించగా,  మెరుగు సంజయ్ 100 మీటర్ల పరుగు లో మొదటి స్థానము పొంది గోల్డ్ మెడల్ సాధించారని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు , విజయ పాల్ రెడ్డి ఎన్సిసి అధికారి  జి. రాజయ్య లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని, మంచి ప్రవర్తన, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని, పాఠశాలకు  మీ ఊరికి  రాష్ట్రానికి , దేశానికి  మంచి పేరు తీసుకురావాలని  సూచించారు. అదేవిధంగా దేశానికి ముగ్గురే ముగ్గురు  ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేసేవారు, సైనికుడు, రైతు, క్రీడాకారుడు
కావున  మంచి చదువుతోపాటు  ఆటలలో రాణించి మంచి దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాధించిన ఎన్. సి.సి విద్యార్థులను  అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  శ్రీమతి భాగ్యశ్రీ,   ,  శ్రీమతి ఏ.వీ. ఎల్ . కళ్యాణి,  జి .అనిల్ కుమార్, బి. కుమారస్వామి కే .ప్రవీణ్, ఎం. రాజు,  శ్రీమతి పి. లలిత, జి. విజయ భాస్కర్, శ్రీమతి  వై. శ్రీకళ  విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో సిపిఐ జాతీయ నాయకుల ఘన సన్మానం..

జహీరాబాద్‌లో సిపిఐ జాతీయ నాయకుల ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణానికి విచ్చేసిన ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్, సిపిఐ జాతీయ కార్యదర్శి అజిజ్ పాషా గారిని సిపిఐ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జిల్లాలుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ, “దేశంలోని కార్మికులకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన చట్టాలను రద్దు చేయడం పూర్తిగా దారుణం” అని అభిప్రాయపడ్డారు. కార్మిక హక్కులను హరించే విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

సిపిఐ జాతీయ కార్యదర్శి అజిజ్ పాషా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కార్మిక, రైతు, చిన్న మధ్య తరగతి ప్రజలకు చేటు చేస్తాయని విమర్శించారు. “ప్రజా సమస్యలపై పోరాడటమే సిపిఐ లక్ష్యం” అని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొని జాతీయ నాయకుల అభిప్రాయాలను స్వాగతించారు.

వినాయక నిమజ్జనానికి భద్రతా సూచనలు – ఎస్సై రాజేష్..

నిమజ్జన సమయాల్లో జాగ్రత్తలు పాటించాలి..

ఎస్సై రాజేష్

నిజాంపేట: నేటి ధాత్రి

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో చెరువులు, కుంటలు అధికంగా నిండాయని నిమజ్జన సమయంలో మండప నిర్వహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంటు వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్నపిల్లలను చెరువులు కుంటల వద్దకు తీసుకువెళ్లొద్దన్నారు. శాంతియుత వాతావరణం లో పండగలు నిర్వహించుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో 100 కు డయల్ చేయాలన్నారు

పోత్కపల్లిలో గణపతి నవరాత్రి మహా అన్నదానం…

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో గోపికృష్ణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.సంఘం అధ్యక్షుడు డబ్బేట మల్లేశం మాట్లాడుతూ, గణపతి నవరాత్రులు గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీక. ఇలాంటి సమయాల్లో అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తి, సేవ, సౌహార్దం పెంపొందుతుంది. గ్రామంలో సామాజిక స్ఫూర్తిని పెంచడం గోపికృష్ణ పద్మశాలి సంఘం ప్రధాన ధ్యేయం అని పేర్కొన్నారు. మహా అన్నదానంలో గ్రామస్తులు, చిన్నలు పెద్దలు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.

ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటా…

ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటా…

పీరియ నాయక్ కుటుంబానికి ఆర్థిక చేయూత

నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ కళ్యాణ్

కేసముద్రం/ నేటి ధాత్రి

సబ్ స్టేషన్ తండ వాస్తవ్యులు బానోత్ పీరియా నాయక్ గ్రామ పంపు ఆపరేటర్ గా గత కొన్ని సంవత్సరాలు పని చేశారు కావున మాజీ సర్పంచ్ కి”శే”గుగులోతు వెంకన్న కుటుంబ సమక్షంలో మంగళవారం పెద్దకర్మ సందర్భముగా మానుకోట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ కళ్యాణ్ నాయక్ పీరియ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మానవత్వంతో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి నగదుగా 6000 /- రూపాయలు అందజేయడం జరిగింది బానోత్ పిరియా నాయక్ భార్య బానోత్ బిచ్చాలి మరియు తన కుమారుడు బానోతు సురేందర్ కూతురు సంగీత కు ఎల్లప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటానని ప్రభుత్వం ద్వారా లబ్ది చేకూర్చే పథకాలు ఏమైనా ఉంటే నా వంతు సహాయంగా తప్పకుండా మీ కుటుంబానికి అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
గుగులోత్ శివుడు
గూగులోత్ సుక్యనాయక్
గుగులోతు నరేష్ (బోయ)
గుగులోతు విజయ్ నాయక్
గ్రామ పెద్దలు మరియు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

సిరిసిల్లలో గణేష్ నిమజ్జనకు జిల్లా ఎస్పీ సూచనలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T144040.353.wav?_=1

 

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని

శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.ఐపిఎస్

 

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి నిబంధనలు పాటించాలని,నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.ఈరోజు పట్టణ పరిధిలోని పలు గణేష్ మండపాలను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.

