ఇందారంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహణ
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామపంచాయతీలో శనివారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఎంపిడిఓ జి.సత్యనారాయణ గౌడు ఆధ్వర్యంలో షాపుల యజమానులకు,గ్రామస్తులకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారితో ప్రతిజ్ఞ చేయించి మానవహారం నిర్వహించారు.అదేవిధంగా ఎంపీయుపిఎస్ (ఉర్దూ) పిల్లలకు కూడా అవగాహన కల్పించారు.ఉర్దూ పాఠశాలలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ మరియు కిచెన్ షెడ్లను పరిశీలించారు.ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కార్యక్రమంలో భాగంగా 75% రాయితీతో మొదటి విడతగా 14 మంది అర్హులైన రైతులకు 32 యాంత్రిక వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై పంపిణీ చేశారు.అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము,ఆవాస్ ప్లస్ సర్వేను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్,స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.