వేలాల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో ప్రతిమ హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు.వేలాల గ్రామ ప్రజలకు సేవ చెయ్యాలని మంచి సంకల్పంతో గ్రామ సర్పంచ్ డేగ స్వప్న- నగేష్, ఉప సర్పంచ్ సుందిళ్ల రాజలింగు ఉచిత వైద్య శిబిరానికి శ్రీకారం చుట్టారు.ప్రతిమ హాస్పిటల్ వైద్య సిబ్బంది 300 వందల మందికి ఉచిత ఓపి చూసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.అలాగే ఉచిత పరీక్షలు నిమిత్తం 40 మందిని హాస్పటల్ కి రిఫర్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్,పంచాయతీ కార్యదర్శి,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.అలాగే ప్రతిమ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ కౌశిక్,మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జనగామ నాగరాజు,సంతోష్, సదానందం,హాస్పిటల్స్ డాక్టర్స్ పాల్గొని గ్రామ ప్రజలకు ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు.
