– యూరియ కోసం…
రైతుల తిప్పలు
నిజాంపేట: నేటి ధాత్రి
యూరియా కోసం రైతులు గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో శనివారం రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సుమారు 400 బ్యాగులో యూరియా గ్రామానికి సరఫరా చేసింది. విషయం తెలుసుకున్న రైతులు అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తగినంత యూరియా రైతులకు అందిస్తుందని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ నరసింహులు, ఏఈఓ శ్రీలత, గ్రామస్తులు ఉన్నారు.