మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download.wav?_=1

 

మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణం 23 వ వార్డుకు చెందిన వరంగంటి బుచ్చమ్మ మరణించగా ఆమె మృతదేహంపై టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవండ్ల రాంబాబు, 23వ వార్డు అధ్యక్షుడు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు అధ్యక్షుడు కోల చరణ్ గౌడ్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేల్లి సారంగం గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొలువుల వెంకటేశ్వర్లు, దూడేల సాంబయ్య, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కుమార్, గద్ద వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలకు ఎదురు చూపులు.. ఎన్నికల వరుసలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download.wav?_=2

ఎన్నికలకు ఎదురు చూపులు.. ఎన్నికల వరుసలు…

◆:- ఆశ్చర్యపోతున్న ఓటర్లు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కనిపిస్తోంది కాక బాగున్నారా.. మావ ఎక్కడ పోతున్నవు, ఓ అక్క ని బిడ్డ మంచిగా ఉన్నాదా… మంచిగా చదువుతుందా…. బాపు యూరియ దొరికిందా చల్లినవా పొలంలో… తాత పాణం బాగుందా.. ఇలా రక రకాల పలకరింపులు తో పల్లెల్లో పులకరిస్తున్నాయి. ఈ యెడు అంత మాట్లాడని వారు, వరుస లు కలుపుతూ పలకరిస్తుండడంతో ప్రజలు ఉబ్బి తబ్బి పోతున్నారు.. కొందరు ఇదేంరా బాబు ఎన్నడూ లేని వీడు వరుసలు కలవుతున్నాడని లోలోపల గోనుగుతున్నారు.. ఓటర్లకు దగ్గర అయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు వరుసలు కలుపుకొని జనాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాగా కొందరు మీరు జిమ్ముక్కులు మాకు తెలుసులే అని అంటున్నారు కొందరు పార్టీతో పనిలేకుండా ఓటర్లను వలకరిస్తూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.

Local Election Buzz

కూడగట్టుకుంటున్న మద్దతు

సర్పంచు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన ఆశావహులు ఇప్పటి సుంచే గ్రామాల్లో
కలియదిరుగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారంతా యువత, ఆయా కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. మరి కొంత మంది విందులు ఏర్పాటు చేస్తూ పలుకుబడి ఉన్న వ్యక్తులను తమవైపు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు

నేతల చుట్టూ చెక్కర్లు.

సర్పంచ్ బరిలో నిలిచేవారి పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో గ్రామాల్లో రోజుకొకరు పోటీ పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తద్వారా ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా టికెట్ల కేటాయింపు ఉండడంతో నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ అధ్యక్షులతో నిరంతరం టచ్లో ఉంటూ వారి ఆశీస్సులు పొందడానికి పాకులాడుతున్నారు.

Local Election Buzz

ఓటరు జాబితా ప్రచురణ

ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీచేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పటు చేశారు.. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరించి ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేశారు. దీనికి తోడు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పల్లెలో పంచాయతీ సందడి కనిపిస్తుంది.

మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన లైన్స్ క్లబ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T124355.369.wav?_=3

 

మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన లైన్స్ క్లబ్..

రామాయంపేట, సెప్టెంబర్ 4 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు విశేష సన్మానం లభించింది. గురువారం ఉదయం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందికి ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్‌ను అందజేశారు.
లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి, జిల్లా అధ్యక్షుడు పోదేండ్ల లక్ష్మణ్ యాదవ్, సభ్యులు వంగరి కైలాస్, దోమకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ దేవేందర్ మాట్లాడుతూ – “పట్టణం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి పారిశుధ్య కార్మికుల కృషి అత్యంత కీలకం. ఇలాంటి సేవా కార్యక్రమాలు వారికి ప్రోత్సాహం కలిగిస్తాయని తెలిపారు.
కార్మికులు తమ భావాలను వ్యక్తం చేస్తూ, శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – “మేము ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తాం.
ఇలాంటి గుర్తింపు మా కష్టానికి నిజమైన గౌరవం” అన్నారు.

పోచమ్మ శంకర్ మాట్లాడుతూ “ఇంతవరకు ఎవరు మాపై ఇంత శ్రద్ధ చూపలేదు. లైన్స్ క్లబ్ చేసిన సత్కారం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది”.

లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి మాట్లాడుతూ – “సమాజానికి మూలస్తంభాలుగా నిలుస్తున్న పారిశుధ్య కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పోదేండ్ల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ – “ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తాం” అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి. లక్ష్మణ్ యాదవ్. వంగరి కైలాస్. దోమకొండ శ్రీనివాస్. శ్రీధర్ రెడ్డి. చల్ మెడ ప్రసాద్ పోచమ్మ శంకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుల అసమర్థత గురించి ఘాటుగా విమర్శించిన…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T122807.244.wav?_=4

కాంగ్రెస్ నాయకుల అసమర్థత గురించి ఘాటుగా విమర్శించిన

◆: – బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నాయకులు ఎంత అసమర్థులో మనందరికీ తెలిసిన విషయమే. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదు, 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకులు గానీ వారి అనుచరులు గాని చాలా ఆకలి మీద ఉన్నారు, ఇప్పుడు అధికారంలో వచ్చాము కదా అని అహంకారపూరిత ధోరణితో ప్రవర్తిస్తూ ఆసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న నా స్టేట్మెంట్లో చెప్పిన విధంగా కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉండే అనుచరులు బిర్యాని ప్యాకెట్ల కోసమో బీరు కోసమో వాళ్ళ నాయకుల మీద ఉన్న ప్రేమని ఇతర మహిళల పైన నీచంగా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ విషయాలని కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకువెళ్తే వాళ్లు 70 MM సినిమా చూస్తూ ఉంటారు తప్పితే వాళ్లు వాళ్ళ అనుచరులకి ఒక మాట కూడా ఏమనరు. పైగా వాళ్లకి చెప్పుకోవాల్సింది పోయి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కాపాడుతూ వస్తున్నారు మన జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అసమర్థత కాంగ్రెస్ నాయకులు. విషయం ఏమిటంటే ఈరోజు 9వ రోజు నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా సార్వజనిక్ ఉత్సవ కమిటీ వాళ్ళు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులని పిలిచి వారిని సన్మానించడం జరుగుతుంది. కానీ సార్వజనిక్ కమిటీలో ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ నాయకులు వారి అనుచరులు కావున మహిళలందరూ కూడా సాయంత్రం ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణిలో ఉన్నారు ప్రస్తుతం, వాళ్లు మీ చీరలైనా లాగవచ్చు, మీ పైన చేతులైన వేయొచ్చు, మీ పైన నీచంగానైనా మాట్లాడవచ్చు, మీ గురించి ఇతరుల ముందు నీచంగా మాట్లాడవచ్చు, మీ ముందే నీచంగా మాట్లాడొచ్చు ఏదైనా జరగొచ్చు. కావున మహిళలందరూ కూడా జాగ్రత్త వహించాలి ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో మన రాష్ట్రంలో అమ్మాయిల పైన జరుగుతున్న అరాచకాలని చూస్తూ ఉన్నాం చూస్తూ వస్తున్నాం కూడా. చేతులు కాలిన తర్వాత ఆకులని పట్టుకుంటే లాభం లేదు ఎందుకంటే మన జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అంత అసమర్థులు కాబట్టి. పైన చెప్తున్న విషయాలకి ప్రత్యక్ష సాక్షిని నేనే కాబట్టి వాస్తవాలను మాట్లాడుతున్నాను, కావున మహిళలు కూడా ఈ విషయాన్ని గమనించాలి జాగ్రత్త వహించాలి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మహిళలకు భద్రత ఉండదని చాలా చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నష్టం జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు కాబట్టి, కావున మహిళలు ఇప్పటికైనా మేల్కొని కాంగ్రెస్ నాయకులు గానీ వారి అనుచరులతో గాని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈరోజు సార్వజనిక్ ఉత్సవ కమిటీ వాలు కూడా మహిళల భద్రత కోసం షీ టీం మరియు మహిళా కానిస్టేబుల్స్ ని అక్కడ పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మన జహీరాబాద్ టౌన్ పోలీస్ శాఖ వారిని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏ ఒక్క మహిళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా మేము అసలు ఊరుకునే పరిస్థితి ఉండదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.

