మాత శిశు సంరక్షణకు కృషి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మాత శిశు సంరక్షణకు కృషి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయడం ద్వారా మాత శిశు సంరక్షణకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్లా రమ్య,ఆర్.ఎం.ఓ. శ్రీధర్ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు.శుద్ధమైన త్రాగునీరు, నాణ్యమైన పోషక ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని, వ్యాధులకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.గర్భిణీల వివరాలు నమోదు చేసి సమయానుసారంగా చేసుకోవలసిన వైద్య పరీక్షలు, తీసుకోవలసిన ఆహారం, పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంపొందించడం జరిగిందని తెలిపారు.ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలు,ప్రాథమిక ఆసుపత్రులు,సామాజిక ఆసుపత్రులు,ప్రభుత్వ ఆసుపత్రులు,పల్లె,పట్టణ దవాఖానాలు,ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలల ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రస్తుతం మాతా శిశు ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో వరద నీటి ఇబ్బంది ఉన్నందున త్వరలో పూర్తి కానున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు.లక్షెట్టిపేట సామాజిక ఆసుపత్రి, బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని,జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, చెన్నూర్ మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.గ్రామ,మండల,జిల్లా స్థాయిలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు.ఆశ, ఆరోగ్య కార్యకర్తల నుండి వైద్యుల వరకు గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని,వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం స్టాఫ్ నర్సులు,సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని,స్నేహపూర్వక వాతావరణం లో వైద్య చికిత్స అందించాలని తెలిపారు.అనంతరం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమం,అభివృద్ధి  దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు 129.25 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలి

న్యూట్రిషన్ లపై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి

మహబూబాబాద్/ నేటి ధాత్రి

బుధవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ మండలం పర్వతగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, కురవి మండలం నేరేడ జడ్.పి.హెచ్.ఎస్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు,

ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న విద్య బోధనలను స్వయంగా పరిశీలించారు, నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధనలు అందించాలని, రానున్న పదవ తరగతి పరీక్షల్లో అన్ని విద్యాసంస్థలలో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీయాలని సూచించారు,

పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు శాతం పక్కాగా ఉండే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాణ్యమైన డైట్ మెనూ అమలు చేయాలని సూచించారు, హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ లపై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు,
అంతకుముందు పాఠశాల ఆవరణంలోని కిచెన్ షెడ్ డైనింగ్ హాల్ మరుగుదొడ్లు తరగతి గదులు పరిశీలించారు,
భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉండాలని, విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు,
మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన సమయంలో అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలను తనిఖీలు నిర్వహించాలనీ సూచించారు.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్…

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలను ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పలు రకాల వంటకాలు, తినుబండారాలతో పాఠశాలకు విచ్చేసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ వైద్య వనజ మాట్లాడుతూ ఈ ఫెస్టివల్ వేడుకల్లో బాగంగా విద్యార్థులకు అందజేయాల్సిన పౌష్టికాహారంపై తల్లితండ్రులకు అవగాహన కల్పించామన్నారు. పౌష్టికాహారం లోపిస్తే విద్యార్థుల్లో ఎదుగుదల తగ్గిపోతుందని తెలిపారు. రకరకాల వంటకాలను పరిచయం చేసిన విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు సరళ, మల్లీశ్వరి, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version