ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ..

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ

ఈవీఎంలను పరిశీలించిన సీఈఓ సుదర్శన్ రెడ్డి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల గోడౌన్ ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసేందుకు ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి సీఈఓ సుదర్శన్ రెడ్డి చేరుకోగా, జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఈఓ.. ఇంచార్జి కలెక్టర్ తో పలు అంశాలపై చర్చించారు. అక్కడి నుంచి సీ ఈ ఓ నేరుగా సర్దాపూర్ లోని ఈవీఎం గోడౌన్, ఈవీఎంలను ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.

కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేష్ కుమార్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాంలో కఠిన భద్రత

ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి: 

 

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల ఈ వి ఎం గోదామును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య,గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాము వద్ద పోలీసు సిబ్బంది సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు చేపట్టడంతో పాటు 24 గంటలు సి.సి. కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. భద్రత సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలుపుతూ పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version