మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే 199వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిబీసీ జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్ గారు మాట్లాడుతూ సమాజంలో విద్య కోసం, మహిళల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అన్నారు. ఈ కార్యక్రమ విశిష్ట అతిథి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాటికంటి రవికుమార్ మాట్లాడుతూ ఈ సమాజంలో బీసీల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకు ఫూడులే మార్గం లో బీసీల కోసం బీసీల హక్కుల కోసం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమా నిర్వాహక అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ సామాజిక రాజకీయ సాంస్కృతిక మార్పు తీసుకువచ్చినటువంటి ఆధునిక విప్లవకారుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ మహాత్మ జ్యోతిరావు ఫూలే 199 వ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా సమాజంలో అట్టడుగు వర్గాలు శూద్రులు మహిళల అభ్యున్నతి కోసం సత్యశోధక్ సమాజ్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అదేవిధంగా ఫూలే రాసినటువంటి గులాంగిరి గ్రంథాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు తప్పకుండా చదవాలని పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిసి ఏసి ఎస్టీ జిల్లా నాయకులు దొంగల రాజేందర్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ భీమనాధుని సత్యనారాయణ,ముత్యాల రవికుమార్ నాయి, గోపరాజు రాజు రజక, పెంట సదన్న యాదవ్, సర్వేశం, చిత్తారి రాజేష్, వంగపండ్ల రాజయ్య యాదవ్,బీసీ జిల్లా యూత్ అధ్యక్షులు మద్దెల విజయ్ గౌడ్, రాజయ్య, పెంజల రమేష్, లక్ష్మయ్య, గీసా సంపత్, వెయ్యిగండ్ల తిరుపతి నాయి మంద రమేష్ పుల్ల అశోక్ నద్దునూరి రాజ్ కుమార్ పర్లపల్లి వంశీ చిలుముల కృష్ణ కొయ్యాడరమేష్ మందపెల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు

జ్యోతిరావు పూలే ఆశయాలు యువతకు మార్గదర్శకం…

జ్యోతిరావు పూలే ఆశయాలు యువతకు మార్గదర్శకం

కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్థిని హైస్కూల్‌లో శనివారం మహానీయుడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. విద్య ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యమని, అజ్ఞానం, మూఢనమ్మకాల నుంచి బయటపడేందుకు పూలే చూపిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. మహిళా విద్యకు ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు.

పూలే ఆశయాలను జీవితంలో ఆచరణలో పెట్టుకుంటేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థులు మంచి విలువలతో ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి ధాత్రి

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో సమాజ సంస్కర్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. 
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఉప్పునుతల రమేష్ మాట్లాడుతూ.. భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహిళా విద్య కోసం తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి వారు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహారెడ్డి మాట్లాడుతూ పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా నేడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, వెనుకబడిన వర్గాల (బిసి) కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం ద్వారా బిజెపి సామాజిక న్యాయాన్ని చేకూర్చిందని వారు తెలిపారు. పూలే కలలుగన్న మహిళా సాధికారత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామడుగు వెంకటాచారి, మండల ఉపాధ్యక్షులు చెలగొల్ల వెంకన్న, మండల నాయకులు లెంకలపెల్లి శ్రీనివాస్ ,బచ్చు లక్ష్మీనారాయణ ,గాంతి వెంకట్ రెడ్డి, నాయకపల్లి సర్పంచ్ గుండెల వీరన్న ,అయిత సారయ్య ,బానోత్ రాము,ధరావత్ రంగమ్మ, మండల బీజేపీ ముఖ్య నాయకులు, శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

