హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన నూతన గ్రామ సర్పంచ్…

హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన నూతన గ్రామ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ హోలీ పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ ఆనందం, ఐక్యత, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోలీ మన జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు.సమాజంలో ప్రేమాభిమానాలు పెంపొందించే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.బిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ప్రజలతో కలిసి ప్రతి ఆనంద క్షణాన్ని పంచుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

వివేకానంద పాఠశాలలో సర్పంచ్‌కు సన్మానం

వివేకానంద పాఠశాలలో తుమ్మనపల్లి సర్పంచ్ కు సన్మానం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయి కోడ్ మండలం పరిధిలోని స్వామి వివేకానంద పాఠశాలలో తుమ్మనపల్లి సర్పంచ్ నాజీమా అంజూమ్ షేక్ సోహెల్ కు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరిగిన వేడుకల్లో ఘనంగా పూలమాలలు చాలువతో సనసన్మానించార.ఈ సందర్భంగా సర్పంచ్ స్వామి వివేకానంద పాఠశాల యాజమాన్యం కు ధన్యవాదాలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version