గుండంపల్లి గ్రామంలో విద్యుత్ ప్రజా బాట కార్యక్రమం…

గుండంపల్లి గ్రామంలో విద్యుత్ ప్రజా బాట కార్యక్రమం
మల్లాపూర్ మార్చి 31 నేటి ధాత్రి

గుండంపల్లి గ్రామంలో విద్యుత్ ప్రజా బాట కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ ఏ డి ఈ జక్కుల అమరేందర్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో
సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య
మార్కెట్ చైర్మన్ అంత డుపుల పుష్పలత నర్సయ్య,
రాఘవపేట సెక్షన్ ఏయ్ సిరిపురం సంతోష్ కుమార్
సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ రవీందర్,
లైన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్,
లైన్ మెన్ లక్ష్మణ్, ఏఎల్ఎం వినీత్,
సిబ్బంది, ఉప సర్పంచ్ గంగాధర్,
మామిడి లక్ష్మారెడ్డి, జక్కుల కొమురయ్య, గంగారెడ్డి,
గంగాధర్, విజయ్, నరేష్, అంజయ్య, రాజేందర్,
మిద్దె అంజయ్య, అనిల్, వీడీసీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏ డి ఈ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్‌లను స్వయంగా మార్చేందుకు ప్రయత్నించకూడదని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే వ్యవసాయ మోటర్లకు కెపాసిటర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని రైతులకు సూచించారు.
అలాగే గుండంపల్లి గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక ముఖ్య సమస్యకు పరిష్కారం లభించింది. పోచమ్మ దేవాలయం నుండి వైకుంఠ ధామం వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, వీధి దీపాలు వెలిగే విధంగా లైన్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమస్య పరిష్కారంపై సర్పంచ్ మరియు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

గుండంపెల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అవగాహన సదస్సు

గుండంపెల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అవగాహన సదస్సు
మల్లాపూర్ ,నేటి దాత్రి –

 

 

 

మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలోకొత్త గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్ స్కీం లో అర్హత సాధించేందుకు ప్రత్యేక షేర్ కాపిటల్ కలెక్షన్ ప్రోగ్రాం గుండంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామా సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య గారు ఏఎంసి ఛైర్మెన్ అంతడుపుల పుష్ప లత నర్సయ్య,ఉప సర్పంచు లు, వార్డు సభ్యులు, రైతులు, పంచాయితీ కార్యదర్శి, నారాయణ సొసైటీ కార్యదర్శి భూమేష్ , సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు

గ్రామంలో మిషన్ భగీరథ నీటి కొరకు ముందడుగు వేసిన సర్పంచ్..

గ్రామంలో మిషన్ భగీరథ నీటి కొరకు ముందడుగు వేసిన సర్పంచ్

మల్లాపూర్ నేటి ధాత్రి

 

గుండంపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు గ్రామంలో ఏ ఒక్క ఇంటికి రావడం లేదు అని సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య ఎంపీడీవో కి సోమవారం విన్నవించగా మంగళవారం మిషన్ భగీరథ గ్రిడ్ ఎఇ జ్ఞానేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎఇ మహేష్ గ్రామానికి విచ్చేసి నీరు రాకపోవడానికి గల సమస్యలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పుష్పలత నరసయ్య,ఉప సర్పంచ్ గంగాధర్, సిరికొండ గంగారెడ్డి, మురళి, ముత్యాలు, రెబల్ తదితరులు పాల్గొన్నారు.

రైతు గుర్తింపు నమోదు కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గుండంపల్లి సర్పంచ్..

రైతు గుర్తింపు నమోదు కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గుండంపల్లి సర్పంచ్
మల్లాపూర్ జనవరి 2 నేటి దాత్రి

 

గుండంపల్లి గ్రామపంచాయతీ వద్ద రైతు గుర్తింపు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ పద్మ నరసయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు గుర్తింపు నమోదు కొరకు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం గ్రామపంచాయతీ వద్ద చేసేలా ఏఈఓ గజానంద్ తో మాట్లాడి గ్రామపంచాయతీలోనే రైతు నమోదు జరిగేలా ఏర్పాటులు చేశామన్నారు. ఏఎంసీ చైర్మన్ పుష్పలత నరసయ్య ఏఈఓ గజానంద్ సమక్షంలో ఈ రైతు నమోదు కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, గంగారెడ్డి, నరసయ్య, శ్రీశైల మల్లేష్, సత్తయ్య, హనుమంతు, రాజారెడ్డి, నారాయణ, స్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version