ప్రత్యక్ష అనుభవంతో విద్యార్థులకు మేలు…

ప్రత్యక్ష అనుభవంతో విద్యార్థులకు మేలు

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

పీఎంశ్రీ కింద టైడ్స్ కు ఎక్స్ పోజర్ విజిట్

ట్రాఫిక్ రూల్స్, వాహనాలు, డ్రైవింగ్ శిక్షణ తదితర అంశాలపై అవగాహన

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

ప్రత్యక్ష అనుభవం విద్యార్థులకు భవిష్యత్ జీవితానికి ఎంతో మేలు చేస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. పీఎంశ్రీ కింద తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రైవింగ్ స్కిల్స్ (టైడ్స్) కు ఎక్స్ పోజర్ విజిట్ కార్యక్రమాన్ని శుక్రవారం సిరిసిల్ల గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 6వ తరగతి విద్యార్థులకు నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. ప్రత్యక్ష అనుభవం విద్యార్థులకు జీవితాంతం గుర్తు ఉంటుందని వివరించారు.

ఈ సందర్భంగా టైడ్స్ లో వివిధ రకాల వాహనాలు, రెండు, నాలుగు వరుసల రహదారులు, సిమ్యులేటర్ వాహనాలపై లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్, వాహనాల, విడిభాగాల పనితీరు, ట్రాఫిక్ నిబంధనలు, డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్న తీరును విద్యార్థులు నేరుగా చూసి ఎంతో అనుభూతి చెందారు. తమకు వచ్చిన సందేహాలను టైడ్స్ నిర్వాహకులతో అడిగి తెలుసుకున్నారు.

పరిశీలనలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, కో ఆర్డినేటర్లు శైలజ, పద్మజ, వెంకన్న, పాఠశాల హెచ్ఎం శారద, టైడ్స్ బాధ్యులు దురై మురుగన్ తదితరులు ఉన్నారు.

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ..

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ

ఈవీఎంలను పరిశీలించిన సీఈఓ సుదర్శన్ రెడ్డి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల గోడౌన్ ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసేందుకు ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి సీఈఓ సుదర్శన్ రెడ్డి చేరుకోగా, జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఈఓ.. ఇంచార్జి కలెక్టర్ తో పలు అంశాలపై చర్చించారు. అక్కడి నుంచి సీ ఈ ఓ నేరుగా సర్దాపూర్ లోని ఈవీఎం గోడౌన్, ఈవీఎంలను ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.

కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేష్ కుమార్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version