ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )న్యూస్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్ డీవైఎస్ఓ రామ్ దాస్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత కలెక్టరేట్ ఏవో రామిరెడ్డి, అన్సర్ ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
సిరిసిల్లలో శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
వినాయక నిమజ్జన స్థలం వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర సౌకర్యాల విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాలు వచ్చే, వెళ్లే దారిలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, స్టేజ్, కూర్చునేందుకు కుర్చీలు వేయించాలని, క్రేన్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఆయా శాఖల అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాధికారి (co-ed) శ్రీనివాస్ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టడం జరిగినది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గదుల పరిశీలన మరియు సైన్స్ ల్యాబ్లు, విద్యార్థుల మేధాశక్తి గురించి, పాఠ్యాంశాల గురించి, మరియు విద్యార్థుల హాజరుశాతం పెంచాలని,అధ్యాపకులను ఉద్దేశిస్తూ మారుతున్న టెక్నాలజీ నేర్చుకొని విద్యార్థులకు విద్యాబోధన చేయాలని వారు కోరారు.ఎంసెట్ జేఈఈ ఎంట్రన్స్ లకు సంబంధించిన తరగతులను “ఫిజిక్స్ వాలా” నిర్వహిస్తున్నారని వాటి లో పాఠాలు విని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.. ఈ సంవత్సరం కళాశాలలో ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని అధ్యాపకులను, విద్యార్థులను కోరారు.
అలాగే పరిశీలన చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కష్టపడితేనే విజయం తప్పనిసరి తమ వెంట ఉంటుందని సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ రఘునందన్, తెలుగు అధ్యాపకులు వివేకానంద, మరియు తదితర అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన ప్రజల సమస్యలు తెలుసుకున్న మెదక్ ఎంపీ మాధవిని రఘునందన్ రావు..
రామాయంపేట ఆగస్ట్ 28 నేటి ధాత్రి (మెదక్)
ఈ రోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవిని రఘునందన్ రావు రామాయంపేట పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను కూడా వివరాలు అడిగి తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున సహాయం అందించడానికి తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పట్టణంలో నీటి పారుదల సమస్యలు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్శన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శిలం అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బాలరాజ్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, జిల్లా నాయకులు వెలుముల సీద్దరాములు, శంకర్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం ప్రశాంత్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు జొన్నల భరత్, భాసం అనిల్, కడెం సిద్ధార్థ, లావణ్య, కటిక కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు వాగు లోని గంగమ్మ దేవాలయం వరకు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహానికి సిరిసిల్ల గంగ పుత్రులు ప్రత్యేకంగా గంగమ్మకు శాంతి చేకూరాలని బోనాలతో మరియు అమ్మవారి విగ్రహ పల్లకి సేవతో ఊరేగింపుగా బయలుదేరి మానేరు గంగమ్మ నీటిలో ప్రత్యేక కుంకుమ పూజలు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణకు సంబంధించిన గంగపుత్రులు మరియు పరిసర గ్రామాల గంగపుత్రులు అంగరంగ వైభవంగా వెళ్లి మానేరు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని ఈరోజు జాతీయ గృహ ప్రయాణాలపై ఎన్.ఎస్.ఓ సర్వేజాతీయ గణాంక పథకాల అమల్లో భాగంగా దేశీయ పర్యటక వ్యయం జాతీయ గృహప్రయాణాలపై అధికారులు , బుధవారం సర్వే నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో దేశీయ పర్యాటక వ్యయం నిర్వహించే సర్వేతో పర్యటన వేయ సమాచారం ఆధారంగా వస్తువులు సేవలను కొలిచేందుకు సాటిలైట్ అకౌంట్ తెరిచి ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ రూపొందించి పర్యాటక మంత్రిత్వ శాఖకు అందిస్తామని జాతీయ గణాంక శాఖ అధికారి,కరీంనగర్ హెడ్ ఆఫ్ ఆఫీస్ కార్యాలయ అధిపతి గోవర్ధన శ్రీనివాసరావు తెలిపారు దేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న జాతీయ గృహప్రయాణ సర్వేతో ప్రజా రవాణా వినియోగంపై పూర్తి సమాచారం లభించేలా ప్రజల ప్రయాణ ప్రవర్తన పై సమాచారం సేకరించి రైల్వే మంత్రి శాఖకు అనుకూలంగా మౌలిక సదుపాయాల ప్రణాళిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికై నిజమైన డిస్టినేషన్ మాట్రిక్స్ ను రూపొందిస్తామని సేకరించిన కుటుంబ సమాచారాన్ని ఎక్కడ బహిర్గతం చేయకుండా అభివృద్ధి ప్రణాళిక విధాన నిర్మాణానికి ఎన్ఎస్ఓ ఉపయోగిస్తారని తప్పుడు సమాచారంతో ప్రభుత్వ పాలనలో తప్పిదాలకు దారి తీస్తాయాని కాబట్టి ప్రజలు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని గోవర్ధన శ్రీనివాసరావు కరీంనగర్ హెడ్ ఆఫ్ ఆఫీస్ కార్యాలయ అధిపతి కోరారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎండి కాదిర్ పాష మున్సిపల్ మేనేజర్ రామ్మోహన్ రాయ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాయి కృష్ణ ఎం.పీ.ఎస్.ఓ ఎమ్మార్వో, ఎంపీడీవో, జాతీయ గణాంక శాఖ అధికారులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, రావి కంటి వెంకటేష్, ముక్కు కృష్ణారెడ్డి,మరియు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ మున్సిపల్ బిల్ కలెక్టర్లు మెప్మా సెక్షన్ ఆర్పీలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ధర తగ్గించాలి
సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు తెలంగాణ బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం యూనియన్ అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు గారి అధ్యక్షతన బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవన్ లో జరిగింది ఇట్టి సమావేశంలో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక , మొరం ,మట్టి కొరత మరియు భాను నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం అప్పజెప్పడం ద్వారా భువన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు జరిగే నష్టాలను చర్చించి జిల్లాలో స్థానిక సమస్యలపై ఆగస్టు 25వ తేదీ సోమవారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగినది.ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మండ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక మొరం మట్టి కొరత వలన నిర్మాణ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతోపాటు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రభుత్వము ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని దీనివలన జిల్లాలో భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు.జిల్లాలో స్థానికంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీ సోమవారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులు అదేవిధంగా నిర్మాణరంగంలో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇట్టి సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాపేల్లి రమేష్ , కోల శ్రీనివాస్ , ఈసంపేల్లి రాజెలయ్య , గుంటుక నరేందర్ , సావన పెల్లి ప్రభాకర్ , భూక్య వెంకట్ , దేవయ్య , శంకర్ , చంద్రయ్య , మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల తెలంగాణ భవన్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకల సందర్బంగా సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ భవన్ లో బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ తెలంగాణలో బహుజన వీరుడు, ప్రజానాయకుడు సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జన్మదిన సందర్భంగా ఆయన చేసిన కృషి పేదల అండ దండగా ఉంటూ జమీందారులను సైతం మట్టి కల్పించిన మహావీరుడు మన సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. అంతే కాకుండా ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కన్వీనర్ చీటీ నర్సింగరావు, సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్నం కళా చక్రపాణి, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, బి.ఆర్.ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, కోడి అంతయ్య, కుంభాల మల్ రెడ్డి తదితర బి.ఆర్.ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సిరిసిల్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకల సందర్బంగా సిరిసిల్ల పట్టణంలో ని బైపాస్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గౌడ్ సంఘం నాయకులు తీగల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలిరాజు,బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు,దొరల అరాచకాలను,మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారమని అన్ని పార్టీలు దీనికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణానికి చెందిన కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్ ఒకవైపు రక్షక భటుడిగా,మరొకవైపు రచయితగా ఎదుగుతూ అనేకమైన అంశాలపై సాహిత్యంలో పెన్నును,గన్నుగా చేస్తూ రానిస్తున్నటువంటి సాయి మహేష్ సమాజంలో జరిగే అంశాలను తన లోతుల వైపు చూస్తూ గన్నును పెన్నుగా మారుస్తూ సమాజ శ్రేయస్సుకు వివిధ అంశాలతో కూడిన కవిత్వాన్ని క్రూడీకరించి విశ్లేషించి అనేక అంశాలను కవితలుగా మార్చి సమాజాన్ని తట్టు లేపుతున్నటువంటి ముడారి సాయి మహేష్ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సభ్యులు గా మరియు అనేక అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి ముడారి సాయి మహేష్. అంతేకాకుండా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పథకం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ చేతులమీదుగా,,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే చేతుల మీదుగా అందుకోవడం విశేషం. అలాగే జిల్లా కవులు రచయితలు, రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, బురదేవానందం,అంకారపు రవి ,గుండెల్ని వంశీ కృష్ణ, మొదలైన సాహితీ మిత్రులు అభినందించారు.
