తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్లను సన్మానించిన సర్పంచ్ తౌటం లక్ష్మి.

తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్లను సన్మానించిన సర్పంచ్ తౌటం లక్ష్మి.

చిట్యాల,నేటిదాత్రి :

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంనికి నూతనంగా నియమితులైన *తహశీల్ధార్ *తూకుంట్ల వసంతరావును మరియు డిటి ముధవత్ అనిల్ ని శాలువా కప్పి మర్యాదగా కలిసిన స్థానిక సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య .ఈ సంధర్బంగా వారు మా గ్రామ పంచాయతీ తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. మరియు ప్రభుత్వ పథకాల అమలులో మీకు మా గ్రామ పంచాయతీ నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇస్తు,మీ పదవీకాలం విజయవంతంగా ఉండాలని, మీరు మంచి సేవలందించాలని కోరారు.వీరితో పాటు 4 వ వార్డు సభ్యుడు *తౌటం నవీన్ *కూడా పాల్గొన్నారు.

69 వ ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్రస్థాయిలో పాల్గొన్న సాయి చంద్ర.

69 వ ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్రస్థాయిలో పాల్గొన్న సాయి చంద్ర.

చిట్యాల, నేటిదాత్రి :

69వ స్కూల్ గేమ్స్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ విద్యార్థి 69వ ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్రస్థాయిలో లో జయశంకర్ జిల్లా నుండి ఉమ్మడి జిల్లా వరంగల్ అండర్ 17 కబడ్డీ జట్టు కి కెప్టెన్ వహిస్తూ అత్యున్నతమైన ఆటను ప్రదర్శిస్తూ జట్టుకి గెలుపు కోసం కృషి చేస్తూ ఆడినటువంటి క్రీడాకారుడు పాలిత సాయి చంద్ర కి స్టేట్ పార్టిసిపేషన్ మరియు మెరిట్ సర్టిఫికెట్స్అందజేసినటువంటిఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రెటరీ ఎల్ జైపాల్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ పిఈటి సంఘ రఘుపతి యాదవ్. తదితరులు.

సిబ్బందిని అకారణంగా తొలగించవద్దని డీపీవోకు వినతి

సిబ్బందిని అకారణంగా తొలగించద్దని డీ పి వో కు వినతి పత్రంఅందజేత.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

మంగళవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి కి జిల్లా లో ని గ్రామ పంచాయతీ లలో పనిచేస్తున్న సిబ్బంది ని ఆకరణంగా తొలగించవద్దని జిల్లా పంచాయతీ అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందుకు మేడం సానుకూలంగా స్పందించి ఆకరణంగా తొలగించవద్దని సర్క్యులర్ ఇప్పిస్తానని తెలడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంగం నాయకులు అనుసునూరి రాజావీరు, ముస్కె రమేష్, జాలిగాపు శ్రీకాంత్, కొత్త కొండ తిరుపతి, కంచెర్ల శంకర్, అంకం సదానందం, బాబు,జివి రావు, చిట్యాల శశి, దేవేందర్ పాల్గొన్నారు.

గొర్రెల మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలి.

గొర్రెల మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలి.

చిట్యాల, నేటిదాత్రి :

 

మంగళ వారం రోజున చిట్యాల మండలo లోని గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథు గా గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి – అంతులు , ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ పాల్గొని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఇట్టి నట్టల నివారణ కార్యక్రమాన్ని* చిట్యాల్ మండల గొర్రెల మరియు మేకల పెంపకం దారులు*సద్వినియోగం చేసుకోవాలని అన్నారు, అలాగే చిట్యాల ప్రాంతీయ* పశువైద్య శాల అసిస్టెంట్ డైరెక్టర్ జి వెంకన్న మాట్లాడుతూ నట్టల* నివారణ మందులు త్రాగిపించుకోవడం వలన గొర్రెలు మరియు మేకల లో నత్తలు నుంచి జీవాలు రక్షణ తో పాటు ఆరోగ్యముగా, అధిక బరువు పెరగడం జరుగుతుంది అని అన్నారు,, మండల పశు వైద్య అధికారి అజయ్ అప్పని, మాట్లాడుతూ చిట్యాల* మండలం లోని దాదాపు 2000 జీవాలకు నట్టల మందు ఇవ్వడం జరిగినది అని తెలిపారు అలాగే మండలం*లోని అన్ని గ్రామాలలోని గొర్రెల మరియు మేకల పెంపకం దారులు ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా* సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల* సర్పంచ్ తౌటం లక్ష్మి- అంతులు , ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ లతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి వెంకన్న, వెటర్నరీ సర్జన్ డాక్టర్ అజయ్ అప్పని లతో పాటు పశు వైద్య సహాయ సిబ్బంది కవిత , దివ్య , కరుణాకర్ , రాజేందర్ రెడ్డి* మరియు గొర్రెలు మరియు మేకల పెంపకం దారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version