పోత్కపల్లి గంజాయి నిందితుడు అరెస్ట్.

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న నిందితుడి అరెస్ట్..

4.098 గ్రాముల ఎండు గంజాయి,కారు,మొబైల్ ఫోన్ స్వాదీనం..

ఓదెల(పెద్దపల్లిజిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుండగా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి గంజాయి, కారు, మొబైల్ ఫోన్ను , స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. హుస్నాబాద్ కు చెందిన కంసాని అరుణ్ అనే 20 ఏళ్ల యువకుడు డ్రైవర్, టైల్స్ వర్క్ పై చేస్తూ డబ్బులు సరిపోక గంజాయి వ్యాపారం వైపు మళ్లాడని ఐ విచారణలో తేలింది. అతడి వద్ద నుంచి 4.098 కిలోల ఎండు గంజాయి, విలువ రూ. 2,04,000/-, ఒక ఎర్టిగా కారు, ఒక మొబైల్ క ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి స్నేహితులు బొల్లెద్దు మహేందర్, చీమల ఆకాష్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని , త్వరలోనే అదుపులోకి తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పోత్కపల్లి శివారులోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ -్య హాల్ ముందు వాహన తనిఖీలు జరుగుతుండగా ఎస్ఐ దీకొండ న్న రమేష్ ఒక కారు అనుమానాస్పదంగా కదులుతున్నట్లు గుర్తించి ఆపగా
నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు. కారు డిక్కీలో గంజాయి ప్యాకెట్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు ప్రాంతానికి చెందిన మహేందర్, ఆకాష్ తో పరిచయం పెంచుకున్న అరుణ్, వీరితో కలిసి ఓడిశా రాష్ట్రం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హుస్నాబాద్, కరీంనగర్, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల ప్రాంతాలలో విద్యార్థులు, ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముతూ లాభాలు సంపాదించాడని పోలీసులు తెలిపారు. ఒక కిలో గంజాయిని ఎనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేసి, స్థానికంగా యాభై వేల రూపాయలకు అమ్ముతున్నాడని విచారణలో తెలిసింది. గంజాయి పండించినా, తరలించినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో సీఐ సుల్తానాబాద్ జి. సుబ్బారెడ్డి, ఎస్ఐ దీకొండ రమేష్, ఏఎస్ఐ రత్నాకర్, పీసీలు రాజు యాదవ్, హరీష్, రాము, శివశంకర్, రాజేందర్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీరిని ఏసీపీ అభినందించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, డీసీపీ పి. కరుణాకర్ పర్యవేక్షణలో ఈ చర్య చేపట్టినట్లు అధికారులు వివరించారు.

లక్కీ డ్రాలో పది కిలోల గణపతి లడ్డు గెలుచుకున్న ప్రణయ్ కుమార్

లక్కి డ్రాలో పది కిలోల లడ్డు కైవసం చేసుకున్న నల్లగోని ప్రణయ్ కుమార్ గౌడ్..

ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:

 

ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో లక్కీ డ్రా ద్వారా గణపతి లడ్డూను ఓ భక్తుడు సొంతం చేసుకున్నాడు. పోత్కపల్లి శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ కొత్త గుడిసెల్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నల్లగోని భవాని-వెంకటేష్ గౌడ్ తన కుమారుడు ప్రణయ్ కుమార్(చిన్నా) పేరుపై రూ.101 రూపాయలకు లక్కీ డ్రా వేశాడు. నవరాత్రులు పూజలు అందుకున్న స్వామివారి పది కిలో ల లడ్డును లక్కి డ్రా లో సొంతం చేసుకున్నాడు.విఘ్నేశ్వర యూత్ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. లడ్డు రావడం పట్ల వెంకటేష్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఎల్లవేళలా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

పోత్కపల్లిలో గణపతి నవరాత్రి మహా అన్నదానం…

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో గోపికృష్ణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.సంఘం అధ్యక్షుడు డబ్బేట మల్లేశం మాట్లాడుతూ, గణపతి నవరాత్రులు గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీక. ఇలాంటి సమయాల్లో అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తి, సేవ, సౌహార్దం పెంపొందుతుంది. గ్రామంలో సామాజిక స్ఫూర్తిని పెంచడం గోపికృష్ణ పద్మశాలి సంఘం ప్రధాన ధ్యేయం అని పేర్కొన్నారు. మహా అన్నదానంలో గ్రామస్తులు, చిన్నలు పెద్దలు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు.!

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు చేసిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం గుంపుల భారత్ పెట్రోలియం బంక్ పక్కనగల రైస్ మిల్లు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ చేసి హైదరాబాద్ కు తరలించడానికి లోడ్ చేస్తుండగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కంటైనర్ లారీని మరియు లోడర్ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ నిల్వ చేసిన దాదాపు 20 ట్రాక్టర్ల ఇసుక గూర్చి ఓదెల తాసిల్దార్ కు సమాచారం ఇవ్వడం జరిగిందని నేరస్తులైన పెద్దిరెడ్డి జనార్దన్ రెడ్డి, మణిదీప్, పొన్నగంటి సురేష్, కోర్రి భాస్కర్, రాజన్ కుమార్ లు ఉనుకమరియు ఇసుక ను కలిపి కంటైనర్ లో తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఇసుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిలువచేసి హైదరాబాదుకు తరలించడానికి సిద్దం చేస్తున్న నేరస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిలువ చేసిన, తరలించిన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోబడును అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version