ప్రజావాణిలో ఐదుగురి సమస్యలు, తహసిల్దార్ హామీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రతీ సోమవారం ఝరాసంగం మండల కేంద్రంలోని తహసీల్దార్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. తహసిల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కార్యక్రమంలో ఐదుగురు తమ సమస్యలను విన్నవించారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ తిరుమల రావు హామీ ఇచ్చారు.అధికారులు
ఎంపిడిఓ మంజుల డిప్యూటీ ఎమ్మార్వో కరుణాకర్ రావు వ్యవసాయ అధికారి వెంకటేశం, ఆర్ఐ రామారావు, స్పెషల్ ఆఫీసర్, పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి, హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.