మహనీయుల ఆశయాలు సమాజానికి దిక్సూచి…

మహనీయుల ఆశయాలు సమాజానికి దిక్సూచి

* మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ మొగులపల్లి

నేటి ధాత్రి మహాత్మ

జ్యోతిరావు మహనీయుల సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పూలే మహిళల విద్య కుల నిర్మూలన కోసం విశేష కృషి చేశారని అణగారిన వర్గాల అభివృద్ధికి జీవితాలే నేటి ప్రజా నికానికి దిక్సూచి అని మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ అన్నారు గ్రామపంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని న అవసరం సమాజంలో ఉందన్నారు అట్టడుగు వర్గాలకు సమాన న్యాయం అందాలంటే సామాజిక న్యాయం ద్వారానే సాధ్యమని నమ్మి ఆ దిశగా పోరాడిన మహనీయులు పోలే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్రబెల్లి మా బిందు కోటేశ్వరరావు వార్డు సభ్యులు చిలుకమారి శ్రీనివాస్ హర్షం మహేష్ బండారి కుమార్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యా తరాజు రమేష్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ టౌన్ గుడిమళ్ల రమేష్ పడిదల నర్సింగరావు సెక్రెటరీ నరేష్ పాల్గొన్నారు

జ్యోతిరావు ఫూలే సేవలు చిరస్మరణీయం..

జ్యోతిరావు ఫూలే సేవలు చిరస్మరణీయం

ఆమూదాలపల్లి మల్లేశం గౌడ్

పరకాల,నేటిధాత్రి

జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం,విద్యా విస్తరణ కోసం బాపులే చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన ఆముదాలపల్లి మల్లేశం గౌడ్ తెలిపారు.అణగారిన వర్గాలకు విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ఉద్యమం దేశ సామాజిక వ్యవస్థలో మార్పుకు దోహదపడిందని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే బాపులే ఆశయం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తోందని వెల్లడించారు.మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ సావిత్రిబాయ్ ఫూలేతో కలిసి చేసిన సేవలు భారత సమాజానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.ప్రస్తుత తరానికి బాపులే ఆలోచనలు స్ఫూర్తిగా నిలవాలని,వాటిని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని మల్లేశం గౌడ్ సూచించారు.

శ్రీ వరవర రంగనాయక భాష నిలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

శ్రీ వరవర రంగనాయక భాష నిలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

కోదాడ, నేటి ధాత్రి:

 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను శనివారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామ వరవర రంగనాయక భాషా నిలయం గ్రంథాలయం నందు జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జ్యోతి రావు పూలే చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా 1888లో మహాత్మా అనే బిరుదు లభించింది. బడుగు బలహీన వర్గాల మహిళల కోసం ఆయన చేసిన సేవలు శిరస్మరణీయమైనవి.కుల వ్యవస్థ నిర్మూలన, అంటరానితనం తొలగింపు స్త్రీ విద్య, మహిళా సాధికారత కోసం తన భార్య సావిత్రిబాయి పూలే తో కలిసి 1848 లో పూణేలో బాలికల కోసం మొదట పాఠశాలను స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య, ఇర్ల శ్రీనివాస్ రెడ్డి,వట్టికూటి గురవయ్య, మాజీ సర్పంచ్, పాపి శెట్టి సత్యం పిఎసిఎస్ మాజీ చైర్మన్, కామిశెట్టి నరసింహారావు, మాజీ దేవాలయం చైర్మన్, జాబిశెట్టి నాగప్రసాద్ గ్రామ శాఖ అధ్యక్షులు,బండి చిన్న కోటయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు 9వ వార్డు మెంబర్, కాసాని శ్రీను, ఇర్ల గోపిరెడ్డి, పోశంఎర్ర కొండలు, ఇర్ల నర్సిరెడ్డి, సంపటం శ్రీనివాసరావు, మార్గం రామచందర్రావు,పొట్టా గాంధీ, అమరబోయిన రవి,దాట్ల సైదాచారి, భూక్యా హీరమ్. కుక్కడపు గోపయ్య,బొర్రా కొండలు, పోశం గాంధీ, పోశం వెంకటయ్య, గూడపు వెంకటేశ్వర్లు,దండాల పద్మావతి, కత్తి మాధవి,బంక వరలక్ష్మి, పిడమర్తి రజిని, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి-డాక్టర్ లతవిశ్వజన్….

మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి-డాక్టర్ లతవిశ్వజన్

చొప్పదండి, నేటిధాత్రి:

 

జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలోని అక్షయ పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ లతవిశ్వజన్ మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని, అదేవిధంగా మహిళలందరూ ఉన్నత విద్యను అభ్యసించి, అన్ని రంగాల్లో ముందుండాలన్నారు రానున్న రోజుల్లో మహిళలు అందరూ రాజకీయంగా ఎదగాలని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి పాఠశాల సిబ్బందికి సన్మానం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో అక్షయ పాఠశాల కరస్పాండెంట్ తమ్మిడి కనుకరాజు, ప్రిన్సిపాల్ శ్రీమతి, హుజురాబాద్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అక్షయ్, సిద్ధెంకి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం..

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ యాకాంతం గౌడ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలని పేర్కొన్నారు. మహిళలకు విద్య లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదన్న ఆలోచనతో ఆమె చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.

మహిళలు విద్య, ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగాలని, ప్రతి విద్యార్థిని సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్నారు.

తొలిమహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…

తొలిమహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే

దుగ్గొండి,నేటిధాత్రి:

 

 

 

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని మర్రిపల్లి సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ అన్నారు.సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మర్రిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించగా సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ పాల్గొని ఘన
నివాళులర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ మహిళల విద్య కోసం సావిత్రిబాయి త్యాగం, విద్యనే ఆయుధంగా చేసుకుని సమానత్వం కోసం పోరాడి ఆమె జీవితం అందరికీ మార్గదర్శకమని చూపారాన్నారు.అనంతరం ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ ఉపాధ్యాయుయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ సభ్యులు గాజు శివాజీ,కుక్కమూడి కవిత,డ్యాగం రాణి నర్సింగం,రాజేందర్ అపర్ణ,మాజీ సర్పంచ్ చాతరాశి నాగేందర్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఉప సర్పంచ్ పొన్నాల ప్రతాపరెడ్డి,మహిళా సంఘం సీసీ వేల్పుల సుజాత,గ్రామ పెద్దలు ఇట్టబోయిన ఐలయ్య,గాజు చిన్న రాజయ్య,కుక్కమూడి సాంబయ్య,గ్రామ మహిళలు కశివొజ్జువుల రాజేశ్వరి,కుక్కమూడి కర్ణ,తలారి రజిత,మైదం స్రవంతి,ఆశా వర్కర్ మైదం సరోజన,యూత్ సభ్యులు డ్యాగం శివాజీ,పొన్నాల మైపాల్,కుక్కమూడి గోవర్ధన్,చిరంజీవి,మైదం దిలీప్,కుక్కమూడి స్వామి,శ్రీనివాస్,ప్రదీప్,సిద్దు,ఇల్లందుల ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి…

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాలనేటి ధాత్రి:

 

ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థినీ, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం మెనూ అమలు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు,విద్యుత్,విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు,ప్రహరీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.విద్య అజ్ఞానాన్ని దూరం చేస్తుందని తెలియజేస్తూ బాలిక విద్యను ప్రోత్సహించారని,మహిళల హక్కుల కోసం తన వంతు కృషి చేశారని తెలిపారు.మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి…

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

నర్సంపేట,నేటిధాత్రి:

 

బాలాజీ విద్యాసంస్థల్లో భాగమైన అక్షర ద స్కూల్ ,బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆమె మహిళల విద్యకోసం ఎనలేని కృషి చేసారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జయంతిని మహిళా టీచర్స్ డే గా నిర్వహించడం చాలా గొప్పన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వనజ,సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ ఆర్.జ్యోతి గౌడ్,జి. భవాని,ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.

*సంఘసంస్కర్త, స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే…

*సంఘసంస్కర్త, స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే…

*సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష..

