గ్రామసభ నిర్వహణ…

గ్రామసభ నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో బుధవారం స్థానిక సర్పంచ్ మోడీ రవీందర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉన్నందున, నీటి సరఫరాపై తగు చర్యలు తీసుకుంటామని ప్రతి ఇంటికి సరిపడా నీటిని అందజేస్తామన్నారు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. ఇంకా దోమల నివారణ, చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులు అంతర్గత సిసి రోడ్లు, కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంబించామని తెలిపారు. సిబ్బందితో అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్న అదనంగా సిబ్బందిని పెట్టి పనులు కోన సాగిస్తున్నాం అని తెలిపారు. ఈకార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి సూర్య ప్రకాష్, ఉప సర్పంచ్ కట్ల రాములు, వార్డు సభ్యులు తడగొండ రాజు, పాదం ఉమ, పాదం రాజయ్య, పన్యాల విద్యా సాగర్, పెంచాల అంజయ్య, డా.మౌనిక, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు అధ్యక్షులు సులోచన, సీఏలు వనజ, రజిత, లైన్ మెన్ గాల్ రెడ్డి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ నగర్ తాగునీటి కష్టాలు తీర్చాలి: అధికారులకు ఆంజనేయులు సాగర్ వినతి…

రాజీవ్ నగర్ తాగునీటి కష్టాలు తీర్చాలి: అధికారులకు ఆంజనేయులు సాగర్ వినతి

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ డివిజన్ నాయకులు ఆంజనేయులు సాగర్ సోమవారం జలమండలి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. బస్తీలోని పలువురు నాయకులతో కలిసి ఆయన జనరల్ మేనేజర్ హరి శంకర్ గారిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు.
​ఈ సందర్భంగా ఆంజనేయులు సాగర్ మాట్లాడుతూ.. రాజీవ్ నగర్ బస్తీలో కొన్ని ఇళ్లు ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల తాగునీరు సరిగ్గా చేరడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నీటి సరఫరా అందక బస్తీ ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఎత్తైన ప్రాంతాలకు నీరు సక్రమంగా చేరడానికి ప్రత్యేకంగా బూస్టర్సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యే వరకు బస్తీ ప్రజల అవసరాల కోసం తాత్కాలికంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి. మోటార్‌ను ఏర్పాటు చేయాలి.జీఎం హరి శంకర్ సానుకూలంగా స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న సాగర్, నరసింహ, వెంకటేష్, రోహిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

వేసవి తాగునీటి కొరత: న్యాల్కల్ పంచాయతీ ముందస్తు చర్యలు…

వేసవి తాగునీటి కొరత: న్యాల్కల్ పంచాయతీ ముందస్తు చర్యలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ గ్రామపంచాయతీ రానున్న వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మల్గి మెకానిక్ కిష్టన్నలతో కలిసి గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ట్యాంకుల పనితీరును తనిఖీ చేసి, మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ట్యాంకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, లీకేజీలను నివారించి నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, వేసవిలో గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటిని సమృద్ధిగా అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. నీటిని వృథా చేయకుండా వినియోగించాలని గ్రామస్థులకు సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version