10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

నేటి ధాత్రి భద్రాద్రి జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ప్రధానోపాధ్యాయులు రవిలాదేవి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, చెడు అలవాట్లు కలిగి ఉండకూడదు అని, లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని, తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి అని, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. అనంతరం విద్యార్దులను ఉద్దేశించి గణిత ఉపాధ్యాయుడు నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థుల “భవిష్యత్తు” బాటకు తొలిమెట్టు పదవతరగతి అని, అత్యుత్తమ మార్కులను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరారు. ఉత్తమ ఫలితం అన్ని సబ్జెక్టులలో 80 శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుల నిమిత్తం ఐదువేల రూపాయల నగదును బహుమానంగా అందిస్తానని ఆయన వీడ్కోలు సభలో తెలిపారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించన తర్వాత విద్యార్థులకు హల్ టికెట్లతో పాటు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు అందించారు. వీడ్కోలు సభలో విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి, పిడి విద్యాసాగర్, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శంకర్, రామకృష్ణ, నాగేశ్వరావు, రత్నకుమారి పలువురు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version