తిరుపతి (నేటిధాత్రి)

 

భారత దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే గారని తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ…సంఘసంస్కర్త పోరాటయోధురాలు.
వర్తమాన కాలంలో కూడా మహిళల అభివృద్ధికి అనేక ఆటంకాలు చూస్తున్నాము. అలాంటిది దాదాపు 200 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర లాంటి ఆధిపత్య వర్గాల పెత్తనం ఉన్న రోజులలో జన్మించిన సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించడమే కాకుండా తాను నమ్మిన ఆశయాల సాధన కోసం భర్తతో కలిసి పోరాటం చేశారు.
ఉపాధ్యాయులే కాకుండా వారు రచయిత్రికూడా. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషిc చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారు. చాలామందికి ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. అందుకే ఆమె మనందరికి స్పూర్తి ప్రదాత*

*మహిళా విద్యాలయాల మధ్య తొలి మహిళ ఉపాధ్యాయురాలు విగ్రహం సముచితం…

సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తున్న పెద్దల కృషి పలితంగా నేడు మహిళాయూనివర్సిటి సమీపంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి విగ్రహం ప్రారంభం అవుతుండటం సంతోషించ దగ్గ విషయం మాత్రమే కాదు సముచితమైనది కూడా… ఎందుకంటే సావిత్రీబాయి పూలే మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సంఘసంస్కర్త భారత దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు. మహిళా యూనివర్సిటీ ఒక వైపు
ఎస్ పి డబ్యూ,
డిగ్రీ, జూనియర్ మరియు పాలటెక్నికల్ కళాశాలలు మధ్య విగ్రహం ఏర్పాటు చేశారు. వేలాది మంది విద్యార్థినులు విద్యనభ్యసించి అటు వైపుగా సంచరించే ప్రాంతంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహం ఉంటే మొత్తం మహిళలకు స్ఫూర్తిని ఇస్తుంది. సావిత్రిబాయి పూలే విద్య ద్వారానే మహిళా సాధికారిత వస్తుంది అని నమ్మడమే కాదు తొలి పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి కళాశాలలో చదువుకుని పూలే గారి విగ్రహాన్ని చూస్తే తమ కర్తవ్యం గుర్తుకు తెచ్చుకుంటారు. తాము అభివృద్ధి చెందటంతో పాటు తోటి మహిళా చైతన్యానికి ప్రయత్నం చేయాలి అందుకు ప్రేరణగా సావిత్రిబాయి పూలే విగ్రహం దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను…

*పూలే ఆలోచనలే జగన్ గారి పాలనా ప్రాధాన్యతలు…

మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సావిత్రిబాయి పూలే గారి ఆలోచనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేసింది. ఆర్ధిక స్వతంత్ర్యం ఆడబిడ్డకు అవసరం అని గుర్తించి అమ్మవడి పథకం, 32 లక్షల ఇల్లస్టలాలు రాష్ట్రంలో మంజులు చేస్తే వాటిని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఆడబిడ్డల రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. రాజకీయ పదవులలో 50 శాతం తగ్గకుండా బలహీన వర్గాలు , మహిళలలను నియమించారు. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రతి పథకం మహిళ కేంద్రంగా ఉండే విధంగా ఆలోచనలు చేసి అమలు చేశారు.. వారి రాజకీయ సంకల్పం వల్ల అనేక మంది రాజకీయ పదవులలో రాణిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయ సంకల్పానికి నేను ఒక ఉదాహరణ కావడం నాకు లభించిన గౌరవం…
సంఘసంస్కర్త స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన డాక్టర్ శిరీష వారి స్పూర్తితో బలహీన వర్గాల మరియు మహిళల అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు తిరుపతి తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం,తదితరులు ప్రజాప్రతినిధులు , సీనియర్ నాయకులు, బీసీ సంఘర్షణ సమితి నేతలు పాల్గొన్నారు.

ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి.

ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి.

