సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేయండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..

సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేయండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ పరికరం ఏర్పాటుకు చేపట్టిన పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు సమయానుకూలంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిటీ స్కాన్ పరికరం ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు పనుల్లో ఆలస్యం లేకుండా, సంబంధిత ఇంజినీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటుతో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆసుపత్రి పర్యవేక్షకులు డా నవీన్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా కురుమిళ్ళ శ్రీనివాస్..

నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా కురుమిళ్ళ శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

నాయి బ్రాహ్మణ సేవా సంఘం భూపాలపల్లి జిల్లా కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా భూపాలపల్లికి చెందిన కురుమిళ్ళ శ్రీనివాస్,మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శిగా నడిగోటి రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నడిగోటి రాము మాట్లాడుతూ జిల్లాలోని నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం దిశగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్, రాము, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు భూపాలపల్లి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి నూతన కమిటీ ఎన్నుకున్నట్లు వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అధ్యక్ష కార్యదర్శులు శాలువాలతో సన్మానించి స్వీట్ తినిపించి అభినందించారు. అలాగే మండలాల అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.

జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

జహీరాబాద్: జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు మాణిక్ రావు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామిని మర్యాదపూర్వకంగా బుధవారం కలిసారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మంత్రి వివేక్ వెంకట స్వామిని అభ్యర్థించారు.

బేడ బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్

బేడ బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వద్దని తసిల్దార్ కి వినతి పత్రం.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల తాసిల్దార్ కి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్న బాలసంత కాటిపాపల కులస్తులకు బేడ బుడగ జంగామాని తప్పుగా చెప్పి ఎస్సి కులం సర్టిఫికెట్ తీసుకుంటున్న వాటిని రద్దు చేయాలని సంబంధించిన జిల్లా మండల అధికారులకు తెలియజేయుచున్నాము .

 

బాలసంత కాటిపాపల కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వద్దాన్ని చల్లగరిగే ముసినిపర్తి,చిట్యాల గ్రామాల నుండి దళితులు వచ్చి తాసిల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఇతర కులాలకు చెందిన వారు మేమే బెడ బుడగ జంగం అని మాకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వమని ఎవరైన అప్లికేషన్ పెట్టిన కూడా వారు గతంలో ఏ పాఠశాలలో చదువుకున్నటువంటి అడ్మిషన్ రిజిస్టర్ను ఎంక్వయిరీ చేసి వారికి ఇవ్వగలనీ ఎందుకంటే వాళ్లు ఏదో సర్టిఫికెట్ పట్టుకొచ్చి మేము తీసుకొని దళితులకు అసలైన ఎస్సీ కులానికి చెందిన వాళ్లకు అన్యాయం జరుగుతున్నది ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు లబ్ది పొందడం కోసం మరియు రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం వాళ్ళు పోటీ చేయడం కోసము తయారవుతున్నందున వారికి జిల్లా కలెక్టర్ తో విచారణ జరిపించి ఇవ్వగలరు .

 

బాలసంత కాటిపాపల కులాలకు చెందినవారు బేడ బుడగజంగా వాని తాప్కా చెప్పుకుంటూ ఉన్నందున వారు గతంలో చదువుకున్నటువంటి పాఠశాలలో అడ్విజన్ రిజిస్టర్ లను తీసుకువచ్చి చిట్యాల తాసిల్దార్ కి చూపెట్టడం జరిగింది మేము మీ అన్నయ్య సాక్ష్యాలు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నాం గతంలో ఎలాంటి విచారణ లేకుండా తప్పుగా సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చెయ్యాలి లేనిచో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని దళిత సంఘాలైన మేము హెచ్చరిస్తున్నాము.

 

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య (ఎమ్మార్పీఎస్) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు జేరిపోతుల ఓదెలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దూడపాక సాంబయ్య డిఎస్పి నాయకులు పుల్ల అశోకు చల్లగరియా ముచి నీపర్తి గ్రామాల చెందిన దళిత సంఘాల నాయకులు సోమిడిరఘుపతి దూడపాక దివాకరు నోముల శివశంకరు సిరి పెళ్లి నరేష్ కొల్లూరి అశోకు దూడపక రాజు తదితరులు పాల్గొన్నారు.

