నిజాంపేటలో కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు

కోడ్ ఉల్లంఘిస్తే..
చర్యలు తప్పవు.
డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ.

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ను ఉల్లంఘిస్తే..చర్యలు తప్పవని డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ అన్నారు. నిజాంపేట లో ఎఫ్ఎస్టి బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా 50 వేలకు మించి డబ్బులను రవాణా చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శాయంపేటలో నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభం

*బుజ్జగింపులు..బేరసారాలు*

*నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ*

*గెలుపు గుర్రాలపై పార్టీల దృష్టి*

 

శాయంపేట నేటిధాత్రి;

 

శాయంపేట మండల కేంద్రంలో ఎన్నికల నామినేషన్ల ఉపసం హరణ కోసం బుజ్జగింపులు బెరసారాలు మొదలయ్యాయి గెలిచే అభ్యర్థులపై పార్టీలు దృష్టి పెట్టారు దీంతో బుజ్జగిం పులు బేరసారాలు కొనసాగు తున్నాయి మండలం మొత్తం మూడో విడత సర్పంచ్ స్థానా లకు మొత్తం 183 నామినే షన్లు, వార్డు స్థానాలకు 562 నామినేషన్లు అందాయి. ఉప సంహరణ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగియనుంది నేపథ్యంలో అన్ని పార్టీల్లో ఆందోళన మొదలైంది ప్రతి పార్టీ నుంచి ఆయా గ్రామాల్లో రెండు లేదా మూడు అభ్యర్థు లు బరిలో ఉన్నారు గ్రామస్థా యి కార్యకర్తలు ఎండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కోసం ఎదురుచూస్తున్నారు నామినే షన్ల పర్వం ముగియడానికి తక్కువ సమయం ఉంది కావు న సీనియర్లు బుజ్జగింపు పర్వా న్ని ముమ్మరం చేశారు. గెలుపు గుర్రాల పై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి.

ఎన్నికల ప్రచారానికి అనుమతి తప్పనిసరి .

ఎన్నికల ప్రచారాలకు..
అనుమతి తప్పనిసరి

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలకు అనుమతులు తీసుకోవాలని ఎస్ఐ రాజేష్ సూచించారు. నిజాంపేటలో మాట్లాడుతూ.. రెండు విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు మైక్ ద్వారా ప్రచారం చేయాలనుకునేవారు మీసేవ లో చలాన్ కట్టి, స్థానిక తహసిల్దార్ అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా ప్రచారం చేస్తే ఎన్నికల నిబంధన మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

నిజాంపేట గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోరు

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు..
నువ్వా! నేనా! అన్నట్టు అభ్యర్థుల ప్రచారాలు.
గ్రామాల్లో ఎన్నికల దావతులు..

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. నిజాంపేట మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాలు ఏకగ్రీవం కాగా మరికొన్ని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే గ్రామాల్లో ఎన్నడు లేని విధంగా సంబంధాలను కలుపుకుంటూ పలకరింపులు కొనసాగుతూ ఉన్నాయి. అభ్యర్థులు తమ అనుచరులతో ఉదయం నుండి మొదలుకొని రాత్రి వరకు గ్రామాల్లో ప్రచారాలు కొనసాగిస్తూ.. ఉన్నారు. మరి కొంతమంది కులాల కట్టుబడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. కొంతమంది అభ్యర్థులు పార్టీ పేరుతో ప్రజల ముందుకు వెళ్లి ఓటును ఆశిస్తున్నారు. అభ్యర్థులు తమ అనుచరులు తమ దాటి వెళ్లకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి దావత్ లతో గ్రామాలు మునిగిపోతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేది ఎవరు ? అనేది ఆసక్తిగా మొదలుకుంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా యువతనే పాల్గొంటున్నట్లు కూడా సమాచారం ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version