స్వాతి @ బ్యూటీషియన్ – మహానంది అవార్డు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T121923.688.wav?_=5

 

స్వాతి @ బ్యూటీషియన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం, మండల కేంద్రమైన ఝరాసంగం గ్రామానికి చెందిన గడ్డం స్వాత్తి కి బుధవారం ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యూటిషియన్ లో మహానంది అవార్డును అందజేశారు. బ్యూటి షియన్ లో యువతి కనబర్చిన ప్రతిభన గుర్తించి ఆ సంస్థ యాజమాన్యం ఈ అవార్డును అందజేయడం జరిగింది. రెండు సంవత్సరాలు గా సంగారెడ్డి పట్ట ణంలోని ఓ బ్యూటీ పార్లర్ లో శిక్షణ తీసుకోవడం జరిగింది. ఈ అవార్డును అందుకోవడం పట్ల గ్రామస్తులు బంధువులు, హర్షం వ్యక్తం చేశారు.

ఎండు గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T114518.395-1.wav?_=6

 

ఎండు గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ జహీరాబాద్ మండల్ అల్గోల్ గ్రామ పరిధిలోని అల్లాన కంపెనీ వద్ద బుధవారం వాహనాలు తనిఖీలు చేశారు. ఈ తనిఖీ ల్లో స్కూటీ పై ఇద్దరు వ్యక్తులు అక్రమంగా గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. పట్టుకున్న వారిలో సత్వార్ కు చెందిన మహమ్మద్ ఖయ్యూం, ఫకీర్ అయూబ్ లున్నారు. వారి వద్ద నుండి 140 గ్రాముల ఎండు గంజాయిని, డియో స్కూటీ ని 2 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనపరచుకుని కేసు నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం నిందితులను జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు.

ఎస్పీ సుడిగాలి పర్యటన… నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T113944.004-1.wav?_=7

 

ఎస్పీ సుడిగాలి పర్యటన… నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకాజ్
బుధవారం జహీరాబాద్ లో సుడిగాలి పర్యటన చేశారు. పరిటనలో భాగంగా ఆకస్మికంగా పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్ ఆవరణలో ఫిర్యాదులతో వచ్చిన పలువురుని పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వినాయక నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఊరేగింపు పొడవునా రహదారి, లైటింగ్ ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.అదేవిధంగా నారింజ ప్రాజెక్టు వద్ద నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అవసరమగు సూచనలు చేశారు.అదేవిధంగా పట్టణంలో ప్రతిష్టించిన వినాయకులను డీఎస్పీ సైదా, సీఐ శివలింగం, ఎస్ఐ. కే.వినయ్ కుమార్, కాశీనాథ్ లతో కలిసి సందర్శించారు.

ఎస్పీ ఆకస్మిక తనిఖీ..పెండింగ్ కేసులు, రికార్డుల పరిశీలన

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T113256.371.wav?_=8

 

ఎస్పీ ఆకస్మిక తనిఖీ..పెండింగ్ కేసులు, రికార్డుల పరిశీలన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ ను
ఎస్పీ. పరితోష్ పంకజ్ ఐపిఎస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డుల తనిఖీ చేశారు. లాంగ్ పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, లాంగ్ పెండింగ్ కేసులు, ఎన్.బి.డబ్ల్యూ చేదనకు సబ్-డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డీఎస్పీ కి సూచించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ అన్నీ వర్టికల్ విభాగాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని వారిసమస్యను ఓపికగా విని సత్వర న్యాయానికి కృషి చేయాలని ఎస్.హెచ్.ఓ లకు సూచించారు.

కట్టుదిట్టమైన బందోబస్తు

గణేష్ నిమర్జనాలను పురస్కరించుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. వినాయక శోభాయాత్ర సందర్భంగా వివిధ మతాలకు చెందిన పవిత్ర స్థలాలు, గుడులపై రంగులు పడకుండా ఎత్తైన బారికెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడి నుంచి వినాయక నిమర్జనాలు జరగనున్న నారింజ బ్రిడ్జ్ ను సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. నిమర్జన సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా క్రేన్ లను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని డీఎస్పీకి సూచించారు.

సంఘవిద్రోహ శక్తుల నుండి కాపాడాలి

జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు మందిరంలో ఏర్పాటు చేసిన వినాయక పూజకు ఎస్పీ హాజరై, గణనాధునికి ప్రత్యేక పూజలు చేసారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అల్లర్లు సృష్టించే సంఘవిద్రోహ శక్తులనుండి కాపాడాలని, జిల్లా ప్రజలను సుఖ:సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా ఆశీర్వాదహించాలని గణనాధునికి వేడుకున్నారు. ఈ సందర్శనలో ఎస్పీతో డీఎస్పీ సైదా నాయక్, టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్, రూరల్ ఎస్ఐ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.