చందుర్తి, నేటిధాత్రి:

 

 

 

ఈరోజు భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహానీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని PM SHRI MPPS చందుర్తి పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయినిలైన
వేముల సుజాత, జ్యోతి, స్వప్న, హేమలత ను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని వేముల సుజాత మాట్లాడుతూ,

“సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలు. ఆమె చేసిన పోరాటాలు, సేవలు నేటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకం. బాలికల విద్యను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది”
అని పేర్కొన్నారు.

ఆమె మహిళా సాధికారత, సమానత్వం, విలువలతో కూడిన విద్య ప్రాముఖ్యతను వివరించారు. సావిత్రిబాయి పూలే జీవితం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాచకొండ ప్రసాద్, గుఱ్ఱం బాలకిషన్, కొత్తూరి శ్రీధర్, రాకం రవి, మరియు కాపిల్ల నరేష్ లు పాల్గొని, సన్మానం పొందిన ఉపాధ్యాయినిలను అభినందించారు. అలాగే సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా ముగిసింది.

పూలే 135వ వర్ధంతి వేడుకలు ఘనంగా

సమాజంలో కుల వ్యవస్థను రూపుమాపిన యోధుడు జ్యోతిరావు పూలే.

ఘనంగా పూలే 135వ వర్ధంతి వేడుకలు.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య విచ్చేసి మాట్లాడుతూ నాటీ సమాజంలో కుల వ్యవస్థ అనిచివేత అంటరానితనం దోపిడీ అన్యాయాలను రూపుమాపుటకు ఎనలేని కృషి చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, ముఖ్యంగా స్త్రీలకు ప్రజలకు విద్యను అందించాలనీ ఎంతో కృషి చేసిన మహనీయుడనీ, సామాజిక ఉద్యమకారుడని తెలిపారు. ఆ మహనీయుడు ఏప్రిల్ 11 -1827న జన్మించి , నవంబర్ 28- 1890 లో మరణించాడని అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే బ్రతికినంత కాలం సామాజిక సమానత్వం కోసం పోరాటం చేశాడని చెప్పారు. బాల్యంలో దుర్భరమైన జీవితం గడపడానికి అన్నారు. అగ్రకుల బ్రాహ్మనుల వివక్షితను ఆలోచన పరుడిగా మార్చాయి అని తెలిపారు. 19వ శతాబ్దపు చీకటి రోజుల్లో బ్రాహ్మణీయ కులతత్వపు కోరల్లో చిక్కి చెల్య మై పోతున్న అణగారిన వర్గాల్లో కుల నిర్మూలన దృక్పథాన్ని బోధించి అగ్రకుల దోపిడి వర్గానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలను సామాజిక విప్లవం దిశగా మేల్కొల్పిన సామాజిక విప్లవ చైతన్య స్ఫూర్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈ దేశంలో స్త్రీల విద్యకు అంకురార్పణ చేసిన తొలి వ్యక్తి పోలిగారని చెప్పారు. మొట్టమొదట పాఠశాలను స్త్రీలకు ఏర్పాటు చేసి తన భార్య అయిన సావిత్రిబాయి పూలను ఈ దేశంలో మొదటి ఉపాధ్యాయురాలిగా మార్చాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల మాజీ అధ్యక్షులు సరిగముల రాజేందర్ ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు మండల నాయకులు గురుకుంట్ల కిరణ్ పాము కుంట్ల చందర్ గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు

మహాత్మా పూలేకు ఘన నివాళి

సామాజిక న్యాయదిక్సూచి జ్యోతిరావు పూలే

టి,ఎన్,ఎస్,ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి

సిరిసిల్ల టౌన్,నేటిధాత్రి:

 

సామాజిక న్యాయదిక్సూచి మహాత్మా జ్యోతిరావు పూలే అని టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు,టిడిపి వేములవాడ నియోజకవర్గ అడాహాక్ కమిటీ సభ్యులు మోతె రాజిరెడ్డి అన్నారు.
సామాజిక న్యాయం,మహిళా విద్య, సమాన హక్కుల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన భాందవుడు అని పేర్కొన్నారు. సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్యస్పూర్తిగా నిలిచిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version