గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో గోపికృష్ణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.సంఘం అధ్యక్షుడు డబ్బేట మల్లేశం మాట్లాడుతూ, గణపతి నవరాత్రులు గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీక. ఇలాంటి సమయాల్లో అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తి, సేవ, సౌహార్దం పెంపొందుతుంది. గ్రామంలో సామాజిక స్ఫూర్తిని పెంచడం గోపికృష్ణ పద్మశాలి సంఘం ప్రధాన ధ్యేయం అని పేర్కొన్నారు. మహా అన్నదానంలో గ్రామస్తులు, చిన్నలు పెద్దలు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.