తాడూర్ రైతు సంబరాల్లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎద్దుల బండ లాగుట ప్రారంభం

నాగర్ కర్నూలు జిల్లా నేటి ధాత్రి

తాడూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు సంబరాల్లో భాగంగా ఎద్దుల బండ లాగుట పోటీలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగ అని రైతుల శ్రమ ఫలించిన ఆనందాన్ని ప్రతిభంబించేదే ఈ సంబరాలు అని అన్నారు గ్రామీణ క్రీడలు సాంప్రదాయ కార్యక్రమాలు మన సంస్కృతికి ప్రతి కలాని వీటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తూ రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ రమణ రావు తాడూర్ సర్పంచ్ మల్లయ్య చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.!

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ చైర్మన్

కేసముద్రం/ నేటి దాత్రి

కల్వల గ్రామానికి చెందిన ఆరేపు వెంకటమ్మ భర్త కనకయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. కావున వారి యొక్క కుటుంబానికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, 50kgs బియ్యం అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గండి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరమాండ్ల ఎల్ల గౌడ్, పెదగాని రవి, మేక వెంకన్న, దాసరి వీరస్వామి, వేల్పుల యాకయ్య, జల్లే వెంకటయ్య, ఆరేపు వీరయ్య, పారానంది శ్రీను, జల్లే పుల్లయ్య మరియు యూత్ సభ్యులు ఆరేపు అనూఫ్, ఆరేపు ప్రవీణ్, జల్లె భాష తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version