సిరిసిల్ల జిల్లా కవులు,రచయితల సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలాగొండ రవి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యo వచ్చి 79 సంవత్సరాలు అయిన సందర్భంగా జిల్లా కవులకు మరియు రచయితలకు శుభాకాంక్షలు తెలపడం జరిగినది అంతేకాకుండా. మాజీ సిరిసిల్ల జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కవులు,రచయితలు, కళాకారులు దేశ సర్వతో ముఖ అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగాలని అద్వితీయమైనటువంటి దేశ ప్రగతికి కలాలను గళాలుగా వినిపించాలని తెలిపారు. అలాగే సీ.సా.స అధ్యక్షులు జనపాల శంకరయ్య సిరిసిల్ల జిల్లాలోని యువ రచయితలు ముందుకు రావాలని సమాజ శ్రేయస్సుకు తమ కలాలను ఎక్కు పెట్టాలని కోరారు. జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులు వెంగళ లక్ష్మణ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాటను పాడారు. అలాగే ఈ కార్యక్రమంలో సీ.సా.స గౌరవ అధ్యక్షులు కోడం నారాయణ, మరియు చిటికెన కిరణ్ కుమార్,జిల్లా రచయితల సంఘం యువజన కార్యదర్శి అంకారపు రవి, దూడం గణేష్, గుండెల్లి వంశీ, కోడం సురేష్, తదితర కవులు,రచయితలు పాల్గొన్నారు.
పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ సభ్యుల ఉత్సాహం మధ్యన అధ్యక్షుడు బియాంకర్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం చాలా అత్యున్నత దేశమని స్వతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పౌర సంక్షేమ సమితి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందాలని దానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. వివిధ విభాగాలలో విద్య వైద్యం మహిళా అభివృద్ధికి కృషి జరపవలసి ఉన్నదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బియ్యంకార్ శ్రీనివాస్,అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చిప్ప దేవదాసు, కోశాధికారి మరియు సభ్యులు వేముల పోశెట్టి,శివశంకర్,కోడం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్ క్రింద వీడియో కార్మికుల పిల్లలకి అందించే ఉపకార వేతనాల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ & డోలో మైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్ , క్రోమ్ ఓర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పరిధిలో బీడీ కార్మికుల పిల్లలందరికీ ఉపకార వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 6 నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసిన వారు, వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని అన్నారు. నేషనల్ స్కాలర్ షిప్ క్రింద 1 నుంచి 4వ తరగతి చదివే పిల్లలకు వెయ్యి రూపాయలు, 5 నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు 1500, 9 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు 2 వేల రూపాయలు, ఇంటర్ పిల్లలకు 3 వేల రూపాయలు, డిగ్రీ, పిజి డిప్లమా కోర్సుల చదివే పిల్లలకు 6 వేల రూపాయలు, ఐటిఐ పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 8 వేల రూపాయలు, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చేసే పిల్లలకు 25 వేల రూపాయల ఉపకార వేతనం అందుతుందని అన్నారు.