విఘ్నాలను తొలగించి సర్వ శుభాలను ప్రసాదించే దేవుడు వినాయకుడు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T112610.028.wav?_=9

 

విఘ్నాలను తొలగించి సర్వ శుభాలను ప్రసాదించే దేవుడు వినాయకుడు

◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణం లోని రామ్ నాగర్ , హౌసింగ్ బోర్డు, వెంకటరమణ కాలనీ,విద్యుత్ కాలనీ, ఆదర్శ నగర్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపలలో గణనాథుని దర్శించుకున్న ఎమ్మెల్యే
సర్వ విఘ్నాలను తొలగించి సకల శుభాలను కలిగించే దేవుడు, భాద్రపద శుద్ధ చవితి నుండి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుని గంగమ్మ ఒడికి చేరే ఆ గణనాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు అన్నారు. వారితో పాటుగా మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T111859.014.wav?_=10

 

జహీరాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని స్రవంతి జూనియర్ కాలేజీలో పట్టణ సీఐ శివలింగం ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది సైబర్ నేరాల గురించి, ఆన్లైన్ మోసాల గురించి, తాగి వాహనాలు నడిపితే తీసుకునే చర్యల గురించి, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే నష్టాల గురించి, షీ టీమ్స్ గురించి, OTPల వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించారు.

విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T111156.704.wav?_=11

 

విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ వినాయక చవితి పండుగ సందర్భంగా బుధవారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించి వినాయకుడి పూజలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారితో కలిసి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఆ ఘననాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సంధర్బంగా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సకల విజ్ఞాలు తొలిగి సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.అనంతరం వారిని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించారు.
ఈకార్యక్రమంలో వారితో పాటు జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి మాజీ కౌన్సిలర్లు అక్తర్ గోరి రంగా అరుణ్ కుమార్ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి నల్లా ప్రతాప్ రెడ్డి నథానెయల్ నర్సింహా యాదవ్ మాజీ జెడ్పీటీసీ నరేష్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లూ జిల్లా ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,ఎస్టీ సెల్ పార్లమెంట్ కోఆర్డినేటర్ రాజు నాయక్,ఇమామ్ పటేల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు వివిధ గణేష్ మండపాల ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బేగరి సాయికుమార్ (పండు) కనబడుటలేదు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T105533.562.wav?_=12

 

బేగరి సాయికుమార్ (పండు) కనబడుటలేదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం మాచునూర్ గ్రామానికి చెందిన బాలుడు బేగరి సాయికుమార్ (పండు)
తండ్రి.సంగమేష్. వయస్సు:16 సంవత్సరాలు గ్రామం:మాచనూర్, ఝరాసంగం
మోడల్ స్కూల్ లో, ఇంటర్ 1st ఇయర్ ( సిఈసి ) చదువుచున్నాడు. ఈ రోజు ఉదయం:9గంటలకు కాలేజీకి అని చెప్పి ఇంటినుండి వెళ్లడం జరిగింది, ఇంత వరకు ఇంకా ఇంటికి రాలేదు. ఎవరకైనా ఆచూకీ తెలిస్తే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదా ఈ క్రింది నెంబర్ కు ఫోన్ చేయండి.9666264020

సతీష్ యాదవ్ కు సిటిజన్ ఫోరం సన్మానం..

డాక్టరేట్ సతీష్ యాదవ్ కు హైదరాబాదులో సిటిజన్ ఫోరం, సన్మానం
వనపర్తి నేటిదాత్రి .

హైదరాబాద్ లో మహబూబ్నగర్ జిల్లా మాజీ రిజిస్టర్ నర్సిరెడ్డి, బుద్ధారం మారం మహేందర్ ఆధ్వర్యంల డాక్టరేట్ పొందిన అఖిలపక్ష అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ను సన్మానం చేశారు
ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ జిల్లా రిజిస్టర్ నర్సిరెడ్డి విశ్వనాథం, నాగభూషణం, మారం మహేందర్, శ్రీనివాసరావు, మురళి శర్మ, సుధాకర్, పద్మా విశ్వనాథం, విజయ్ దంపతులు, నాగరాజు, లక్ష్మణ్, కమ్యూనిటీ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మద్యం టెండర్లలో గౌడులకు 25% వాటా కావాలి..

