తెలంగాణకు వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు.
#ఘోష్ కమిషన్ నివేదిక కాంగ్రెస్ పార్టీ స్క్రిప్టు.
#కాంగ్రెస్ పార్టీ తాటాక చప్పులకు భయపడేది లేదు.
#మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మండల లోని నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి365 పై మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి నది జలాలను ఆంధ్రకు తరలించే కుట్రలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నది జలాలను ఆంద్రాకు తన రాజకీయ గురువుకు గురుదక్షిణగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించే తీరు ప్రజలందరికీ అర్థమవుతుందని ఎద్దేవ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకనే సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసి వేయడమేనని అర్థమవుతుంది. నిన్నటి వరకు సిబిఐ పై అనేక ఆరోపణలు చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా మాట ఎందుకు మార్చాడో ప్రజలకు వివరించాలన్నారు. దీని వెనకాల ఉన్న శక్తులు వారి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేసే బాధ్యత రేవంత్ రెడ్డి కి లేదా ఇది కచ్చితంగా కాంగ్రెస్ బిజెపి ఆడుతున్న నాటకం ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడిన బి ఆర్ఎస్ పార్టీ భయపడేది లేదని రాష్ట్ర సాధనలో అనేకసార్లు ప్రజా ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసులను భరించి జైల్లో మగ్గి రాష్ట్రాన్ని సాధించే దిశగా ఉద్యమించిన ఏకైక పార్టీ బి ఆర్ఎస్ పార్టీ . రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, నాయకులు గందే శ్రీనివాస్ గుప్తా, నాన బోయిన రాజారాం యాదవ్, మామిండ్ల చిన్న మోహన్ రెడ్డి, పాండవుల రాంబాబు, ఖ్యాతంశ్రీనివాస్, ఊరటి అమరేందర్ రెడ్డి, గుమ్మడి వేణు, మేడిపల్లి రాజు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.