మండలంలో యూరియా లభ్యత పర్యవేక్షణ

మండలంలో యూరియా లభ్యత పర్యవేక్షణ అదనపు కలెక్టర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ పి. అశోక్ కుమార్ గణపురం మండలాన్ని సందర్శించి యూరియా లభ్యత పంపిణీని తనిఖీ చేశారు. వారి తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు
జిల్లా సహకార అధికారి ఎం. వాల్య నాయక్
మండల వ్యవసాయ అధికారి డి. ఇలయ్య ఏ సి ఎస్ గణపురం సీఈఓ ఉన్నారు.

గోదాముల తనిఖీలో యూరియా నిల్వలు సరిపడుగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు 405 బస్తాల యూరియా అందుబాటులో ఉంది. పంపిణీ పి ఓ ఎస్ యంత్రం మరియు ఆధార్ ధృవీకరణతో పారదర్శకంగా జరుగుతోంది.రైతులు ఆందోళన చెందకండి, విధి ప్రకారం యూరియా పొందాలని అధికారులు సూచించారు. పంట సీజన్ కోసం సరైన సమయంలో ఎరువులు అందించేందుకు యంత్రాంగం కట్టుబడి ఉంది. సొసైటీ స్టాప్ రైతులు బాబురావు మూల సదయ్య రైతులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో..

రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సినారె జయంతి వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T152642.831.wav?_=1

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం ఆధ్వర్యంలో కవి, రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి 94వ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కవులు పుష్పాంజలి ఘటించడం జరిగినది. సిరిసిల్ల రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండ రవి మాట్లాడుతూ హనుమాజీ పేటలో జన్మించి, సాహిత్యపూల తోటలో విరబూసి ఆలిండియా కే గర్వకారణం తెచ్చిన సిరిసిల్ల ముద్దుబిడ్డ సినారే జ్ఞానపీఠం పురస్కారం తెచ్చిన మహాకవి అని తెలిపారు. అలాగే రచయితల సంఘం ఉపాధ్యక్షులు బూర దేవానందం సి.నారాయణ రెడ్డి పై కవిత గానం చేశారు. ఉపాధ్యక్షులు వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ సినారే సిరిసిల్లలో రాబోయే నూతన కవులకు ఒక దిక్సూచి అని తెలిపారు. అంతేకాకుండా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ సినారే సిరిసిల్లలో జన్మించడం మా సిరిసిల్ల కే గర్వకారణమని తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రముఖ కవులు ఎలాగొండ రవి, బుర దేవానందం, వెంగళ లక్ష్మణ్,చిటికెన కిరణ్ కుమార్ ఆడేపు లక్ష్మణ్,అంకారపు రవి, గుండెల్ని వంశీ, అల్లే రమేష్ కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షుడు సన్మానం..

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షుడు సన్మానం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T135154.882.wav?_=2

మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన నేరెళ్ల సుభాష్ గౌడ్ జగిత్యాల జిల్లా ఐ జే యు 143 ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా డబ్బా గ్రామంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, కాంగ్రెస్ యువ నాయకులు దేశెట్టి జీవన్, డబ్బా విడిసి చైర్మన్ జాన శంకర్, నేరెళ్ల సత్యం గౌడ్, గుండు రమేష్, గోపి రాజేందర్,ఇబ్రహీంపట్నం ఆర్ఎంపి మరియు పి.ఎం.పి సెక్రటరీ డాక్టర్ శ్రీధర్, కోటి అరుణ్, పాల్గొన్నారు

సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను..

సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు ముశం రమేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T130848.280.wav?_=3

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ము శం రమేష్ మాట్లాడుతూ ఈనెల 27వ తారీకు ఆదివారం రోజున సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో బీడీ అండ్, సిగార్ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఇట్టి మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమా రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి గార్లు హాజరవుతున్నారు
ఈ మహాసభలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎన్నికల సందర్భంగా 4000 పెన్షన్ అమలు చేస్తానని ఇప్పటికి కూడా అమలు చేయకుండా పోయింది
బీడీ కార్మికులను విపరీతంగా దోపిడీ చేస్తున్న కంపెనీ యజమానులపై ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడంతో బీడీ కంపెనీలో బీడీ కంపెనీ యజమాన్యం విపరీతమైన దోపిడీకి పాల్పడతా ఉంది ప్రతి కార్మికుల నుండి కంపెనీ యజమానులు 2000 కూలీని దోచుకుంటున్నారు అనేక రకాల పేర్లతో కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.పెద్ద మొత్తంలో బీడీల నుండి ఆదాయం వస్తున్న కూడా బీడీ కార్మికులకు పనికి తగ్గ వేతనం నిర్ణయించడం లేదు రాబోయే కాలంలో బీడీ కార్మికులందరికీ పిఎఫ్ తో సంబంధం లేకుండా నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలని కనీస వేతనం 1000 బీడీలకు 600 రూపాయలు చెల్లించాలని ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పీఎఫ్ అమలు చేయాలని 2000 బీడీల కోత విధించకుండా చేయాలని 26 రోజుల పని కల్పించాలని బీడీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నాణ్యమైన ఆకు తంబాకు అందించాలని ము శం రమేష్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్, చంద్ర జిందo కమలాకర్, దాసరి రూప, బేజిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ లీగల్ సెల్..

ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

గురువారం రోజున కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు జి. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా కేక్ కట్ చేసి న్యాయవాద మిత్రులకు స్వీట్స్ పంపిణి చేసారు. ఇట్టి కార్యక్రమంలొ బిఆర్ఎస్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శివరాజ్, మరియు సీనియర్ న్యాయవాదులు సహోదర్ రెడ్డి, వద్ది రాజ్ గణేష్, జనార్దన్ గౌడ్, శ్యామసుందర్ రావు,రంజిత, వెంకటేశ్వర్ రావు, శ్రీరామ్, కిరణ్, వేణు పటేల్, రవి, ఎస్.అరుణ, ప్రవీణ్ తది తరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో భారీ వర్షం.

జహీరాబాద్ లో భారీ వర్షం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో గత రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. దీనివల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక వర్షాల వల్ల ఇండ్లలోకి నీరు సైతం వస్తున్నాయి. అంతేగాక రోజువారి పనులు చేసుకునే వారికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఉద్యోగస్తులు సైతం సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఎక్కువ శాతం పాఠశాలలు సెలవులను ప్రకటించాయి. ఈ వర్షాకాలం సీజన్లో ఇంత భారీ వానలు పడడం ఇదే మొదటిసారి. ఈ భారీ వర్షాల్లో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటించాలి.

సోషల్‌ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా..

సోషల్‌ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేల సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే జైలు శిక్షలు తప్పవు.

జిల్లాలో సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ (SOCIAL MEDIA TRACKING CELL) ఏర్పాటు:జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సామాజిక మాధ్యమాల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేల,ఒక వర్గాన్ని,పార్టీని టార్గెట్ గా చేసుకొని పోస్టులు పెట్టె వారిపై,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారిపై,ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టె వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక మధ్యమల్లో
(ట్విటర్‌,ఫేస్‌బుక్‌,వాట్సాప్‌,ఇతర సోషల్‌ మీడియా..)వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని,సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ విభాగం(“SOCIAL MEDIA TRACKING CELL”)ప్రతి పోస్టును నిశితంగా పరిశీలించడం జరుగుతుందని,జిల్లాలో సోషల్ మీడియా విభాగం ద్వారా సోషల్ మీడియా పోస్టులపై 24*7 నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని ఈసందర్భంగా హెచ్చరించారు.
సామాజిక మధ్యమల్లో మతవిద్వేషాలు,ఒక వర్గాన్ని,పార్టీని టార్గెట్ గా,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై,వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారి సమాచారం సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ 8712537826 నంబర్ కి మెసేజ్ రూపంలో పంపగలరు.

మహిళల గోరింటాకు సంబరాలు..

మహిళల గోరింటాకు సంబరాలు..

నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ)
ఆర్యవైశ్య మహాసభ హనుమకొండ జిల్లా కమిటీ, జిల్లా మహిళా కమిటీ,వాసవి క్లబ్ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద గల టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన “ఆషాఢ గోరింటాకు సంబరాలు”కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వైశ్య సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమమూలో పాల్గొన్న
మహిళా సోదరమణులు సామూహికంగా ఒకరి చేతికి ఒకరు మైదాకు పెట్టుకుని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమ ప్రారంభ సూచకంగా మహిళలు వైశ్యుల కులదేవత, ఆరాధ్య దైవం, వాసవి మాత చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళలు తంబోలా తదితర కాలక్షేప కార్యక్రమాలు నిర్వహించుకుని, గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి హన్మకొండ జిల్లా ఆర్యవైశ్య మహసభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట సురేష్, దొడ్డ మోహన్ రావు మాట్లాడుతూ భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లాలోని మహిళా సోదరీమణులు ఆషాడ మాస గోరింటాకు కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయడం పట్ల సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకు వచ్చిన జిల్లా మహిళా కమిటీనీ వారు ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తులో జిల్లా మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా అధ్యక్షులు తోట సురేష్, ప్రధాన కార్యదర్శి దొడ్డ మోహన్ రావు, కార్య నిర్వాహక అధ్యక్షుడు వెనిశెట్టి రఘు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుకొనీశెట్టి మునిందర్,చకిలం రాజేశ్వర్ రావు,పబ్బతి నాగభూషణం, ఆవోప హన్మకొండ జిల్లా కోశాధికారి గంప సతీష్ వెలగందుల శ్రీధర్, శ్రీనివాస్,లక్ష్మణ్ కాంత్, జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు పడకండి జ్యోతి, ఉపాధ్యక్షురాలు దొడ్డ దేవి, కోశాధికారి అయిత పద్మజ, దోమకుంట్ల వాణి,తోట సంధ్య ,పబ్బతి సునీత,శ్రీరామ్ జయలక్ష్మి,భారతి,అన్నపూర్ణ లతో పాటు సుమారు నూట యాభై మంది మహిళలు పాల్గొన్నారు.

జర్నలిస్టులపై ఎమ్మెల్యే మాటలను ఖండిస్తు.

జర్నలిస్టులపై ఎమ్మెల్యే మాటలను ఖండిస్తున్నా

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జర్నలిస్టు సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్లో లో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ…
  భూపాలపల్లి నియోజకవర్గం లో రాజకీయ నాయకులకు , అధికారులకంటే భిన్నంగా ఎటువంటి ఆశ ఆశయాలు లేకుండా వేతనాలు లేకుండా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకుపోతున్న పత్రిక ,మీడియా సోదరులపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడిన మాటలను నేను తీవ్రంగా ఖండిస్తూన్న .ఈరోజు మీరు అధికారంలోకి రావడానికి అదే అవమానించబడ్డ మీడియా కారణమని మీకు తెలియజేస్తన్నా జర్నలిస్టు సోదరులు లేకుంటే మీరు చేసిన ప్రోగ్రాములు మీరు చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేవా అని అడుగుతా ఉన్నా మరి ఏ ఆశ లేకుండా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వానైనా ఎండైనా ఏ సమయంలోనైనా వెనకకుంట జనకకుండా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను అధికారుల దృష్టిలకు నాయకుల దృష్టికి తీసుకువచ్చి అట్టి సమస్యలను పరిష్కార దిశగా ఈరోజు జర్నలిస్ట్ సోదరులు చేస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యే పదవి కంటే ఎక్కువ సేవ ఈరోజు మీడియా సోదరులు చేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే
గండ్ల సత్యనారాయణ రావు జర్నలిస్టు సోదరులకు బహిరంగ క్షమాపణ  చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి బొజ్జాపెల్లి మహర్షి,రేణుకుంట్ల అరవింద్, బచ్చల చిరంజీవి,గుర్రం నాగరాజ్ లు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక..

