ఖిలా వరంగల్ తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఇక్బాల్
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ మండల తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఇక్బాల్, ఖిలా వరంగల్ మండలానికి బదిలీ అయ్యారు. నేడు ఖిలా వరంగల్ తహసిల్దార్ గా మహమ్మద్ ఇక్బాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, ఆఫీస్ సిబ్బంది తహశీల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.