వందేమాతరం గేయం 150 సంవత్సరాలు అయినా సందర్భంగా గేయాలపన
హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జాతీయ కవి, రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 ఏండ్లు అయిన సందర్భంగా వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించాడం జరిగినది. వందేమాతరం గేయాలపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.
, ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశ సమగ్రతను, శౌర్య పరక్రమానికి సాహిత్యనికి, వందేమాతరం ఒక అద్భుత రచన గేయం అలాంటి గేయం మన దేశంలో బకించంద్ర చటర్జీ రాసి మనందరికీ అందించడం వందేమాతర గేయం ఇప్పటికీ 150 సంవత్సరాలు ఆయన సందర్భంగా మనమందరం గేయ ఆలాపన చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇన్స్పెక్టర్ లు రవి, నాగేశ్వరరావు , మధుకర్, ఆర్.ఐ లు రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు కిరణ్ కుమార్, క్రాంతి కుమార్, రాజు,సాయి కిరణ్,జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బంది హాజరై గేయా లాపన చేశారు..