SP Mahesh B.Gite.IPS

జిల్లాలో ప్రశాంతవంతమైన వాతవరణంలో గణపతి నవరాత్రులు కోనసాగుతున్నాయని.జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2100 వినాయక మండపాలు కొలువుదీరినవని,అట్టి మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ వారిచే సూచించబడిన సూచనలు తప్పక పాటించాలన్నారు.వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవలన్నారు.నిమజ్జనం రోజున.ఎట్టి పరిస్థితుల్లో డి.జే లకు అనుమతి లేదని నిబంధనలకు విరుద్ధంగా డి.జే లు ఏర్పాటు చేసిన డి.జే యజమానులతో పాటుగా మండపాల నిర్వహకులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.మండపాల నిర్వహకులు నిర్దేశించిన సమయనికి నిర్జనం పూర్తి అయ్యేలా ప్రణాళిక చేసుకోవాలని, పోలీస్ వారి సలహాలు సూచనలు తప్పక పాటిస్తూ ఏలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.ఎలాంటి సమస్యలు తలెత్తిన, అవాంచనీయ సంఘటనలు జరిగిన వెంటనే పోలీస్ వారికి సమాచారం అందింవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో,డి.ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ సిబ్బంది ఉన్నారు.

 

నిజాంపేటలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T143516.488.wav?_=2

నిజాంపేటలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి

నిజాంపేట, నేటి ధాత్రి

మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో వై.యస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గొప్ప రాజకీయవేత్త వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొమ్మట బాబు, వై వెంకటేశం, మారుతి, రవి, అబ్దుల్ ,కృష్ణ తదితరులు ఉన్నారు.

నర్సంపేటలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T143118.908.wav?_=3

రామరాజ్యం తలపించేలా వైఎస్ఆర్ పాలన

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే గుర్తింపు పొందుతూ రామరాజ్యం తలపించేలా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సభ్యులు పెండెం రామానంద్ తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి
వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా
నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పెండెం రామానంద్ గారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు,అవసరాలను తెలుసుకున్న నేత అని పేర్కొన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని తెలిపారు. పేద ప్రజలు,విద్యార్థుల కోసం ఆరోగ్య శ్రీ పథకం,ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి చిరస్మరణీయుడయ్యారని కొనియాడారు.వైఎస్ఆర్ పాలన సంక్షేమమే ప్రధాన ఎజెండా గా కార్యకర్తలే సైనికులుగా కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా పని చేసిన గొప్ప నాయకుడు అని రామానంద్ గుర్తుకు చేశారు. దివంగత డాక్టర్ వైయస్సార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలే నేటికీ కొనసాగుతున్నాయని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ,మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, ర్మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ సొసైటీ వైస్ చైర్మన్ పాలాయి రవి,నర్సంపేట మండలం అధ్యక్షులు కత్తి కిరణ్, నర్సంపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, పంబి వంశీకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ డక్క శ్రీను,నర్సంపేట పట్టణ కార్యదర్శి చిప్ప నాగ,నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, గజ్జి రాజు, లక్కాసు రమేష్, నాగేల్లి సారంగం, పొన్నం నరసింహారెడ్డి, కొప్పు అశోక్, బాణాల శ్రీను, మెరుగు కిరణ్, మహిళ నాయకురాలు హసీనా, గాజుల రమేష్, గండు గిరి, బిట్ల మనోహర్, పాతార బోయిన చంద్ర మొగిలి, మేడం కుమార్, ఎండి సర్వర్, దేశీ సాయి పటేల్, కాంగ్రెస్,మహిళా,యూత్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రంలో మృతుల కుటుంబానికి బియ్యం అందజేత..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T142652.925-1.wav?_=4

బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత

టి పి సి సి, ఓ బి సి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజ్ చైతన్య నగర్ కాలనీలో ఇటీవల అకాల మరణం చెందిన వల్లందాస్ కొమురయ్య కు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి టిపిసిసి ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ ఒక క్వింటా బియ్యం బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూతగా అందివ్వగా కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్ మండల ఎస్టీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ చైతన్య నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెండ్యాల లక్ష్మణ్ మాజీ వార్డ్ మెంబర్ మేకల లచ్చమ్మ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సుభాష్ రెడ్డి బోళ్ల కటయ్య ఉల్లి వెంకటేశ్వర్లు లావుడియా వెంకన్న అజ్మీర రాజు శ్రీరాముల సమ్మయ్య తదితరులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి కొమురయ్య చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది.

