అతి త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం…

అతి త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం

– శ్రీ శివ భక్తమార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం

– శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పద్మశాలి కులబంధువులకు, హిందూ బంధువులకు సిరిసిల్ల మార్కండేయ వీధిలో అత్యంత పురాతనమైన విశిష్టమైన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం కై
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి ఒక కార్యచరణను ప్రారంభించింది.
దీనిలో భాగంగా ఈ రోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండే పద్మశాలి కుల బంధువులతో, హిందు బంధువులతో సమాజంలోని అందరిని కలుపుకుని పోయే విధంగా దేవాలయాల ఆధారంగా 22 సమావేశాలను శాంతి నగర్ నుండి భూపతినగర్ వరకు, చంద్రంపేట నుండి సాయినగర్ వరకు నిర్వహించి అభిప్రాయాలను సేకరించిందని అన్నారు.
దేవాలయ పునర్నిర్మాణం హిందూ సంఘటనా శక్తికి, ఆత్మ గౌరవానికి, సమరసతకు చిహ్నంగా శ్రీ లలితా పరమేశ్వరీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మా ణములో సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరినీ భాగస్వామ్యం చేయాలని భావించి అందుకు నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభించి తెలియజేపింది వారి అభిప్రాయాలను సేకరించిందనీ అన్నారు.
ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా అతి త్వరలోనే దేవాలయ నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభం చేస్తున్నామని అది కూడా వారం పది రోజులలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అన్నారు.

ఇటీవల అయోధ్య లో భవ్యమైన దిన్యమైన అయోధ్య రామమందిర నిర్మాణముకై జరిపిన నిధి సమర్పణ కార్య విధానమే స్ఫూర్తిగా తీసుకుని సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరం దేవుడి ముందర సమానమే అనే భావనతో ప్రయత్నం చేసి సిరిసిల్ల లో దివ్యమైన భవ్యమైన
శ్రీ మార్కండేయ ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఇది మనందరి సంఘటితశక్తికి, స్వాభిమానా ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉంటుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా తను మన ధనాన్ని భగవంతునికి దేవాలయానికి సమర్పించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి తెలిపింద
త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం తేదీని మీకు మీడియా ద్వారా తెలియపరుస్తామని అన్నారు.

దేవాలయానికి “ఇచ్చే ఒక ఇటుక కానీ, ఒక రూపాయి కానీ సమర్పణ చేస్తే తర తరాలకు పుణ్యం లభిస్తుంది . కావున ప్రతి ఒక్కరూ సమర్పణకి తను మన ధన ని సమర్పించి భాగస్వాములై భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నామనీ అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ,మాదాస శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, కోడం రవి, గుంటుక పురుషోత్తం, చిమ్మని ప్రకాష్, గాజుల సదానందం, గుడ్ల విష్ణు, జిందం రవి, ఎనగంటి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version