సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు…

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహతి కళాశాలలో మానేరు రచయితల సంఘం అధ్యక్షులు గెంట్యాల భూమేష్ తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి సందర్భంగా కళాశాలలోని విద్యార్థులకు తెలంగాణ భాష దినోత్సవం పురస్కరించుకొని కాళోజి జయంతి వేడుకను పురస్కరించుకొని తాను మాట్లాడుతూ తెలంగాణ యాస భాష మన కాళోజీ అని నిజాం, నిరంకుశత్వానికి ఎదురుతిరిగిన కవితల యోధుడని, మా భాష,మన అస్తిత్వం, మన నేల భూమి మన తెలంగాణ పోరాటం అని తెలిపారు.అందులో భాగంగా ఆడెపు లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు మన భాష మన ఆస్తిత్వం ఎంతో ఉపయోగమని అలాంటి ఈరోజున తెలుగు భాషా దినోత్సవం కాళోజి జయంతి వేడుక మనకెంతో గర్వకారణం అని తెలిపారు.
కవి రచయిత బూర దేవానందం కాళోజి పై కవిత గానం చేశారు. ఈ కార్యక్రమంలో మానేరు రచయితల సంఘం గౌరవ సలహాదారులు, అధ్యక్షులు జర్నలిస్టు టీవీ నారాయణ,చిటికెన కిరణ్ కుమార్, అల్లే రమేష్, కామవరపు శ్రీనివాస్, పోకల సాయికుమార్, ఎండి ఆఫీస్, అధ్యాపకులు వేణు,అంకారపు రవి కవులు,రచయితలు మరియు మహతి కళాశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయం…

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయం అని ఎస్పీ తెలిపారు. కాళోజీ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే నివాళులర్పించరు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….

 

 

 

తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని,తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని,తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడుగా అభివర్ణించారు.భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానింపబడిన ప్రజాకవి కాళోజీ గారి స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు మధుకర్, యాదగిరి, సి.ఐ మధుకర్, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version