మోడీ జీఎస్టీ తగ్గింపుకు పాలాభిషేకంతో స్వాగతం…

దేశ ప్రజల సంక్షేమమే బిజెపి లక్ష్యం. జీఎస్టీ స్లాబ్ లను తగ్గించి..దేశ ప్రజలకు ముందే పండుగ వాతావరణాన్ని కల్పించిన మోడీ

-బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి

-మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న భాజపా శ్రేణులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించేందుకు జీఎస్టీ స్లాబ్ లను భారీగా తగ్గించి దేశ ప్రజలకు ముందే దీపావళి పండుగ వాతావరణాన్ని కల్పించారని బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తూ..జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో భాజపా శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి& బిజెపి రాష్ట్ర నాయకులు చెవ్వ శేషగిరి ప్రజలను, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ప్రపంచంలోనే వికసిత్ భారత్ గా మార్చే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత దేశ అభివృద్ధి, దేశానికి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి అగ్రరాజ్యమే వణికిపోతుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. భారతదేశానికి వివిధ దేశాల నుంచి వస్తున్న మద్దత్, ఆదరణను చూసి అమెరికా వంటి దేశాలు కూడా ఈర్ష్య పడుతున్నాయన్నారు. మన దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల పెంచుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయన్నారు. జీఎస్టీ స్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యాపారస్తులకు, ఆరోగ్య పరికరాల కొనుగోలు అమ్మకం దారులకు, మధ్యతరగతి ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమ్మరి లచ్చమ్మ సారయ్య దళిత మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు బండారి రవీందర్ జిల్లా నాయకులు పోతుగంటి సాయిలు మండల ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్ అరికాంతపు కృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు రాస బిక్షపతి మండల కోశాధికారి వంగరవి మండల కార్యదర్శి పులి భాస్కర్ రెడ్డి చిలక మారి రాజేంద్రప్రసాద్ బూత్ అధ్యక్షులు పొడి శెట్టి రవి సామల తిరుపతిరెడ్డి రేపల శ్రీనివాస్ మధుకర్ ముక్క రవీందర్ తదితరులు పాల్గొన్నారు

దేశ రాజకీయ చరిత్రలో ధ్రువతార. .

దేశ రాజకీయ చరిత్రలో ధ్రువతార. . *రాజీవ్ గాంధీ 81వజన్మదిన వేడుకలు
జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు
మొగులపల్లి నేటి ధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మండల కేంద్రం లోని చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఆయన 1944 ఆగస్టు 20వ తేదీన బాంబేలో జన్మించారు భారతదేశం స్వాతంత్రం సాధించే నాటికి ఆయన తాత ప్రధాన మంత్రి అయినప్పటికీ రాజీవ్ గాంధీ వయసు కేవలం మూడు సంవత్సరాలు అలాంటి వ్యక్తి భారతదేశానికి ఏడవ ప్రధానమంత్రి అతను 1984 నుండి 1989 వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు ఆయన ప్రధానమంత్రి గా పనిచేశారు అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.అలాగే చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మమ్మదు రఫీ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆపద వస్తే నేనున్నానని 108 లాగా ముందుండి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు ఇందిరా గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ గాంధీ కుటుంబం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు ఎంతో మేలు చేసిందని అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందని వారి పేర్ల మీద నిరుపేదలైనటువంటి వారికి పథకాలను ప్రవేశపెట్టి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అలాగే 500 కే గ్యాస్ సిలిండర్ పేదలకు ఉచిత సన్న బియ్యం కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డు లు ఇస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలను అభివృద్ధి పథకంలో నడిపిస్తూ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రము ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు . కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ ,మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవకై పరితపిస్తున్న సామాజిక విద్యావేత్త

ప్రజాసేవకై పరితపిస్తున్న సామాజిక విద్యావేత్త మోరే రవీందర్ రెడ్డి

-అవకాశం వస్తే ప్రజల ఆశీస్సులతో మొగుళ్ళపల్లి జడ్పిటిసిగా బరిలోకి

-మొగుళ్ళపల్లి మండల అభివృద్ధికై నిరంతర ఆరాటం

-ప్రధాని నరేంద్రుడి ఆశయ సాధనకై విశేష కృషి

-జాతీయ భావాలతో విద్యాసంస్థల నెలకొల్పు

-సేవా భావం..దైవ గుణం కలిగిన మోరే యువతకు ప్రేరణ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

ప్రజా సేవకై నిరంతరం పరితపిస్తున్న సామాజిక విద్యావేత్త మోరే రవీందర్ రెడ్డి అవకాశం వస్తే ప్రజల ఆశీస్సులతో..బిజెపి పార్టీ పెద్దల దీవెనలతో మొగుళ్ళపల్లి జడ్పిటిసి గా బరిలోకి దిగనున్నట్లు బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తన మనోగతాన్ని వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మోరే ప్రమీల-రాంరెడ్డి దంపతులకు జన్మించిన మోరే రవీందర్ రెడ్డి బిఏ బీఈడీ వరకు విద్యనభ్యసించాడు.