Collector Sandeep Kumar Jha
1 నుంచి 10వ తరగతీ వరకు చదివే విద్యార్థులు ఆగస్టు 31 లోపు,ఇంటర్ పై చదువు చదివి విద్యార్థులు అక్టోబర్ 31 లోపు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలందరూ ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తులు ఆగస్టు 31 లోపు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్హత గల బీడీ కార్మికుల పిల్లలందరూ scholarships.gov.in , జాతీయ స్కాలర్షిప్ కోర్ట్ నందు దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్లు కేంద్ర సంక్షేమ ఆసుపత్రి డా.మహేందేర్, డా.మధుకర్, డా.వెంకటేష్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్ జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దీన్ అదనాపు డిఆర్డిఏ శ్రీనివాస్ ఎంపీడీవోలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ అధ్యక్షతన జరిగిన డ్రగ్స్ నివారణ -చర్యల గూర్చి స్టూడెంట్ కౌన్సిలర్ శ్రీధర్ మరియు సామల వివేకానంద మాట్లాడుతూ విద్యార్థులు మాదగద్రవ్యాలకు, మత్తు పానీయాలకు ,సెల్ ఫోన్ లకు దూరంగా ఉండి మీ జీవితాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లాలని హితువు కోరారు. మాదగద్రవ్యాలను సేవించడం వల్ల వారి శరీరంలో అనేక రోగాలు కలుగుతాయని , అంతేగాకుండా మానసిక రుక్మతులకు గురి అవుతారని వారు తెలిపారు. ముఖ్యంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల విద్యార్థులు చదువుల యందు దృష్టి సాధించలేరని ఏకాగ్రత ఉండదని కాబట్టి వాటికి దూరంగా ఉండి మీ జీవితాన్ని మంచి మార్గాల వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతూ కానిస్టేబుల్ విజయ్ మరియు రాజు మాట్లాడుతూ సెల్ ఫోన్ల ద్వారా అనేకమైన సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మొదలైన యాప్స్ (apps)ద్వారా తమ యొక్క బ్యాంకులో నీ డబ్బులను నష్టబోతున్నారని వారు తెలియజేశారు.
వాటిపై అవగాహన కలిగి ఉండేలా ఎవరికి తమ నెంబర్లను మన అకౌంట్లను ఇవ్వవద్దని వారు తెలిపారు. ఏమైనా సైబర్ క్రైమ్ జరుగుతే వెంటనే 1930 నెంబర్ కు డయల్ చేసి మీరు ఏ విధంగా క్రైమ్ లో నష్టపోయారో వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంటీ డ్రగ్ పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ మరియు స్టూడెంట్ కౌన్సిలర్ శ్రీధర్, సామల వివేకానంద మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిరసన, ధర్నా చేసుకునే హక్కు లేకుండా ప్రభుత్వాలు అణి చి వేత ధోరణి ఏదైతే ఉందో ప్రభుత్వాలు మానుకోవాలి.కార్మికులు ధర్నా చేసే హక్కులను కాలరాస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా లో మధ్యాహ్న భోజన కార్మికులను రాష్ట్ర సీఐటీయూ పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వ చ్చేముందు మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావస్తున్న కూడా ఆ దిశగా అమలు చేయడం లేదు. అదే సందర్భంలో మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, గౌరవేతనం, నెలల తరబడి రాకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థికంగా నలిగిపోతున్న కూడా ఈ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందించకపోవడం వల్ల ఈరోజు అనగా 6, తేదీన చలో హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళుతున్నటువంటి కార్మికులను , నాయకులనుముందస్తు అరెస్టు చేయడాని తీవ్రంగా తప్పు పట్టడం జరుగుతుంది. జిల్లా సీఐటీయూ అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి గారిని, అలాగే మధ్యాహ్న భోజన కార్మికులను వెంటనే విడుదల చేయాలి, అలాగే తక్షణమే ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పూర్తిగా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా పత్రిక ముఖంగా మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ డిమాండ్ చేయడం జరుగుతుంది..
ఆగస్ట్ 1 వతేదినుండి 7 వ తేదివరకు దాదాపు 125 ప్రపంచదేశాలు తల్లిపాల వారోత్సవాల్ని జరుపుతున్నాయి. వరల్డ్ ఎలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏక్షన్ (ఔదీనా) సమన్వయకర్తగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, అనేక దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాయి. నవజాత శిశువుకు పుట్టినప్పటి నుండి సంపూర్ణంగా తల్లి పాలను మాత్రమే తాగించే సంస్కృతిని ప్రోత్సహించడానికి, పెంపొందించడానికి దోహదంచేసే అర్ధవంతమైన కార్యక్రమాలను ఫలప్రదంగా జరుపుతున్నారు.
