ప్రజాకవి కాళోజీకి కలెక్టర్ ఘన నివాళులు
కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
ప్రజాకవి పద్మవిభూషన్
కాళోజీకి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఘన నివాళులు అర్పించారు.పద్మవిభూషన్
కాళోజీ నారాయణరావు 111వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చేసిన సేవలను,దమన నీతికి, నిరంకుశత్వానికి,అరాచక పాలనకు వ్యతిరేకంగా కాళోజీ తన కలం ఎత్తాడు. స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు.అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించిందని కలెక్టర్ పేర్కొన్నారు. వరంగల్ లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టిన ప్రభుత్వం.. హన్మకొండ నగరంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ జంక్షన్ లో..
ప్రజాకవి కాళోజీ 111వ జయంతి ఉత్సవాన్ని (తెలంగాణ తెలుగు భాష దినోత్సవం) పురస్కరించుకుని మంగళవారం హనుమకొండ కాళోజీ జంక్షన్ లో గల ఆ మహనీయుని నిలువెత్తు విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూలమాల వేసి నివాళులు అర్పించారు