 

 

చిన్నప్పటి నుంచే జాతీయ భావాలను అలవర్చుకుని విద్యార్థి దశలోనే ఏబీవీపీ పట్ల ఆకర్షితుడై జ్ఞానం..శీలం..ఏకత..అనే భావాలతో దేశ సమైక్యత కోసం పని చేసేవాడు. 2000 సంవత్సరంలో ఏబీవీపీ మండల కన్వీనర్ గా నియమితులయ్యాడు. విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న క్రమంలో ఆయన సేవలను గుర్తించిన ఏబీవీపీ అధిష్టానం ఆయనకు పదోన్నతి కల్పించి 2005లో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా నియమించారు.

 

 

 

అనంతరం ఆర్ఎస్ఎస్ మండల ప్రముఖ్ గా మరియు ధర్మ జాగరణ సమితి ఖండ ప్రముఖ్ గా పనిచేస్తూ..హిందువులను జాగృతం చేయడంలో ఆయన పాత్ర కీలకం. తన గురువర్యులు మాజీ ఎంపీ కీర్తిశేషులు చందుపట్ల జంగారెడ్డి పిలుపు మేరకు 2008లో బిజెపి పార్టీలో సభ్యత్వం పొంది బీజేవైఎం పరకాల నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా, 2012లో బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా, 2013లో బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, 2016లో బిజెపి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడిగా నియమితులై పార్టీ సేవలో నిమగ్నమయ్యారు.

 

 

 

కాగా మోరే రవీందర్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు భాజపా శ్రేణులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు 2012లో జరిగిన పరకాల ఉప ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థి పెసరు విజయ్ చందర్ రెడ్డి గెలుపు కోసం నియోజకవర్గంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామ ఇన్చార్జిగా పనిచేసి..ఆయన గెలుపు కోసం కమలదండుతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం 8,9 వార్డులలో ఇన్చార్జిగా పనిచేసి వారి గెలుపు కోసం పనిచేశారు.

 

 

అనంతరం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు కోసం కష్టపడి పనిచేసి ఆయన గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించడం..నాగంపేట గ్రామ ఇన్చార్జిగా పనిచేసి కమలదలాన్ని ముందుకు తీసుకెళ్లడం రవీందర్ రెడ్డి పనితనానికి నిదర్శనం. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపా బలపరిచిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఆయనకు ఇన్చార్జిగా ఇచ్చిన ఇదిగూడ గ్రామంలో కష్టపడి పనిచేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం రఘునందన్ రావు గెలుపులో భాగంగా కష్టపడి పని చేశారు.

 

 

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 23వ డివిజన్ ఇన్చార్జిగా పనిచేసి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆడేపు స్వప్న-సదానందంను గెలిపించడంలో ఆయన చేసిన విశేష కృషి ఎనలేనిది. ఈ తరుణంలో మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడుగా కొనసాగుతున్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 2 ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎంపీటీసీని బిజెపిలోకి ఆహ్వానించడం, మండల కేంద్రంలో సర్పంచ్ గా బిజెపి అభ్యర్థిని గెలిపించుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలకు దీటుగా బిజెపిని బలోపేతం చేస్తున్న మోరే రవీందర్ రెడ్డి ప్రస్తుతం బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ గా 2019 నుండి 2025 వరకు రెండుసార్లు నియమితులవ్వడం ఆయన పార్టీకి చేస్తున్న సేవలకు నిదర్శనం.

 

 

 

 

ప్రస్తుతం ఆయన సేవాగుణం..దైవ గుణాన్ని యువకులు, ప్రజలు ప్రేరణగా తీసుకుని ఆయనను ప్రజా ప్రతినిధిగా చూడాలనుకుంటున్నారు. ఆయన పర్లపల్లి, మొగుళ్లపల్లిలో స్థాపించిన విద్యాలయాలలో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించి పేరు ప్రఖ్యాతులు గడించడం గమనార్హం. ఆయన పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, పోలీస్ అధికారులుగా, రెవెన్యూ ఉద్యోగులుగా, పంచాయతీ రాజ్ అధికారులుగా స్థిరపడడం ఆయన చేసిన సేవలకు నిదర్శనం.

విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ సంజయ్ మొగుళ్ళపల్లి.

నేటి విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టును సద్వినియోగం చేసుకోండి

విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ సంజయ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

నేడు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల మండలాల విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టును గురువారం చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో టీజీ ఎన్పీడీసీఎల్ సిజిఆర్ఎఫ్ -1 చైర్ పర్సన్ వేణుగోపాల చారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఇంచార్జ్ ఏఈ సంజయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ, విద్యుత్ నియంత్రికల మార్పు, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం, నూతన సర్వీసుల మంజూరు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కోర్టును నిర్వహిస్తామన్నారు. కావున మండలంలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version