తల్లిపాలను తాగని శిశువులకు తల్లి పాలను తాగే శిశువులకంటే మొదటి సంవత్సరంలోపు చనిపోయే ప్రమాదం 21 శాతం ఎక్కువ ఉంటుందని, కనీసం మొదటి 3 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం తాగిన పిల్లలకు చనిపోయే ప్రమాదం 38 శాతం తగ్గుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అనేక దేశాలలో, ముఖ్యంగా పేద దేశాలలో ఆమోదించలేని స్థాయిలో శిశు మరణాలు వుండడం వలన ఆ మరణాల్ని నివారించడానికి తీసుకోగలిగిన ప్రధాన చర్యలలో ఒకటిగా బిడ్డ పుట్టినప్పటి నుండి 6 నెలల వయసు వరకు కేవలం తల్లి పాలను మాత్రమే తాగించడాన్ని ప్రోత్సహించడానికి, ప్రజల్ని చైతన్యపరచడానికి, ముఖ్యంగా తల్లులు తమ బిడ్డకు తామిచ్చే అతి విలువైన బహుమతి ఆరోగ్యమేనని, తాము పాలివ్వడం ద్వారా ఆ బహుమతిని సులభంగా అందించవచ్చని తల్లులు తెలుసుకోవడానికి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరపడం ఒక విశిష్ట సాధనంగా వుంది.
తల్లి ఎప్పుడు పాలను పట్టడం ప్రారంభించాలి?
సహజ ప్రసవమైతే 2 గంటల లోపు, సిజేరియన్ అయితే 6 గంటల లోపు తల్లి బిడ్డకు పాలివ్వడం మొదలుపెట్టాలి. బిడ్డ రొమ్మును చీకుతూంటే తల్లి శరీరంలో కొన్ని నరాలు, గ్రంధులు ప్రతిస్పందించి పాల ఉత్పత్తి ప్రారంభమయేలా చేస్తాయి. అందుచేత తరచుగా రొమ్ముల్ని చీకించాలి. అలా చెయ్యడం వలన పాలు పడడమేకాక పాలు పడే సమయానికి బిడ్డకు పాలు తాగడం అలవాటవుతుంది.
తల్లిపాలలో ఉండే పోషకాలు:
1. నీరు:
తల్లి పాలలో ప్రధానంగా నీరు ఉంటుంది. ఇది శిశువు శరీరంలో నీరు అవసరమైనంత ఉండేలా చేస్తుంది.
2. మేక్రోన్యూట్రియంట్స్:
ప్రాచీన్స్: తల్లి పాలలో బిడ్డ సులభంగా జీర్ణం చేసుకోగల ప్రొటీన్స్ ‘వే ప్రోటీన్’, ‘కెసీన్’ ఉంటాయి.
పిండిపదార్ధాలు:
తల్లి పాలలో బిడ్డకు ప్రధాన శక్తిని ఇచ్చే ‘లేక్టోజ్ ఉంటుంది. లేక్టోజ్ జీర్ణవ్యవస్థలో ప్రయోజనకర బాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది.
క్రొవ్వులు:
మెదడు అభివృద్ధికి, శారీరక ఎదుగుదలకు అవసరమైన ఒమేగా ఫాటీ ఏసిడ్స్ 3, 6 తల్లి పాలలో ఉంటాయి.