మద్యంటెండర్లో గౌడులకు 25 శాతం వాటా ఇవ్వాలి

మోకుదెబ్బ రమేష్ గౌడ్ డిమాండ్..

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మద్యం టెండర్లలో గౌడ కులస్తులకు 25 శాతం వాటా ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ డిమాండ్ చేశారు.పట్టణంలో బుదవారం మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం గౌడ కులస్తులకు మద్యం దుఖాణాలలో 15 శాతం మాత్రమే కెటాయించడం జరిగిందన్నారు. కామారెడ్డిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోలో గౌడ కులస్తులకు మద్యం దుఃఖణాల కేటాయింపులో 25 శాతం ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ లో గౌడ్స్ కు ఇచ్చిన హామీని ప్రకారంగా 25 శాతం వాటా డిక్లరేషన్ విస్మరించడం సరికాదన్నారు.మధ్యం టెండర్లలో 3 లక్షలు కాకుండా 2 లక్షలకు కుదించాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్లుగా తాటిచెట్ల పైనుంచి పడి చనిపోయిన, గాయపడిన 7 వందల మంది గీత కార్మికులకు పెండింగ్ లో 7 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని తెలిపారు. జనగామ జిల్లా కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని, 50 యేండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ఫెక్షన్ మంజూరు చేయాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

మోకుదెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి గా శ్యామ్ సుందర్ గౌడ్

దుగ్గొండి మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్యామ్ సుందర్ గౌడ్ ను మోకుదెబ్బ హన్మకొండ జిల్లా ప్రచార కార్యదర్శిగా నియమించినట్లు మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. గత రెండేళ్లుగా శ్యామ్ కుమార్ గౌడ్ గౌడ కులస్తులకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ పదవిలో నియమించినట్లు రమేష్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్, గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి బోడిగే మల్లేశంగౌడ్,మేరుగు మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షాల్లో రామాయంపేట పోలీసులు ప్రజలను రక్షించారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T163411.207.wav?_=13

సలాం పోలీస్‌..

అకాల వర్షాల్లో ప్రజలకు అండగా రామాయంపేట పోలీసులు..

పోలీసులపై నేటి ధాత్రి ప్రత్యేక కథనం..

రామాయంపేట సెప్టెంబర్ 3 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట పట్టణంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు నగర జీవనాన్ని అతలాకుతలం చేశాయి. కాలువలు పొంగిపొర్లడంతో తక్కువ ఎత్తున్న కాలనీలు మునిగిపోయి వందలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలను కాపాడిన వారు పోలీసులు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్, ఎస్‌.ఐ బాలరాజు తమ సిబ్బందిని ముందుండి నడిపిస్తూ పగలు–రాత్రి తేడా లేకుండా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

రిస్క్ తీసుకుని ప్రాణరక్షణ

నీటి మునిగిన వీధుల్లోకి ప్రవేశించి వృద్ధులను, మహిళలను, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాలలో చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసుకొచ్చి తల్లిదండ్రుల ఆందోళన తొలగించారు. వర్షాల మధ్య ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా పోలీసులు సేవలందించడం ప్రజల హృదయాలను తాకింది.

ప్రజల కృతజ్ఞత..

“పోలీసులు లేకపోతే మా కుటుంబం బతికేది కాదు. మమ్మల్ని ప్రాణాలకు భయపడకుండా రక్షించారు. ఈ ఋణం మాకు ఎప్పటికీ మరవలేనిది” అని బస్తీ వాసులు కన్నీటి కళ్ళతో చెప్పారు.

“మా పిల్లలు స్కూల్లో చిక్కుకుపోయారు.

వెంటనే పోలీసులు వచ్చి వారిని రక్షించారు. మా కోసం వారు ప్రాణరక్షకులుగా నిలిచారు” అని స్థానిక పిల్లల తల్లులు భావోద్వేగంతో అన్నారు.

అధికారుల ప్రశంసలు

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – “ప్రజల ప్రాణాలను కాపాడడంలో రామాయంపేట పోలీసులు చూపిన ధైర్యం నిజంగా ప్రశంసనీయమైంది. ఇతరులకు ఆదర్శం.” అని అభినందించారు.

హనుమంతరావు మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ దంతపల్లి.

“ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు చూపిన స్పందన సమాజానికి స్ఫూర్తిదాయకం. వారు కేవలం చట్టం అమలులోనే కాకుండా, ప్రాణరక్షకులుగా నిలుస్తున్నారు.” అని అన్నారు.

