నెక్కొండలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
అంబరాన్ని అంటిన 79స్వతంత్ర దినోత్సవ వేడుకలు
#నెక్కొండ ,నేటి ధాత్రి:
నెక్కొండ మండల వ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో పాటు పల్లె నుండి పట్నం దాకా ఘనంగా నిర్వహించారు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ వేముల రాజుకుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగరవేసి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హంస నరేందర్, రెవెన్యూ ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నెక్కొండ మార్కెట్ ఆవరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
నెక్కొండ మార్కెట్ లో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒకరికొకరు మిఠాయిలు పంచుతూ ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, బక్కి అశోక్, పెండ్యాల హరిప్రసాద్, రాచకొండ రఘు, ఈదునూరి సాయి కృష్ణ, బండి శివకుమార్, సింగం ప్రసాద్, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ ప్రాథమిక సొసైటీ ఆవరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
నెక్కొండ ప్రాథమిక సొసైటీ ఆవరణలో సొసైటీ చైర్మన్ మారం రాము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో సురేష్, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.