యూరియా కోసం ఎండలో.. రైతులు
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం ఉదయం నుండి రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. 34 డిగ్రీల ఎండలోనూ నిలబడి యూరియా కోసం రైతులు ఎదురు చూశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఒక్కసారిగా వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకోవడంతో రోడ్డుపై భారీగా రద్దీ ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వివిధ ఆరుతడి పంటలు సాగు చేసి యూరియా దొరకకపోవడంతో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి సరిపడ యూరియా సరఫరా చేయాలని రైతులు కోరారు.