 

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. మల్లన్న గారి నాగులు ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ. తోని గండ్ల.

అకాల వర్షాల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు అండగా నిలిచిన రామాయంపేట పోలీసులు చూపిన త్యాగం, సేవలు ఎన్నటికీ మరువలేనివి. వారి కృషి రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల పాత్రకు ఒక నిదర్శనంగా నిలిచింది.

నారింజ ప్రాజెక్ట్‌ను అదనపు కలెక్టర్ సందర్శించారు….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T153927.000.wav?_=14

నారింజ ప్రాజెక్ట్ ను అదనపు కలెక్టర్ సందర్శించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ బి గ్రామ శివారులో గల నారింజ ప్రాజెక్ట్ ను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించారు. వినాయక నిమజ్జనం కోసం చేసిన అన్ని ఏర్పాట్ల వివరాలను పురపాలక సంఘం కమిషనర్ డి. సుబాష్ రావు దేశ్ముఖ్ అదనపు కలెక్టర్ కు వివరించారు. ఇలాంటి అంచనా జరగకుండా చూడాలని అధికారులను సూచించారు,

సీనియర్ జర్నలిస్టులకు ప్రత్యేక పింఛన్ డిమాండ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T153453.002.wav?_=15

ఇతర రాష్ట్రాల మాదిరిగా జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి

ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన సీనియర్ జర్నలిస్ట్ రాజమల్లు యాదవ్

కేసముద్రం/ నేటి ధాత్రి

సీనియర్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా పించను ఇప్పించి జర్నలిస్ట్ ల జీవితానికి భరోసా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి, శాసనసభ్యులు భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయకుల సమక్షంలో వేం నరేందర్ రెడ్డి కి జర్నలిస్టుల సమస్యల ను వివరిస్తూ కేసముద్రం సీనియర్ జర్నలిస్ట్ వేల్పుల రాజమల్లు యాదవ్ వినతి పత్రం అందజేయడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా నిర్ణయించి ప్రకటించారని పేర్కొన్నారు.జర్నలిస్ట్ మరణిస్తే వారి భాగస్వామి కి నెలకు రూ10 పింఛను ఇవ్వాలని ఆ ముఖ్యమంత్రి నిర్ణయించారని.తమిళనాడు కూడ సీనియర్ జర్నలిస్ట్ లకు పింఛన్లు అందిస్తుందని.పక్కనున్న ఏపీ లో కూడా అంతో,ఇంతో అందిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్ లకు ఆలాంటి పథకం అమలులో లేవని.తెలంగాణలో కూడ సీనియర్ జర్నలిస్ట్ లకు జర్నలిజం లో 20 ఏళ్ళు గా పనిచేస్తూ 57 ఏళ్ళు దాటిన ప్రతి జర్నలిస్ట్ కు రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రమాదంలో
మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారని.ఐతే
జర్నలిస్టులు సహజంగా మరణించిన వారి కుటుంబాలకు కూడా వర్తించే విధంగా అమలు చేసి
రూ.10 లక్షల కు పెంచాలని.,మరణించిన జర్నలిస్ట్ జీవిత భాగస్వామి కి జీవితాంతం వరకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల నుంచి రూ 10వేలు ఇప్పించాలని.
అలాగే ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కు ప్రభుత్వం తరఫున
ప్రతి నెల జీవన భృతి కింద రూ. 5 వేలు మంజూరు చేసి వారి జీవితానికి భరోసా కల్పించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
ఇళ్లు లేక జర్నలిస్ట్ లు ఇబ్బంది పడుతున్నారని. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా
మనవి చేస్తున్నానని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మాణిక్ రావు గణేష్ మండప సందర్శన….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T152616.425-1.wav?_=16

ప్రజలందరు గణనాథుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలి

◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ షెరీ ఆహ్వానం మేరకు ,శ్రీ రామ్ వీధి లో ఏర్పాటు చేసిన మధుర గణేష్ మండపంను సందర్శించి దర్శించుకున్న శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప గారు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశంపాక్స్ చైర్మన్ మచ్చెందర్ తదితరులు …..