మైక్రోన్యూట్రియంట్స్:
తల్లి పాలలో ఎ.ఇ.డి.కె.బి విటమిన్లు, ఐరన్, జింక్, కాల్షియం మొదలైన ఖనిజాలు ఉంటాయి. బిడ్డ వ్యాధినిరోధక శక్తి పెంపుదలకు, ఎముకల దారుఢ్యానికి, సమగ్ర శారీరక అభివృద్ధికి మైక్రోన్యూట్రియంట్స్.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడిగా టీ.వీ నారాయణ, మరియు కేంద్ర బాల సాహిత్య పురస్కార గ్రహీత (NBT) అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్ ఆధ్వర్యంలో మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగినది. (మారసం) నూతన అధ్యక్షుడిగా గెంట్యాల భూమేష్, మహిళా అధ్యక్షురాలిగా డాక్టర్ కందేపి రాణి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బూర దేవానందం, చిటికెన కిరణ్ కుమార్, ఉపాధ్యక్షురాలుగా జి. శ్రీమతి,అనిత చరణ్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఏలగొండ రవి, కార్య నిర్వహణ కార్యదర్శిగా జిందం అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శిగా అల్లే రమేష్, అంకారపు రవి, యువ కార్యదర్శిరాలుగా ఈడెపు సౌమ్య, మరియు మారసం సభ్యులుగా కామవరపు శ్రీనివాస్,దూడం గణేష్, పోకల సాయికుమార్,వంశీ, నర్సింములు,సౌమ్య సభ్యులు ఎన్నుకోవడం జరిగినది.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్వి కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం విద్యార్థుల సమక్షంలో అందజేయడం జరిగినది. విషయం రాష్ట్రంలోని గురుకుల రోజుకో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ హై విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుండి దాదాపు 95 మంది విద్యార్థులు చనిపోవడం జరిగినది.అలాగైనా ఈ ముఖ్యమంత్రి విద్యార్థుల సమస్యలపై మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమని తెలియజేస్తున్నాం తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నాయకత్వంలో గురుకుల వ్యవస్థ ఎంత ప్రతిష్టంగా ఉన్నదో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారైందని విద్యార్థి తల్లిదండ్రులు గురుకులాలకు పంపియాలంటేనే భయపడే పరిస్థితి తీసుకు వచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల గోస కనిపియ్యకపోవడం చాలా బాధాకరం తరగతి గదిలో చదువుకునే విద్యార్థులు నడిరోడ్డు మీదికి రావడం మా సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేదా అని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా గురుకుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రి పడుకున్నప్పుడు కలలోకి పోయి ఇటు బోధన చేయాలని అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లూరి సాయికిరణ్, ముధం అనిల్ గౌడ్, ఎస్.కె అప్రోచ్, హరీష్,జోయల్, శివ రాకేష్, కృష్ణ, వంశీ,రోహిత్,విష్ణు తదితరులు పాల్గొన్నారు
జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ,తెలంగాణ పోలీస్ శాఖ, మరియు జ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో పోలీసులు_ సామాజిక బాధ్యత అనే అంశం పై కవి సమ్మేళనం హైదరాబాద్ లో జరిగినందున ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులు రాంప్రసాద్ కేశి రాజు, ముఖ్య అతిథి ఐపీఎస్ ,ఎం రమేష్ డి.ఐ.జి ,వెంకట సాయి నాంపల్లి సీ.ఈ.ఓ జ్యోతి, విశ్వనాథ రాజు అధ్యక్షులు తెలంగాణ సారస్వత పరిషత్ తెలంగాణ శాఖ. తెలంగాణ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కవులు, రచయితలు డాక్టర్ జనపాల శంకరయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు,సర్వజన సంరక్షకుడు రక్షక భటుడు అనే అంశంపై తన కవితను ధారాళంగా ఆలాపించారు. బాలసాహితీవేత్త డాక్టర్ .వాసర వేణి పరుశురాం రక్షకభటులు కవిత చదివారు. సిరిసిల్ల సాహితీ సమితి కార్యదర్శి ముడారి సాయి మహేశ్ ,రక్షణ విలువ అనే అంశంపై తన కవితను విన్నవించారు. తర్వాత ముఖ్య అతిథులు ఘనంగా కవులను సత్కరించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డులోని పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్, గోపాల్ నగర్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జ్ కం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు.
గృహహింస మరియు మహిళలు ఎదుర్కొంటున్న అనేక చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు,జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, శ్రీ.గుర్రం ఆంజనేయులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్,ఈ.జ్యోతి, అడ్వకేట్లు,గెంట్యాల భూమేష్, తిరుపతి, అనుష, అరుణ, అలేఖ్య మరియు 19వ వార్డు మాజీ కౌన్సిలర్,అన్నారం శ్రీనివాస్, జి.జ్యోతి, డి.అనుష, టి.కావ్య, వి.సునీత మరియు వార్డు మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు 19వ వార్డు మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ మరియు మహిళలను జడ్జి రాధిక జైస్వాల్ అభినందించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.