సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం

సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం
– సిరిసిల్ల బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

బాలల దినోత్సవం పురస్కరించుకొని శాంతినగర్ లో పోకల భవాని, బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సరయు హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ టి. రవళి మరియు డాక్టర్ టి. సాయికుమార్ పర్యవేక్షణలో శుక్రవారం శాంతినగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహిళలకు మరియు పిల్లలకు వైద్య పరీక్షలు చేసి తగు మందుల పంపిణీ జరిగినది..
బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఇట్టి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది అలాగే మహిళలందరికీ వైద్య పరీక్షలు చేసి తగు మందులు అందించడం జరిగినది తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ టి. రవళి, డాక్టర్ టి సాయికుమార్ కు కృతజ్ఞతలు అలాగే ఇట్టి కార్యక్రమంలో పాలుపంచుకున్న శాంతినగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.. ఇట్టి కార్యక్రమంలో అడప సంతోష్, వడ్నాల శేఖర్ బాబు, వెలిశాల అభినయ్, కొంపెల్లి విజయ్, రామారావు, సోమిశెట్టి పూజిత, చోడబోయిన కౌసల్య, కమటం మంజుల, చెవిటి మల్లీశ్వరి, సువర్ణ, సౌజన్య, రూప, మహిళా బృంద సభ్యులు పాల్గొన్నారు.

క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ…

క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ

 

మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.

విజయవాడ, అక్టోబర్ 31: ఇన్నర్ వీల్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు (MLA Bonda Uma Maheshwar Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు ప్రపంచం మొత్తం క్యాన్సర్‌ని జయించటం కోసం పోరాడుతోందన్నారు. క్యాన్సర్‌ని జయించాలంటే, మొట్టమొదటి పరిస్థితుల్లోనే దాన్ని డయాగ్నెస్ చేస్తే చాలా వరకు క్యూరైపోయే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్‌మెంట్‌తో అనేక క్యాన్సర్లకి మందులు, వ్యాక్సిన్ కూడా వచ్చాయని.. దీన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బెస్ట్ క్యాన్సర్‌తో పాటు సర్వైవల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే సీఎం చంద్రబాబు (CM Chandrababu) కల అని స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు. ఇన్నర్‌విల్ క్లబ్ వంటి సంస్థలు ఈ దిశగా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. వారు కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. ఉచిత స్క్రీనింగ్ టెస్ట్‌లను కూడా అందిస్తున్నారని తెలియజేశారు.
ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఎంతో సహాయపడుతుందన్నారు. ఆడపిల్లలు, యువత తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వంటివి చాలా ముఖ్యమన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version