“రూ.90 కోట్లతో నర్సంపేట అభివృద్ధి”

రూ. 90 కోట్లతో నర్సంపేట పట్టణ అభివృద్ధి

త్వరలో ఎన్నికల హామీలను నెరవేర్చుతున్నాం

నర్సంపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

26 వ వార్డుతో పాటు పలు వార్డుల్లో ఎమ్మెల్యే ఇంటింటా ప్రచారం

వార్డు అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా…అభ్యర్థి గాజుల విమల రాము.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం కోసం అంతర్గత సిపి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణాల కోసం మరో రూ. 90 కోట్లతో నర్సంపేట పట్టణం అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభం కాదా మరికొన్ని పనులను మొదలుపెట్టనున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 26 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న గాజుల విమల రాము ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇందిరమ్మపాలనలో పట్టణానికి 5 వేల ఇండ్లు ఇచ్చనం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజా పాలన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వేలాది ఇండ్లను ఇచ్చి నిరుపేదలకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నాం. సాధారణ కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు,మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

మహిళలు నా ఆడబిడ్డలు అన్న కేసీఆర్.. ఆయన ప్రభుత్వంలో మహిళలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. నర్సంపేటలో 8600 మంది మహిళలకు 1.61 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం రూ. 90 కోట్లతో పనులు చేస్తున్నాం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంత కష్టమైన.. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో ఉన్న ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం క్రమేపీ హామీలు మెరవేర్చుతూ ముందుకు పోతున్నామని ఎమ్మెల్యే దొంతి వివరించారు. ఎన్నికల్లో ఇతర పార్టీలు చెప్పే మాటలకు మోసపోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను
గెలిపించుకోవాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలను కోరారు.

వార్డు అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా…

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 26వ వార్డు గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆ వార్డు కౌన్సిల్ అభ్యర్థి గాజుల విమల రాము వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే మా వార్డు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మూడు కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన ఓడిపోయిన ప్రజలే వెంటే ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్డు అభివృద్ధి కోసం మున్సిపాలిటీ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించాలని కౌన్సిల్ అభ్యర్థి గాజుల విమల రాము ఓటర్లను కోరారు.
ఈ ప్రచారంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మాజీ వార్డు కౌన్సిలర్ గాజుల రమేష్, వడ్డే కరాటే కుమార్, ఇన్చార్జిలు తోకల శ్రీనివాస్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,పెద్ది మైపాల్ రెడ్డి, గుడిపూడి అరుణ రామచందర్,బాబురావు పలువురు నాయకులు,వార్డు ప్రజలు,మహిళలు పాల్గొన్నారు.

బడంపేటలో 365 మందికి గృహ జ్యోతి సర్టిఫికెట్లు

బడంపేటలో 365 మందికి గృహ జ్యోతి సర్టిఫికెట్లు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేట గ్రామంలో బుధవారం సర్పంచ్ దయానంద్ పాటిల్ ఆధ్వర్యంలో 365 మంది లబ్ధిదారులకు గృహ జ్యోతి పథకం కింద సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మ్యాతరి ఏసప్ప, మొగులయ్య, బసవరాజ్, స్వామి, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గృహ జ్యోతి కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరింది.

గృహ జ్యోతి పథకం ప్రతి ఇంటికి లబ్ధి

గృహ జ్యోతి పథకం రెండేళ్లలో ప్రతి ఇంటికి లబ్ది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంక్రాంతి పండుగ ముందర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చేసిన మంచి పనిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నదని.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కింద వినియోగించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది. ఈ డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఝరాసంగం మండల కేంద్రంలో లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన లేఖలను లైన్మెన్లు కిరణ్, యూనూస్ అందజేశారు.

దిడిగి గ్రామంలో ఘనంగా గృహజ్యోతి కార్యక్రమం

ఘనంగా గృహజ్యోతి కార్యక్రమం దిడిగి గ్రామంలో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని దిడిగి గ్రామంలో
సర్పంచ్ జగదాంబ సోమప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ గృహజ్యోతి వంటి పథకాలు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప మాట్లాడుతూ దిడిగి గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామ మహిళలు స్వావలంబన సాధించే దిశగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version