ముగిసిన దేవీ శరన్నవరాత్రులు…

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని చిన్నరేవల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగగా..శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి వస్త్రాలను, పూర్ణ కలశమును వేలంపాట నిర్వహించారు. పూర్ణ కలశాన్ని సింగిల్ విండో మాజీ చైర్మన్ బత్తుల వెంకటరామ గౌడ్ వేలంపాటలో పాల్గొని కలశాన్ని రూ.51 వేలకు దక్కించుకున్నారు. అమ్మవారిని ప్రతిమను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనానికి భద్రతా సూచనలు – ఎస్సై రాజేష్..

నిమజ్జన సమయాల్లో జాగ్రత్తలు పాటించాలి..

ఎస్సై రాజేష్

నిజాంపేట: నేటి ధాత్రి

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో చెరువులు, కుంటలు అధికంగా నిండాయని నిమజ్జన సమయంలో మండప నిర్వహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంటు వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్నపిల్లలను చెరువులు కుంటల వద్దకు తీసుకువెళ్లొద్దన్నారు. శాంతియుత వాతావరణం లో పండగలు నిర్వహించుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో 100 కు డయల్ చేయాలన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version