చల్లా ధర్మారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T142141.562-1.wav?_=5

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా..చల్లా ధర్మారెడ్డి

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వరికోలు, నార్లపూర్,చర్లపల్లి గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన గుండెకారి జమున,దొగ్గెల శ్రావణ్ కుమార్(లెనిన్),దొగ్గెల కొమురయ్య,ఓరుగంటి లచ్చమ్మ,బయ్య తిరుపతి, చెక్క శంకరయ్య,చెక్క రాజమ్మ,దైనంపల్లి మల్లయ్య,ఈర్ల పెద్దులు, చేపూరి కొమురయ్య,కొత్తపల్లి కరుణ,నందికొండ కౌసల్య కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణగౌడ్ జాతీయ అవార్డు పొందారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T141659.465-1.wav?_=6

జాతీయ అవార్డుకు అందుకున్న రామకృష్ణగౌడ్

అభినందించిన మండల ప్రజలు

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల
మండలంలోని బూర్నపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ళ రామకృష్ణగౌడ్ రాష్ట్రీయ సేవ పురష్కర్ జాతీయ ఆవార్డు 2025 ను హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ ఫౌండర్, చైర్మన్ ఆకుల రమేష్ రామకృష్ణగౌడ్ తండ్రి నేరేళ్ల చేరాలు గౌడ్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు
గత కొన్ని సంవత్సరాలుగా అన్ని కులాలను ఏకం చేయడంతో పాటు, ఆయన చేసిన వివిద సామాజిక కార్యక్రమాలను గుర్తించడంతో పాటు, నాడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గ పాల్గోని రాష్ట్ర సాదనలో తనదైన ప్రతిభ కనపర్చడం, నేడు బీఆర్ఎస్ కార్మిక శాఖ తరుపు కార్మికులను ఏకతాటిపైకి తేవడంతో పాటు వారిని చైతన్యం పరచడంతో పాటు, వారి హక్కుల కోసం పోరాడం చేయడాన్నీ గుర్తించి ఉత్తమ జాతీయ ఆవార్డును అందజేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. తెలిపారు. మారుమూల గ్రామమైన బూర్నపల్లి గ్రామం నుండి జాతీయ స్థాయి ఆవార్డును అందుకోవడం పట్ల మండల ప్రజలు రామకృష్ణగౌడ్ కి శుభకాంక్షలు తెలిపి అభినందిస్తున్నారు.

డివిజనల్ పంచాయతీ కార్యాలయం కోరుకున్న ప్రజలు….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T140359.846-1.wav?_=7

జహీరాబాద్ లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలనీ ప్రజావాణి పిర్యాదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రజా పాలన ప్రభుత్వం అని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని పలుమార్లు ముఖ్యమంత్రి పదే పదే ప్రసంగాలు చేసి చేప్పు తున్నప్పటికి అవేవి పట్టనట్టు కొందరు అధికారులు వేవహరిస్తున్న తీరును విసుకుచ్చేంది. సోమవారం ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణిలో జహీరాబాద్ లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలని జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు ప్రజావాణి లో పిర్యాదు చేయడం జరిగింది.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చోరువ తీసుకొని డివిజన్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అదుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి పెషిలో మరియు పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం లో పిర్యాదు చేస్తామని పిర్యాదుదారులు తెల్పడం జరిగింది. ముఖ్యమంత్రి మాటలు అగౌరవపరచకుండా అధికారులు చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

భారీ వర్షాల తర్వాత రైతులకు నష్టపరిహారం మాణిక్ రావు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T135416.170-1.wav?_=8

కరువు మండలంగా ప్రకటించాలి’

◆:- టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నుల్క మానిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలో వివిధ

 గ్రామాలలో గత కొన్ని రోజుల నుండి భారి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెసర మినుము, పత్తి, సోయా, మొక్కజొన్న చాలావరకు నీట మునిగాయి. వర్షాల ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీర్ఘకాల సగటులో 109% వర్షపాతం నమోదయింది. ఆగస్టులోనే రికార్డు స్థాయిలో వానలు కురిశాయి.

TRS party senior leader Nulka Manik Rao

సాధారణం కంటే 75% వర్షపాతం నమోదయింది .కావున తెలంగాణ ప్రభుత్వం మండలంలోని ప్రతి గ్రామాన్ని ఏ.ఈ.ఓ, ద్వారా సర్వే చేయించి అన్ని పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, మాణిక్ రావు డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version