నిజాంపేటలో పర్యటించిన కేంద్ర బృందాలు
• కృంగిన బ్రిడ్జి, తెగిన రోడ్లను పరిశీలన
నిజాంపేట: నేటి ధాత్రి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంపేటలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం బుధవారం పరిశీలించారు. నందిగామ గ్రామ శివారులో 765 డీజీ రోడ్డు పై కృంగిన బ్రిడ్జి, నస్కల్ రోడ్డులో తెగిన బ్రిడ్జిలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాల అంచనా వేయడం జరుగుతుందన్నారు. వారితోపాటు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో రమాదేవి, మండల తాహాసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమాద్ తదితరులు ఉన్నారు.