జహీరాబాద్లో సిపిఐ జాతీయ నాయకుల ఘన సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణానికి విచ్చేసిన ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్, సిపిఐ జాతీయ కార్యదర్శి అజిజ్ పాషా గారిని సిపిఐ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జిల్లాలుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ, “దేశంలోని కార్మికులకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన చట్టాలను రద్దు చేయడం పూర్తిగా దారుణం” అని అభిప్రాయపడ్డారు. కార్మిక హక్కులను హరించే విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి అజిజ్ పాషా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కార్మిక, రైతు, చిన్న మధ్య తరగతి ప్రజలకు చేటు చేస్తాయని విమర్శించారు. “ప్రజా సమస్యలపై పోరాడటమే సిపిఐ లక్ష్యం” అని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొని జాతీయ నాయకుల అభిప్రాయాలను స్వాగతించారు.