ఎనిమిదవ పోషణ పక్వాడ్ కార్యక్రమం…..

ఎనిమిదవ పోషణ పక్వాడ్ కార్యక్రమం…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం తాడూరు అంగన్వాడి సెంటర్ 2 లో కార్యక్రమం. తాడూరు గ్రామంలో ఈరోజు 8.వ .పోషణ పక్వాడ్.కార్యక్రమంలో భాగంగా తంగళ్ళపల్లి మండలం తాడూరు .2. అంగన్వాడి సెంటర్లో కార్యక్రమం ఈ సందర్భంగా పిల్లలు అంగన్వాడి సెంటర్లో నేర్చుకున్న ఆటపాటలతో కూడిన విద్య గురించి మరియు ప్రైవేటుకు దీటుగా అంగన్వాడి సెంటర్లు ఎలా నడుస్తున్నాయని తెలియజేయడం జరిగిందని పిల్లలకు శారీరకంగా మానసికంగా పిల్లల అభివృద్ధి అనేది అంగన్వాడి కేంద్రాల్లోనే జరుగుతుందని మరియు చిన్న చిన్న కండరాల పెద్ద కండరాల అభివృద్ధి కూడా జరుగుతుందని తెలియజేస్తూ పిల్లలను ముఖ్యంగా మొబైల్స్ కు దూరంగా ఉంచాలని మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే రేడియేషన్.తరంగాల వలన పిల్లల కంటి చూపు పై మరి మెదడుపై ఒత్తిడి పెరిగి శారీరకంగా అభివృద్ధి చెందరు కనుక మానసికంగా కృంగిపోతారు అని వచ్చే వేసవికాలంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అశ్రద్ధ చూపించవద్దని. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సీమంతాలు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రెడ్డి మల్ల సదానందం. అంగన్వాడి సూపర్వైజర్ సౌజన్య .టీచర్స్ కొండి.కొప్పుల పద్మ మమత సుధారాణి సరళ ఏ.ఎన్.ఎం.అనసూయ ఆశ లావణ్య తల్లులు మరియు గర్భిణీలు బాలింతల అంగన్వాడి పిల్లల పాల్గొన్నారు.

పోషణ్ ప్రక్వాడలో భాగం గా గ్రాడ్యువేషన్ డేలో పాల్గొన్న సర్పంచ్

పోషణ్ ప్రక్వాడలో భాగం గా గ్రాడ్యువేషన్ డేలో పాల్గొన్న సర్పంచ్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం తహ రాపూర్ గ్రామంలోని అంగ న్వాడీకేంద్రంలో పోషణ్ పక్వా డ కార్యక్రమాల సందర్భంగా గ్రాడ్యువేషన్ డే నిర్వహించా రు. ఈ సందర్భంగా 5 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు ఫ్రీ స్కూల్ సర్టి ఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రం ఆవరణలో ఘనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్కుక్కలసరోజన హాజరై పిల్లలకు సర్టిఫికెట్లు అంద జేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ పుణ్యవతి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యానికి పోష కాహారం ఎంతో ముఖ్యమని, గర్భిణీ స్త్రీల నుంచి పుట్టిన పిల్లల వరకు సరైన పోషణ అందించాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం పిల్లలకు యూనిఫారాలను పంపిణీచేశారు.ఈ కార్యక్ర మంలో ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్, ఫ్రీ స్కూల్ ట్రైనర్ రిజ్వనా, హైస్కూల్ హెడ్ మాస్టర్ రమేష్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సదాకర్, చలి వాగు ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి సెక్టార్ టీచర్లు మరియు ఆయాలు పాల్గొన్నారు.

అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

https://youtu.be/iVSPrhfij-c?si=giteFfPTjGxZfb2m

శాయంపేట మండలం రైతు వేదికలో అంగన్వాడి కేంద్రాల్లో డిజిటల్ సేవలను మరింత బలోపేతం చేయడంలో 54 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు అంగన్వాడి కేంద్రాల అభివృ ద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉం ది, సరైన పోషణ – ఆరోగ్య తెలంగాణ లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యో తి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు .

 

మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.ఎమ్మెల్యే మా ట్లాడుతూరాష్ట్రంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలను అభి వృద్ధి చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది అంగన్వాడి టీచర్లకు స్మార్ట్‌ఫో న్ల పంపిణీ ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగ వుతుంది గర్భిణీలు,బాలిం తలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను డిజిటల్ విధా నంలో నమోదు చేయడం సులభతరం అవుతుందని, గతంలో 16 రిజిస్టర్లలో నమో దు చేయాల్సిన పనిని ఇప్పు డు సాంకేతికత ద్వారా సుల భతరం చేసినట్లు తెలిపారు.

పోషణ పక్వాడ కార్య క్రమం ద్వారా 15 రోజుల పాటు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు, గర్భి ణీలు, బాలింతలు,చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను పర్యవే క్షించను న్నట్లు చెప్పారు.ప్రతి నెల మొదటి వారంలో పిల్లల ఎత్తు, బరువులను కొలిచి డిజిటల్ యాప్స్‌లో నమోదు చేస్తే పోషణ లోపాలను త్వరగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడిటీచర్లు,వ్యవసాయశాఖ అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీనాయకులు,పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version