అత్యంత వైభవంగా ప్రెస్ క్లబ్ హోలీ వేడుకలు…

అత్యంత వైభవంగా ప్రెస్ క్లబ్ హోలీ వేడుకలు.

“నేటిధాత్రి”,హన్మకొండ/ప్రెస్ క్లబ్

 

వరంగల్ ప్రెస్ క్లబ్ గత34 సంవత్సరాలుగా1992 నుండి నిర్వహిస్తున్న హోళి వసంత కేళి రంగుల మహోత్సాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది.
దేశంలో ఏ ప్రెస్ క్లబ్ నిర్వహించని ఈ వేడుకలను కేవలం వరంగల్ ప్రెస్ క్లబ్ మాత్రమే నిర్వహించడం గొప్ప విశేషం..
నాడు ప్రెస్ క్లబ్ పెద్దలు అటు అధికారుల ఇటు ప్రజా ప్రతినిధుల మధ్య పరిచయమే వారధిగా చిన్న పెద్ద జర్నలిస్టు అనే తేడా లేకుండా ఈ కార్యక్రమానికి నాంది పలికింది….
అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ప్రస్తుత నిర్వహక మండలి మంగళవారంనాడు హోలీ పండుగ వేల యూనియన్లకు అతీతంగా భాగస్వామ్యం అయ్యి సప్తవర్ణ రంగుల కలయిక ఇంద్రధనస్సును తలపింపచేసింది…

డిజె సౌండు మధ్య ఉదయమే కలం కార్మికమిత్రులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ హోళీ వేడుక నిర్వహించారు..
అనంతరం అల్పాహార కార్యక్రమం అనంతరం రేన్ డాన్స్ కార్యక్రమంలో ప్రతి జర్నలిస్టు అత్యంత వైభవంగా తమ న్రుత్య శైలిని చాటారు..జర్నలిస్టు సోదరుల పిల్లలు మనలో మమేకమైనారు.
ఈ కార్యక్రమంలో పూర్వ ప్రెస్ క్లబ్ అధ్యక్షుల పి.వి.మదన్ మోహన్,ప్రధాన కార్యదర్శి సదయ్య,కోశాధికారి అమర్, ఉపాధ్యక్షులు గోకరపు శ్యామ్, బోడిగ శ్రీనివాస్, కోడిపెల్లి దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ లు పెద్దపల్లి వరప్రసాద్, సంపేట సుధాకర్, వలిశెట్టి సుధాకర్, పొడి శెట్టి విష్ణువర్ధన్, సీనియర్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, వీర గొని హరీష్, జనగాని ఆంజనేయులు, దొమ్మటి శ్రీకాంత్, నన్నపనేని భరత్,మురళి
హరి,శ్యాం,విష్ణు,
, షఫీ,
వంశీ,క్రిష్ణ,బుచ్చి రెడ్డి,కిషన్, రోజనాల సీను,రవీందర్ రెడ్డి, హరీష్,వెంకన్న,
భాస్కర్,
ప్రముఖులు పాల్గొన్నారు.

బెల్లాపూర్ ఆశ్రమం నుంచి పాదయాత్ర హద్నూర్ చేరిక, భక్తితో స్వాగతం

బెల్లాపూర్ ఆశ్రమం నుంచి పాదయాత్ర హద్నూర్ చేరిక, భక్తితో స్వాగతం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలం బెల్లాపూర్ ఆశ్రమం నుంచి ప్రారంభమైన పాదయాత్ర, పల్లకీసేవ జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల హద్నూర్ గ్రామానికి చేరుకుంది. మార్చి 5న జరగనున్న 47వ వార్షిక అమరతిథి సందర్భంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు నిండుకుండలతో ఘన స్వాగతం పలికి, ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దత్తగిరి ఆశ్రమంలో భజనలు, కీర్తనలు, ప్రవచనాలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. ఈ పాదయాత్ర భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.

జిర్లపల్లి లో ఘనంగా హొలీ సంబరాలు…

జిర్లపల్లి లో ఘనంగా హొలీ సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల జిర్లపల్లి గ్రామంలో కులమతాలకు అతీతంగా,.పార్టీలకు అతీతంగా ఉదయం నుండి హొలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.. స్థానిక ప్రజాప్రతినిధులు యూవకులు రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హొలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటు హొలీ సంబరాలు జరుపుకుంటున్నారు.. ఈ హొలీ
సంబరాల్లో గ్రామ నూతన సర్పంచ్ అమరేశ్వరి శివమణి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు రంగులు పోసుకుంటూ స్థానిక యూవకులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా గ్రామ నూతన సర్పంచ్ ఐక్యత, ఆనందం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై సంప్రదాయాలను పాటించారు.హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు,

హోలీ పండుగ శుభాకాంక్షలు

రంగుల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని మరింత బలపరచాలని, ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరీ శివమణి హోలీ సందర్భంగా చిన్న పిల్లలకు రంగుల ప్యాకెట్లు పంచి, ఆహ్వాదంగా పండుగను నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version