రాజకీయ జోక్యంతో సింగరేణి అభివృద్ధి ముప్పు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T152004.621.wav?_=17

రాజకీయ నాయకుల జోక్యంతో సింగరేణి అభివృద్ధి నిర్వీర్యం

సింగరేణి భూములను రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటున్నారు

ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణిలో రాజకీయ నాయకుల జోక్యంతో అభివృద్ధి దినదినం నిర్వీర్యం అవుతుందని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు క్రమ పద్ధతిగా ఎక్కువైతున్నారు పర్మనెంట్ కార్మికులు దినదినం తగ్గుతున్నారు కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి సింగరేణిలో ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులన్నీ కూడా 1998లో సింగరేణిలో ఎన్నికల పక్రియ తీసుకొచ్చి గెలిచిన కార్మిక సంఘాలు తమ ఆర్థిక రాజకీయ నాయకుల స్వలాభం కోసం ప్రభుత్వాలతో కుమ్మక్కై పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటిగా కొల్లగొట్టుక పోయినాయి
ఈరోజు సింగరేణి తల్లి ప్రమాదంలో ఉంది సింగరేణి తల్లిని రక్షించుకునే బాధ్యత యూనియన్ల తో పాటు యువ కార్మికులపై ఆధారపడి ఉంది కార్మిక వర్గం ఏకంగ కాకపోతే సింగరేణి ని కనుమరుగు అవుతుంది
కేంద్ర ప్రభుత్వం త్వరలో బొగ్గు బ్లాక్ లను వేలం వెయ్యబోతున్నది మన రాష్ట్రప్రభుత్వం సింగరేణి కంపెనీ తో పాటు కొన్ని యూనియన్లు వేలంలో పాల్గొనాలని ఈ వేలంలో బిజెపి పార్టీ పెంచి పోషిస్తున్న ఆదాని అంబానీ తోపాటు జిందాల్ వేదంతా కంపెనీలో ఇతర కార్పొరేట్ సంస్థలు బహుళ జాతి కంపెనీలకు తో పోటీపడి వేలంపాటలో మనము నెగ్గగలమా
కార్పొరేట్ శక్తులతో తట్టుకోలేనందున కొత్త బొగ్గు బ్లాక్ లను గతంలో లాగా నేరుగా కేంద్ర ప్రభుత్వం బేషరతుగా సింగరేణి సంస్థకే అప్పగించాలి ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ గనుక
సింగరేణి సంస్థకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కుట్రలను ఎండగడుతూ ఐక్య పోరాటాలు నిర్మిద్దాం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ దుర్మార్గమైన చర్యలను ఖండిద్దాం తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి తల్లిని కాపాడుకుందాం బంగారు భవిష్యత్తు నిర్మించుకుందాం యూనియన్లకు అతీతంగా సింగరేణి పరిరక్షణకై కార్మికులు పోరాడాలని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ పిలుపునిచ్చారు

ఎన్ హెచ్ ఆర్ సి నల్లబెల్లి మండల కమిటీ ప్రకటితం….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T151315.045.wav?_=18

ఎన్ హెచ్ ఆర్ సి. నల్లబెల్లి మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి

ప్రధాన కార్యదర్శిగా నాగపురి రమేష్, ఉపాధ్యక్షులుగా ఇంతల అనంతరెడ్డి, అధికార ప్రతినిధిగా రమేష్

నియామక పత్రాలు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

వరంగల్ జిల్లా అధ్యక్షులు మేరుగు రాంబాబు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఆవునూరి కిషోర్

“నేటిధాత్రి”,నల్లబెల్లి (వరంగల్ జిల్లా):

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నల్లబెల్లి మండల కమిటీని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు ప్రకటించారని జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అవునూరి కిషోర్ తెలిపారు. మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాగపురి రమేష్, మండల ఉపాధ్యక్షులుగా ఇంతల అనంతరెడ్డి, అధికార ప్రతినిధిగా ఆవునూరి రమేష్ లను నియమించినట్లు తెలిపారు. పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర జిల్లా కమిటీల ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నల్లబెల్లి మండల అధ్యక్షులుగా ఎన్నికైన యార మధుకర్ రెడ్డి మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, నెహ్రూ నాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షులు మేరుగు రాంబాబుకు, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కిషోర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకిచ్చిన ఈ పదవిని నీతి నిజాయితీతో నిర్వహిస్తామని మండలంలో సంస్థ బలోపేతం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి నియామకంతో నల్లబెల్లి మండల ప్రజలు, విద్యావంతులు, మేధావులు అభినందించి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version