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక

పలమనేరు(నేటి ధాత్రి) జూలై 21:

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ను వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురు ప్రసాద్, ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులుగా పలమనేరుకు చెందిన కత్తి శ్రీనివాసులు అధ్యక్షులు గా కే నాగరాజు విజయకుమార్, ప్రధాన కార్యదర్శిగా కె, శివ కుమార్ కార్యదర్శి వి రమేష్ ట్రెజరర్ శ్రీనివాసులు ఈసీ మెంబర్స్ ఏకనాథ్, పి రమేష్, గిరిబాబు,ఆర్ కృష్ణప్ప, సి మురగయ్య ను ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురు ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా దళితులపై జరుగుతున్న దాడులు, దళితుల హక్కుల పట్ల నిర్లక్ష్య వైఖరి పై పటిష్టమైన అవగాహన కలిగి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఈ కమిటీలో ఎంపిక చేయడం జరిగిందని రాబోవు రోజుల్లో చిత్తూరు జిల్లా లో ఎక్కడ దళితులపై దాడులు జరిగిన వారి హక్కులను కలరాల్సిన తక్షణమే ఈ కమిటీ ఆధ్వర్యంలో వారికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళుతుందని తెలిపారు అధ్యక్షులుగా ఎన్నికైన కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తూ దళిత వివక్షతను అదేవిధంగా వారి హక్కులను భంగం కలిగించే ఎక్కడైనా సరే ఈ కమిటీ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు, అతి త్వరలో పలమనేరు లో భారీగా సభ ఏర్పాటు చేసి దళిత హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు కార్యక్రమం చేస్తామని కూడా ఆయన తెలిపారు..

పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన..

పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన జిల్లా కలెక్టర్

జిల్లాలో మొత్తం 14 వేల నూతన రేషన్ కార్డుల పంపిణీ

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని లబ్ధిదారులకు చంద్రంపేట రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ
అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

Collector Sandeep Kumar Jha

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.సిరిసిల్ల పట్టణంలోని అర్హులైన 2610 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో మొత్తం 4527 మందిని అదనంగా చేర్చామని వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 21 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అవుతున్నాయని తెలిపారు.రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ అని, ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
జిల్లాలో నూతనంగా 14 వేల లబ్దిదారులకు రేషన్  అందించేందుకు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా కార్డు రాని వారు ఉంటే సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Collector Sandeep Kumar Jha

కార్యక్రమంలో కే కే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎం సివిల్ సప్లై రజిత, లబ్ధిదారులు, సంబంధిత  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి పద్యపఠన పోటీలకు లేఖన ఎంపిక..

జిల్లాస్థాయి పద్యపఠన పోటీలకు లేఖన ఎంపిక

అభినందించిన ప్రధానోపాధ్యాయులు స్వరూప.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-61.wav?_=4

నర్సంపేట,నేటిధాత్రి:

దాశరథి కృష్ణమచార్యా శత జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయి పద్యపఠన పోటీలకు నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో గల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఇజ్జగిరి లేఖన ఎంపికయ్యింది.ఈసందర్భంగా విద్యార్థిని ఇజ్జగిరి లేఖనను పాఠశాలల
ప్రధానోపాధ్యాయులు స్వరూప అభినందించారు. హెచ్ఎం మాట్లాడుతూ నర్సంపేట మండలంలో మొత్తం 54 మంది విద్యార్థులు పాల్గొనగా కేవలం 4 విద్యార్థులు ఎంపిక అయ్యారన్నారు.అందులో భాగంగా తమ పాఠశాల విద్యార్థిని లేఖన ఎంపిక అయ్యిందని పేర్కొన్నారు.లేఖన ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణం అని ప్రధానోపాధ్యాయులు స్వరూప ఆనందం వెళ్లుబుచ్చారు. అనంతరం లేఖనను సన్మానించి ప్రధానోపాద్యాయురాలు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని.!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించాలి.

బిజెపిరాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనీ చిట్యాల మండలంలో జుకల్ గ్రామంలోని బిఎన్ అర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి స్థానిక సంస్థ ల ఎన్నికల కార్యాశాల నిర్వహించడం జరిగింది ,ఈ సమావేశంనీ కి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు జిల్లా ప్రబారి గల్ల సత్యనారాయణ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల బలం ఉన్న పార్టీ బీజేపీ. వారి కష్టం ఎప్పుడూ మర్చిపోము.మోడీ సర్కార్ మూడు నెలల రేషన్ బియ్యం ఇచ్చింది – రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మోసం చేసింది.దేశంలో మతం పేరుమీద ఓట్లు అడిగిన పార్టీ కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఎవ్వరు ఎంత ఉంటే అన్ని పదవులు ఇవ్వాలని అంటున్నారు.”
రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఎంత మంది బీసీలు ఉన్నారు? కుల గణన ప్రకారం కనీసం 8 మంత్రిత్వ పదవులు రావాలి.”
మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు – ఆ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. కాని కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు.”ఏ రాజ్యాంగం ప్రకారం మైనార్టీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు”ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలు ప్రధాని మోడీకి అత్యుత్తమ పురస్కారాలు ఇచ్చాయి.గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న గారు చదువు రామచంద్రారెడ్డి గారు పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి రాష్ట్ర నాయకులు బట్టు రవి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేశు గౌడ్ మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు స్థానిక సంస్థల ప్రబారీలు కన్వీనర్లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

నూతన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన కోయిల క్రాంతి..

నూతన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన కోయిల క్రాంతి

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-45.wav?_=5

జయశంకర్ భూపాలపల్లి నూతనంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా నియమితులైన కోట రాజబాబు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ఉమ్మడి రేగొండ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోయిల క్రాంతి కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

జిల్లా వైద్యాధికారి పి.హెచ్.సి అధికారులతో సమీక్ష.

జిల్లా వైద్యాధికారి పి.హెచ్.సి అధికారులతో సమీక్ష

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత రాజన్న సిరిసిల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో సమీక్షా సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయడమైనది. ఈ సమీక్ష సమావేశంలో క్షయ వ్యాధి నివారణలో ఆశలు ఇంటింటి సర్వే ద్వారా రెండు వారాలకు మించి దగ్గు తెమడ బాధపడుతున్న వారిని గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలకు పంపవలసిందిగా మరియు ఆరోగ్య మహిళ స్క్రీనింగ్ పరీక్షలకు ఆశలు ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్ర పరిధిలో గల మహిళలను రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, నోటి క్యాన్సర్ల పరీక్షల కొరకై ఆరోగ్య మహిళా క్లినిక్ యందు పరీక్షలు చేయించవలసిందిగా సూచిస్తూ, మలేరియా డెంగ్యూ జ్వరాల నివారణ డ్రై డే కార్యక్రమంను పగడ్బందీగా నిర్వహించవలసిందిగా సూచిస్తూ ఆరోగ్య కేంద్ర పథకాలపై సమీక్షించినారు.
ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్. సంపత్ కుమార్, పోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అనిత, డాక్టర్ రామకృష్ణ గార్లు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు పాల్గొన్నారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుధ్య పనులు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుధ్య పనులు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించడం ఘనంగా జరుగుతుంది,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తుంది దానిలో భాగంగానే పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పతకాలు , మహిళల సాధికారిక అనేక అంశాలపై ప్రసంగిస్తారు, ఆమెతోపాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు , రాష్ట్ర నాయకులు మరియు జిల్లా అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో మండలంలోని వీధులు మెయిన్ రోడ్లు వెంబడి చెత్తాచెదారం లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ గ్రామ పంచాయతీ సిబ్బందితో రెండు రోజుల నుంచి పనులు మమ్మురంగా జరుగుతున్నాయి దీనికి మండలంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మినిస్టర్ ప్రోగ్రాం ఉండడం వల్ల మండల కేంద్రం క్లీన్ అండ్ గ్రీన్ గా పిచ్చి మొక్క లేకుండా రోడ్లన్నీ శుభ్రంగా తయారవుతున్నాయని , ఏది ఏమైనా శుక్రవారం రోజు జరిగే మహిళా శక్తి సంబరాలకు మినిస్టర్ తో పాటు జిల్లా అధికారులు రావడం వల్లనే మా గ్రామంలోని వీధులు రోడ్లు శుభ్రంగా ఉన్నాయని, గ్రామపంచాయతీ సిబ్బంది వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్య పనులను నిర్వహించడం పట్ల మండల ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version